కొత్త రిపోర్ట్…కోరోనా వైరస్ మలం గుండా సోకుతుందట

  • Published By: venkaiahnaidu ,Published On : February 10, 2020 / 01:31 PM IST
కొత్త రిపోర్ట్…కోరోనా వైరస్ మలం గుండా సోకుతుందట

Updated On : February 10, 2020 / 1:31 PM IST

కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచదేశాలు గజగజ వణుకుతున్నాయి.  చైనాలో ఈ వైరస్ బారిన పడి ఇప్పటివరకు 908మంది ప్రాణాలు కోల్పోయినట్లు,41,171మందికి పాజిటివ్ అని తేలి హాస్పిటల్ లో ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే అనధికారిక లెక్కల ప్రకారం చైనాలో 24వేల మంది మృతి చెందినట్లు సమాచారం.

ఇప్పటికే వరల్డ్ హైల్త్ ఆర్గనైజేషన్ దీనిని గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. దీంతో ఎక్కడికక్కడ అన్ని దేశాలు అలర్ట్ అయ్యాయి. వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచంలోని సైంటిస్టులు కృషి చేస్తున్నారు. అయితే ఈ సమయంలో ఈ వైరస్ కు సంబంధించిన మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. మలం ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు తెలిసింది.

AFP లో పబ్లిష్ అయిన రీసెంట్ రిపోర్ట్ ప్రకారం… డయేరియా(విరోచనాలు) కరోనావైరస్ వ్యాప్తికి రెండవ మార్గం అయి ఉండవచ్చు. మొదటగా వైరస్ సోకిన వ్యక్తి దగ్గు నుండి వైరస్ నిండిన బిందువులు వచ్చి పక్క వ్యక్తికి వైరస్ సోకుతుందని నమ్మిన విషయం తెలిసిందే. అయితే ప్రారంభ సందర్భాల్లో శ్వాసకోశ లక్షణాలతో బాధపడుతున్న రోగులపైనే తాము ప్రధానంగా దృష్టి సారించారని, జీర్ణవ్యవస్థతో సంబంధం ఉన్నవారిని పట్టించుకోలేదని రీసెర్చర్లు అంగీకరించారు.

జర్నల్ ఆఫ్ ది అమెరికా మీడియా (JAMA) లో చైనా ఆథర్స్ తెలిపిన ప్రకారం…జ్వరం మరియు శ్రమతో కూడిన శ్వాస తీసుకోడానికి ముందు వుహాన్ ఆసుపత్రిలో 138 మంది రోగులలో మొత్తం 14 మంది, మొదటగా ఒకటి లేదా రెండు రోజులు అతిసారం మరియు వికారంతో బాధపడ్డారు. కరోనా వైరస్ తో బాధపడుతున్న మొదటి US రోగి కూడా రెండు రోజులు వదులుగా ప్రేగు కదలికలను అనుభవించాడని నివేదిక తెలిపింది. పేషెంట్ మలంలో తరువాత వైరస్ కనుగొనబడిందని నివేదిక తెలిపింది. . చైనాలోలో ఇలాంటి ఇతర కేసులు తరచూ నమోదు అవుతున్నట్లు తెలిపింది.