కరోనా వైరస్ సోకితే ఎక్కువగా వీరే చనిపోవచ్చు!

  • Published By: sreehari ,Published On : March 11, 2020 / 11:45 AM IST
కరోనా వైరస్ సోకితే ఎక్కువగా వీరే చనిపోవచ్చు!

Updated On : March 11, 2020 / 11:45 AM IST

కరోనా వైరస్ సోకితే ఎవరికి ఎక్కువగా ప్రాణాంతకం అనేదానిపై కొత్త పరిశోధన సంచలన విషయాలను వెల్లడించింది. కరోనా వైరస్ సోకినవారిలో వయస్సు పైబడినా, దీర్ఘాకాలిక వ్యాధులు ఉన్నట్టు అయితే వారిపై దీని ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటుంది. లండన్‌లో ఈ వారమే కొత్త కరోనా కేసులతో కలిపి 370కు చేరాయి. కరోనా వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా భయాందోళన నెలకొంది. 

అయితే, కరోనా వైరస్ సోకినవారందరిలోనూ దాని తీవ్రత ఒకే రకంగా ఉండదని కొత్త పరిశోధన చెబుతోంది. వయస్సు రీత్యా వచ్చే దీర్ఘాకాలిక వ్యాధులతో బాధపడేవారిలో కరోనా సోకితే ప్రాణాంతకంగా మారుతుందని రీసెర్చ్ పేర్కొంది. అంతేకాదు.. వారిలో రక్తగడ్డకట్టడం వంటి సమస్యలు ఉంటే మాత్రం కరోనా ప్రభావం అత్యధిక స్థాయిలో ఉంటుందని అధ్యయనం హెచ్చరిస్తోంది. వుహాన్ సిటీలోని రెండు ఆస్పత్రుల్లో కరోనా వైరస్ సోకిన 191 మంది బాధితులపై విశ్లేషించిన అధ్యయనం the lancet లో పబ్లిష్ అయింది.

ఈ అధ్యయనానికి రూపొందించిన వారిలో ఒకరైన డాక్టర్ Zhibo Liu .. వృద్ధాప్యం sepsis లక్షణాలు కనిపిస్తుంటాయి. high blood pressure, diabetes తోపాటు దీర్ఘాకాలికంగా వెంటిలేషన్ (non-invasive ventilation) ఉన్న రోగులకు వైరస్ సోకితే మరణం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటుందని జిబో లియూ వెల్లడించారు. వయస్సు రీత్యా వ్యాధులు, వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో వైరస్ ప్రభావం అధికంగా ఉంటుందని ఫలితంగా వారిలో గుండె, మెదడు, ఇతర అవయాలన్ని తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందన్నారు.

వైరస్ నుంచి కోలుకున్న బాధితుల్లో కూడా దాని తాలుకూ ఇన్ఫెక్షన్లు (age-related weakening) దీర్ఘకాలం పాటు ఉంటాయని అధ్యయనంలో గుర్తించారు. కోలుకున్న వారిలో వైరస్ ప్రభావం 20 రోజుల వరకు ఉంటుందని, రెండు వారాల కంటే ఎక్కువ రోజులు ప్రత్యేక వార్డులో ఉండాల్సిన అవసరం లేకపోవచ్చునని పరిశోధకులు గుర్తించారు. 

వైరస్ ప్రభావం తగ్గిపోయే కాలం విషయలంలో కన్ఫ్యూజన్ ఉండకూడదని ఆ విషయంలో స్పష్టత ఉండాల్సిన అవసరం ఉందన్నారు. Covid-19 వైరస్ సోకినప్పటికీ వారిలో ఎలాంటి వైరస్ లక్షణాలు కనిపించకపోయినా వారిలో వైరస్ ఇంక్యూబేషన్ ఆధారంగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

పేషెంట్లు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే ముందుగా Covid-19 వైరస్ నెగటీవ్ టెస్టులను అవసరమని సూచించినట్టు ఆయన తెలిపారు. కరోనా వైరస్ సోకిన వారిలో సగటున జ్వరం లక్షణాలు 12 రోజుల పాటు ఉంటాయని, 13 రోజుల వరకు శ్వాసకోసపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నాయని అధ్యయనం పేర్కొంది.