Covid vaccine: కరోనాను వైరస్‌ను వ్యాక్సిన్లు నాశనం చేయగలవా? అక్టోబర్ 22న తేలిపోనుంది

  • Published By: sreehari ,Published On : August 21, 2020 / 03:08 PM IST
Covid vaccine: కరోనాను వైరస్‌ను వ్యాక్సిన్లు నాశనం చేయగలవా? అక్టోబర్ 22న తేలిపోనుంది

Updated On : August 21, 2020 / 4:26 PM IST

కరోనా వైరస్‌ను రాబోయే వ్యాక్సిన్లు నాశనం చేయగలవా? వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే.. ఎంతకాలం పాటు వైరస్ నుంచి నిరోధించగలదు? ఇలాంటి ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందా? లేదో కూడా స్పష్టత లేదు.. ప్రపంచవ్యాప్తంగా అనేక కరోనా వ్యాక్సిన్లు ట్రయల్స్ దశలో ఉన్నాయి. కొన్ని ట్రయల్స్ పూర్తి చేసుకుని ఉత్పత్తిలోకి అడుగుపెడితే.. మరికొన్ని ప్రజలకు పంపిణీ చేసే దిశగా సాగుతున్నాయి.

వాస్తవానికి వచ్చే కరోనా వ్యాక్సిన్లు వైరస్ మహమ్మారిని అంతం చేయగలవా? లేదో ఈ ఏడాదిలో అక్టోబర్ 22న తేలిపోనుంది.. కోవిడ్ -19 వ్యాక్సిన్లపై చర్చించడానికి అక్టోబర్ 22న యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సలహా ప్యానెల్ సమావేశాన్ని నిర్వహించాలని యోచిస్తున్నట్లు ఏజెన్సీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మోడెనా ఇంక్, ఫైజర్ ఇంక్, ఆస్ట్రాజెనెకా పిఎల్‌సి నుంచి ప్రముఖ టీకాలు పెద్ద ఎత్తున క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించడంతో ప్రత్యేకత నెలకొంది..



కరోనావైరస్ వ్యాక్సిన్ సమర్థవంతంగా ఎంతవరకూ పనిచేయగలదో లేదో నిర్ణయించే ఉన్నత యుఎస్ హెల్త్ రెగ్యులేటర్.. ట్రయల్స్ వాలంటీర్ల నమోదు ఆధారంగా అంచనా వేయనుంది.. అక్టోబర్ నాటికి వ్యాక్సిన్ పనితీరుకు సంబంధించి పూర్తి స్థాయిలో డేటా అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

టీకాకు సంబంధించి నియంత్రణ సమస్యలపై కమిటీ ఇంకా చర్చించాల్సి ఉందని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సెంటర్ ఫర్ బయోలాజిక్స్ ఎవాల్యుయేషన్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ పీటర్ మార్క్స్ అన్నారు. ఫైజర్ ఇంక్ బయోఎంటెక్ SE సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కోవిడ్ -19 వ్యాక్సిన్ అక్టోబర్ నాటికి రెగ్యులేటరీ రివ్యూకు పంపనుంది..



ట్రయల్స్‌లో పాల్గొన్న వారిలో 20శాతం కన్నా తక్కువ మందికి తేలికపాటి నుంచి జ్వరాలను ఈ టీకా బాగా తట్టుకోగలదని కంపెనీలు తెలిపాయి. యుఎస్, జర్మనీలలో ఫేజ్ 1 ట్రయల్స్ నుంచి డేటాను కంపెనీలు విశ్లేషించనున్నాయని తెలిపారు. 100 మిలియన్ మోతాదుల వ్యాక్సిన్‌ను యుఎస్‌కు సరఫరా చేయడానికి ఫైజర్, బయోఎంటెక్ గత నెలలో 2 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నాయి.

అమెరికాలో, కరోనా టీకాను ఉత్పత్తి చేసే రేసులో ట్రంప్ ప్రభుత్వం కేంద్రంగా మారింది. అర డజనుకు పైగా కరోనావైరస్ వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడానికి అమెరికా ప్రభుత్వం దాదాపు 11 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. ఈ నెల ప్రారంభంలో రష్యా స్పుత్నిక్ V అని పిలిచే వ్యాక్సిన్‌ను ఆమోదించింది.



అయినప్పటికీ షాట్ ఇప్పటికీ హ్యుమన్ ట్రయల్స్ మధ్యలో ఉంది. దీనిని మాస్కో గమలేయ ఇన్స్టిట్యూట్, సావరిన్ రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అభివృద్ధి చేశాయి. అక్టోబర్ నెలలో విస్తృతంగా టీకాను పంపిణీ చేయాలని యోచిస్తోంది. మరోవైపు చైనా కోవిడ్ వ్యాక్సిన్లను ప్రపంచవ్యాప్తంగా బ్రెజిల్, ఇండోనేషియా, సౌదీ అరేబియా వంటి వైరస్ హాట్‌స్పాట్‌లకు పంపించింది.