COVID-19 Update : ప్రస్తుతం కోవిడ్-19 లక్షణాలు ఎలా ఉన్నాయి? కేసుల సంఖ్య పెరుగుతుండటంతో డాక్టర్లు ఏం చెబుతున్నారు?

తాజాగా కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. గత వేవ్‌లతో పోలిస్తే తేలికపాటి లక్షణాలతో జనం బయటపడుతున్నా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోకపోతే ఇతర వైరస్‌లు, ఇన్‌ఫెక్షన్‌లు కూడా ఇలాంటి లక్షణాలతో వ్యాప్తికి దారి తీస్తాయని హెచ్చరిస్తున్నారు.

COVID-19 Update : ప్రస్తుతం కోవిడ్-19 లక్షణాలు ఎలా ఉన్నాయి? కేసుల సంఖ్య పెరుగుతుండటంతో డాక్టర్లు ఏం చెబుతున్నారు?

COVID-19 Update

COVID-19 Update : గతంతో పోలిస్తే భారతదేశంలో కోవిడ్-19 కేసులు సంఖ్య తగ్గిందనే చెప్పాలి. ప్రస్తుతం ఆర్క్టురస్ అని పిలువబడే XBB 1.16 వేరియంట్ ఇన్‌ఫెక్షన్‌కి కారణం అవుతోందట. అయితే ప్రస్తుతం కోవిడ్ సోకిన వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి?

Covid : కోవిడ్ బిజినెస్‌ని దెబ్బతీసినా ఆత్మస్థైర్యంతో నిలబడ్డ జంట..ఇప్పుడు ఫుడ్ స్టాల్ నడుపుతూ..

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, బాడీ పెయిన్స్, కండరాల నొప్పులు, గొంతు నొప్పి, జలుబు, ఛాతీ నొప్పి, తలనొప్పి ఇవన్నీ గతంలో కోవిడ్ సోకిన వారిలో కనిపించిన ప్రధాన లక్షణాలు. కొన్ని వారాలుగా కోవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం వైరస్ సోకిన వారిలో తలనొప్పి, జ్వరం, జీర్ణకోశ సమస్యలు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అదీ తేలికపాటి లక్షణాలతో బయటపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఆక్సిజన్, వెంటిలేటర్ వరకూ వెళ్లేంత తీవ్రత లేకపోవడం గమనార్హం.

 

ఇక కోవిడ్-19‌తో పాటు ఇతర వైరస్‌లు, ఇన్‌ఫెక్షన్‌లు కూడా ఇలాంటి లక్షణాలతో ఉండటం వల్ల అవి న్యూమోనైటిస్‌కు దారి తీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఈ లక్షణాలు ఉన్నవారు సరైన వైద్యం తీసుకోవడం ద్వారా ఇతరులకు వైరస్ సోకకుండా నిరోధించవచ్చని సూచిస్తున్నారు.

Gurugram: కోవిడ్ భయంతో మూడేళ్లుగా ఇంటి నుంచి బయటకు రాని తల్లీకొడుకు.. మూడేళ్లుగా ఎలా ఉన్నారంటే

ఇక కరోనా సమయంలో చాలామంది రుచి, వాసన కోల్పోతారు. అవి తిరిగి ఎప్పుడు పొందగలమా? అని ఆందోళన చెందుతారు. స్వల్పంగా వైరస్ బారిన పడిన వారు 1 నుండి 3 నెలల తర్వాత రుచి, వాసన తిరిగి పొందగలరట. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో కొందరికి 8-12 వారాలు పట్టవచ్చని.. మరికొందరిలో 18-20 నెలలు కూడా పడతుందని వైద్యుల నివేదికలు చెబుతున్నాయి. కాబట్టి జనం వైరస్ తీవ్రత పెరుగుతున్న సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మరింత వ్యాప్తి చెందకుండా అరికట్టిన వారవుతారు.