Rainy Season Diseases : వర్షకాలంలో వీటి జోలికి వెళ్ళి రోగాలు కొనితెచ్చుకోకండి!

వర్షాకాలంలో అధిక శాతం జబ్బులకు కారణం కలుషితమైనే నీరే. కలుషిత నీటి ద్వారా బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు వ్యాపించే ప్రమాదం ఉంది. తద్వారా కడుపులో ఇన్ఫెక్షన్లు, డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

Rainy Season Diseases : వర్షకాలంలో వీటి జోలికి వెళ్ళి రోగాలు కొనితెచ్చుకోకండి!

rainy season Foods

Rainy Season Diseases : వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు చాలా మందిని ఆసుపత్రిపాలు చేస్తుంటాయి. వాతావరణంలో అకస్మాత్తుగా చోటు చేసుకునే మార్పులతోపాటు మనం తీసుకునే ద్రవ,ఘనరూప ఆహారాలు కూడా ఇందుకు కారణమౌతాయి. వర్షకాలంలో ప్రమాదకర రోగాల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించటం మంచిది. ముఖ్యంగా తీసుకునే ఆహారం విషయంలో శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. వర్షా కాలంలో జీర్ణ వ్యవస్థ పనితీరు కాస్త మందగిస్తుంది. ఈ సమయంలో తేలిక పాటి ఆహారాలను మాత్రమే తీసుకోవాలి. అలా కాకుండా నూనెలలో వేయించిన ఆహార పదార్థాలను తీసుకుంటే ఇబ్బందులు తప్పవు. చాలా మంది బజ్జీలు, పకోడీలు, సమోసాలు వంటి వాటిని తింటుంటారు. ఇలా చేయటం వల్ల అజీర్తి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.

బయట దొరికే జంక్ ఫుడ్ ను కూడా వీలైనంత వరకు దూరం పెట్టడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే వర్షా కాలంలో ఆకుకూరల ద్వారా బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని పలు అధ్యయనాల్లో తేలిన నేపధ్యంలో వర్షకాలంలో సాధ్యమైనంత వరకు వాటిని తినకుండా ఉండటం మంచిది. ఆకూరలు తీసుకోవటం వల్ల ఇవి జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది.

ఇక వర్షాకాలంలో అధిక శాతం జబ్బులకు కారణం కలుషితమైనే నీరే. కలుషిత నీటి ద్వారా బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు వ్యాపించే ప్రమాదం ఉంది. తద్వారా కడుపులో ఇన్ఫెక్షన్లు, డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి సాధమైనంత వరకు నీటిని వేడి చేసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగటం మంచిది.

రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు ;

అల్లం, పసుపు, నల్ల మిరియాలు, లవంగం వంటి సుగంధ్ర ద్రవ్యాల్లో క్రిమినాశక మరియు రోగ నిరోధక లక్షణాలు ఉంటాయి. ఇవి జలుబు, దగ్గు వంటి వాటి నుంచి రక్షణ కల్పిస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి వీటిని వంటల్లో చేర్చితే సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. గ్రీన్ టీ, లెమన్ టీ కూడా ఆరోగ్యానికి మంచివేనని పలు అధ్యయనాల్లో తేలింది. వీటికి అన్ని రకాల ఇన్ఫెక్షన్లను నివారించే గుణాలు ఉన్నాయి. నిమ్మ, బత్తాయి వంటి వాటిలో విటమిన్ సి ఉంటుంది. ఇది మన రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. కాబట్టి ఏదోక రూపంలో వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల సీజనల్ వ్యాధుల నుంచి బయటపడవచ్చు.