డోర్ హ్యాండిల్స్‌తో కరోనా వ్యాపించదు. సైంటిస్ట్‌ల భరోసా

  • Published By: murthy ,Published On : October 5, 2020 / 07:27 PM IST
డోర్ హ్యాండిల్స్‌తో కరోనా వ్యాపించదు. సైంటిస్ట్‌ల భరోసా

Updated On : October 5, 2020 / 7:52 PM IST

coronavirus on door handle : ఏది ముట్టుకున్నా కరోనా వస్తుందంటూ ఒకటే భయం. డోర్ తీయడానికి కూడా అనుమానం. అంత భయం అక్కర్లేదని అంటున్నారు అమెరికా సైంటిస్ట్‌లు. లైట్ స్విచ్‌లు, డోర్ హ్యాండిల్స్, ఏటీఎం కీబోర్డు లాంటిచోట్ల వైరస్ అనవాళ్లు ఉన్నా, అవి ఒకరికి కరోనా తీసుకొచ్చేటంత స్ట్రాంగ్ కాదని అంటున్నారు.

కరోనా వచ్చిన మొదట్లో అంటే మార్చిలో, మనం ఎక్కడ తాకినా వైరస్ అంటుకొంటుంది. ఆ చేతిలో ముఖాన్ని కనుక తాకితే, మనకు కోవిడ్ వస్తుందుని భయపడ్డాం.



University of Californiaనిపుణులు మాత్రం మనం మరీ ఎక్కువగా భయపడ్డామని అంటున్నారు. ఈ యూనివర్సిటిలోని మెడిసిన్ ప్రొఫెసర్ Monica Gandhi వైరస్ ఆనవాళ్లకు మనకు కరోనా తెప్పించేటంత శక్తి లేదని తేల్చేస్తున్నారు.

కరోనా వైరస్ ఉపరితలాలు అంటే surfaces ద్వారా వ్యాపించదు. వైరస్ మీద అవగాహనలేనికాలంలో అకారణంగా భయపడ్డాం. ఇప్పుడూ అలాగే భయపడుతున్నామని అంటున్నారు.

కరోనా రావడానికి మూలం ఉపరితలాలను ముట్టుకోవడం, లేదంటే కంటిని తాకడం వల్లకాదని ఇప్పుడు సైంటిస్ట్లకు అర్ధమైంది.



ఏ ఆఫీసును చూసినా అద్దాలను తుడుస్తూ, హ్యాండ్ డోర్లమీద antibacterial sprayచేస్తూ కనిపిస్తుంటారు. ఇలా చేస్తే కరోనాను అడ్డుకోగలమని అంటారు. అంతెందుకు, లిఫ్ట్ బటన్ ను నొక్కడానికి కూడా భయపడతారు. ఇంతగా భయపడాల్సింది లేదన్నది సైంటిస్ట్‌ల భరోసా. ఇంతకుముందు వరకు వైరస్ surfaceల మీద మూడురోజుల వరకు బతుకుతుందని అనుకున్నారు9. అందుకే ఏ షాప్ కెళ్లినా దేన్ని టచ్ చేయద్దని ఒకటే హడావిడి. ఒకవేళ ఎవరైనా తాకితే వెంటనే శానిటైజర్ ను వాడేస్తారు.



ఏ సూపర్ మార్కెట్ కెళ్లినా antibacterial spray తడిపేస్తుంటారు. బాస్కెట్, ట్రాలీ ఏదివాడినా, దాన్ని డిస్‌ఇన్‌ఫెక్ట్ చేయాల్సిందే.

ఇక Hand sanitiser వాడటం కంపల్సరీ.

నిజానికి కరోనా ఎక్కువగా వచ్చేది రోగి తుమ్మడం, చీదటం వల్లే. Lancetలో పబ్లిష్ అయిన స్టడీ ప్రకారం, surfaces మీద ఒకవేళ ఉన్న వైరస్ వల్ల వచ్చేది చాలా తక్కువ రిస్క్. చాలావరకు ఈ వైరస్ వల్ల కోవిడ్ రాకపోవచ్చు.