Diabetes: చిన్నపిల్లల్లో పెరుగుతున్న మహమ్మారి.. ఈ లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకండి

భారతదేశంలో మధుమేహం పంజా విసురుతోంది. రోజురోజుకి ఈ మహమ్మారి భారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

Diabetes: చిన్నపిల్లల్లో పెరుగుతున్న మహమ్మారి.. ఈ లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకండి

diabetes in kids

Updated On : June 7, 2025 / 4:47 PM IST

భారతదేశంలో మధుమేహం పంజా విసురుతోంది. రోజురోజుకి ఈ మహమ్మారి భారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే.. తాజా అధ్యాయనాలు ఒకింత విస్మయానికి గురి చేస్తున్నాయి. అదేంటంటే.. చిన్న పిల్లలు సైతం ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అంతర్జాతీయ డయాబెటిస్ ఫెడరేషన్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 0-19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు 1.2 మిలియన్ల మంది మధుమేహం బారిన పడ్డారు. అందులో భారతదేశంలోనే ఎక్కువ మంది ఉండటం అందరినీ భయపెడుతున్న విషయం. పిల్లలు తమకు తెలియకుండానే ఈ వ్యాధితో భాదడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో దీని ప్రాబల్యం ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు చెప్తున్నాయి.

కాబట్టి తల్లితండ్రులు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. నిపుణుల సూచనల ప్రకారం అనుమానంగా ఎలాంటి లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకూడదు అని. అహ్మదాబాద్‌లోని బీజే మెడికల్ కాలేజ్ అధ్యయనం ప్రకారం.. టైప్ 1 మధుమేహం ఉన్న పిల్లల్లో 81.4% కేసులలో అధిక మూత్రవిసర్జన, అధిక దాహం లక్షణాలు కనిపించాయి. కాబట్టి పిల్లల్లో ఇలాంటి లక్షణాల పట్ల తల్లితండ్రులు అప్రమత్తంగా ఉండాలి. లేదంటే అది ప్రాణాపాయంగా మారే అవకాశం ఉంది.

ఒకవేల సమస్య అదే తెలిస్తే ఆ తరువాత కూడా చాలా జాగ్రత్తలు వహించాలి. జీవన విధానంలో, ఆహరం విషయంలో కేర్ తీసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని వారికి అందించాలి. శారీరక శ్రమతో పాటు వ్యాయాయం అలవాటు చేయాలి. షుగర్ లెవల్స్ నో రెగ్యులర్ గా చెక్ చేయించుకోవాలి. లేదంటే పిల్లలపై ఇది తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది.