Biryani: బిర్యానీ లవర్స్ కి బ్యాడ్ న్యూస్.. ఆపదలో గుండె.. నిర్లక్ష్యం చేస్తే పెను ప్రమాదం
బిర్యానీలో కొవ్వులు, అనారోగ్యకరమైన ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. నాణ్యత లేని నెయ్యి, ఆయిల్ వాడితే అవి మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది.

Health problems with biryani
బిర్యానీ.. ఈ మాట వినగానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి. నిజం చెప్పాలంటే చాలా మందికి ఇష్టమైన ఫుడ్ కూడా బిర్యానీనే. ఇక హైదరాబాద్ లాంటి సిటీల గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే. గల్లీ గల్లీలో బిర్యానీ హోటల్స్ ఉంటాయి. లేదా ఆదివారం వచ్చిందంటే ఇంట్లో బిర్యానీ వండాల్సిందే. అంతలా జనాలు బిర్యానీ అంటే ఇష్టపడతారు. ఇక్కడివరకు ఒకే కానీ, బిర్యానీ ఎక్కువగా తినడం వల్ల మనిషి ఆరోగ్యానికి తీవ్రమైన నష్టం జరుగుతుందట. అదేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
బిర్యానీలో కొవ్వులు, అనారోగ్యకరమైన ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. నాణ్యత లేని నెయ్యి, ఆయిల్ వాడితే అవి మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇవి మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి. దీంతో ఆ కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో చేరి రక్తప్రసరణకు అడ్డుపడుతుంది. దానివల్ల గుండె జబ్బులు, హార్ట్ అటాక్ లు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకండా.. బిర్యానీలో ఉప్పు అధికంగా ఉంటుంది. కాబట్టి బిర్యానీని తరుచుగా తినడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి హాయ్ బీపీ వస్తుంది. ఇది హార్ట్ స్ట్రోక్‌లకు కారణం కావచ్చు. అలాగే బిర్యానీలో వాడే కొన్ని పదార్థాలు కిడ్నీలపై కూడా ప్రభావం చూపిస్తాయి.
బిర్యానీలో క్యాలరీలు అధికంగా ఉండే మాంసం, బియ్యం, జీడిపప్పు, నెయ్యి, నూనె వాడుతారు. దాంతో శరీరంలో పెద్ద ఎత్తున క్యాలరీలు చేరి అవి కొవ్వుగా మారుతాయి. తరచూ బిర్యానీ తింటే అధికంగా బరువు పెరిగి స్థూలకాయం వచ్చే ప్రమాదాం ఉంది. క్రమంగా ఇది టైప్ 2 డయాబెటిస్, లివర్ సమస్యలకు దారితీస్తుంది.
అంతేకాకుండా బిర్యానీని అధికంగా తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది. అజీర్తి, కడుపు ఉబ్బరం, అసిడిటీ, గుండెలలో మంట, మలబద్దకం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బిర్యానీలో వాడే మసాలాలు కూడా గుండె జబ్బులకు కారణం కావచ్చు. మరీ ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి, బిర్యానీ తరుచు తినే విషయంలో కాస్త జాగ్రత్త వహించడం మంచిది.