3.4శాతంకు చేరిన కరోనా మరణాల రేటు…కొత్తగా 12దేశాలకు సోకిన వైరస్

ప్రపంచదేశాలన్నీ ఇప్పుడు ఒకదానిపై యుద్ధం చేస్తున్నాయి. అదే కరోనా వైరస్. లాటిన్ బాషలో కరోనా అంటే కిరీటం అని అర్థం. కిరీటం ఆకారంలో ఈ వైరస్ ఉంటుంది కనుక దీనికి కరోనా అని పేరు పెట్టారు. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ కోవిడ్-19గా దీని పేరుని మార్చేసింది. ఇప్పటివరకు వ్యాక్సిన్ లేని ఈ వైరస్ చైనాలోని వూహాన్ సిటీలో మొదటిసారిగా గతేడాది నవంబర్ లో వెలుగులోకి వచ్చింది.
అయితే అప్పుడు అక్కడున్న డాక్టర్లు,ప్రజలు,అధికారులు దీన్ని లైట్ తీసుకున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO)కూడా మొదట్లో ఫిబ్రవరి వరకు గ్లోబల్ ఎమర్జెన్సీ గా ప్రకటించేందుకు ముందుకురాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. క్రమంగా ఈ వైరస్ ఎక్కువమందికి వ్యాప్తి చెందుతుండటం,అదీ మనిషి నుంచి మనిషికి సోకడంతో చైనా ఫుల్ అలర్ట్ అయ్యింది. ఏకంగా దాదాపు కోటి మంది ఉండే ఊహాన్ సిటీకే తాళం వేసేసింది. ఎవ్వరూ సీటీలోకి రాకుండా,సిటీలో ఉన్నవాళ్లు ఎక్కడికి వెళ్లకుండా,అసలు వూహాస్ సిటీలో ఉన్నవాళ్లు ఇంటి గడప దాటి పర్మిషన్ లేకుండా బయటకు రాకూడదని నిషేదాజ్ణలు విధించారు.
అయితే అప్పటికే వేలాదిమందికి కరోనా సోకింది. వూహాన్ సిటీ దాటి ఇతర దేశాలకు మొల్లగా కరోనా సోకడం మొదలైంది. 20కిపైగా దేశాల్లో ఇప్పుడు కరోనా వైరస్ సోకిన పేషెంట్లు ట్రీట్మెంట్ పొందుతున్నారు. ప్రస్తుతం చైనాలోనే కరోనా సోకిన 80వేలమందికి పైగా హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు.
అయితే కరోనా వైరస్ మొర్టాలిటీ రేట్(మరణాల రేటు)3.4శాతం చేరుకుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బుధవారం(మార్చి-4,2020)ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య పెరుగుతూ ఉన్నదని,మరణాల రేటు 3.4శాతం చేరుకున్నట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకిన వాళ్ల సంఖ్య 90వేల 893కు చేరింది. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3వేల 110. తమ దేశంలో మొదటి కరోనా కేసు నమోదైందంటూ కొత్తగా 12కొత్త దేశాలు రిపోర్ట్ చేశాయి. కరోనా వైరస్ సోకి అమెరికాలో 9మంది మరణించారు. స్పెయిల్ ఒక వ్యక్తి మరణించినట్లు మంగళవారం అక్కడి ప్రభుత్వం కన్ఫర్మ్ చేసింది.(కరోనాను తరిమికొట్టిన కేరళ 5 వ్యుహాలు ఏంటో తెలుసా?)
కరోనా కొత్తగా నమోదైనా దేశాలు తీసుకునే చర్యలకు,పెద్దసంఖ్య వైరస్ కేసులు నమోదైన దేశాలు తీసుకున్న చర్యలకు వ్యత్యాసం ఉంటుందని బుధవారం(మార్చి-4,2020)తన ప్రసంగంలో డబ్యూహెచ్ వో డైరక్టర్ జనరల్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కరోనా కేసులలో 3.4శాతం మంది చనిపోయారని ఆయన తెలిపారు.
కాలానుగుణ(సీజనల్) ఫ్లూ సాధారణంగా సోకిన వారిలో 1 శాతం కంటే తక్కువ మందిని చంపుతుందని,ఇన్ ఫ్యూయంజాకి ప్రస్తుతం వ్యాక్సిన్ ఉందని,కానీ కరోనా వైరస్ కు వ్యాక్సిన్ లేదని ఆయన తెలిపారు. కరోనా వైరస్-ఇన్ ఫ్యూయంజాకి మధ్య వ్యత్యాసాన్ని ఆయన నొక్కి చెప్పారు. రెండు వైరస్ ల మధ్య వ్యత్యాసం అర్థం కరోనా వైరస్ ఫ్యూ మాదిరిగా ట్రీట్ చేయబడదు అని కాదని ఆయన తెలిపారు.
దేశాలు మొదటి నుండి ప్రారంభం కావడం లేదని అర్థం చేసుకోవడానికి తగినంత సారూప్యతలు ఉన్నాయని, దశాబ్దాలుగా, ఇన్ ఫ్యూయంజాను గుర్తించడానికి మరియు ప్రతిస్పందించడానికి అనేక దేశాలు తమ వ్యవస్థలను రూపొందించడానికి పెట్టుబడులు పెట్టాయని తెలిపారు. మరోసారి, ఇది సంఘీభావం ప్రశ్న అని ఆయన తెలిపారు. ఇది WHO కానీ,ఒక ఇండస్ట్రీ కాని సొంతంగా పరిష్కరించలేదని, మిగతా దేశాలను రక్షించే ప్రజలను అన్ని దేశాలు రక్షించగలవని నిర్ధారించడానికి మనమందరం కలిసి పనిచేయడం అవసరం అని WHO డైరక్టర్ జనరల్ తెలిపారు.