కరోనాకు అమెరికా చిక్కింది, విలవిల్లాడుతోంది : చైనా, ఇటలీని దాటేసిన పాజిటీవ్ కేసులు

అగ్రరాజ్యం అమెరికా కరోనా కోరల్లో విలవిలాడిపోతోంది. కరోనా వైరస్ కేంద్రమైన చైనాలోని వుహాన్ సిటీ కంటే అమెరికాలోనే భారీ సంఖ్యలో కొవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి. చైనా, ఇటలీ దేశాల్లో నమోదైన కరోనా కేసుల కంటే అమెరికాలోనే 86,012 కేసులు నమోదయ్యాయి. అమెరికాలో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు సంభవించాయి. గురువారం ఒక్క రోజే 246 మంది మృతిచెందారు.
దాంతో అక్కడ కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 1,301కు చేరింది. అమెరికా భూభాగంలోని న్యూయార్క్ సిటీలో జాతీయవ్యాప్తంగా దాదాపు 27 శాతం కరోనా కేసులు నమోదయ్యాయి. న్యూయార్క్ రాష్ట్రంలో మొత్తం 23,112 కేసులు నమోదు కాగా, 365 మంది మృతిచెందారు. ఇతర దేశాలైన జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లో కంటే అత్యధికంగా నమోదయ్యాయి.
ఈ దేశాల్లో 285, 207 మంది కరోనా సోకి మృతిచెందారు. అమెరికాలో మాత్రమే కరోనా ప్రాణాంతకంగా మారడానికి ముఖ్య కారణం.. అక్కడ టెస్టింగ్ మెటేరియల్స్ లోపాలే అంటున్నారు. నాణ్యత లేని టెస్టింగ్ మెటేరియల్స్ కారణంగా కరోనా కేసులను గుర్తించడంలో విఫలమైంది.
అన్ని శాంపిల్స్ అట్లాంటాలోని యూఎస్ సీడీసీ కేంద్రకార్యాలయానికి పంపించారు. దాంతో శాంపిల్స్ పై విశ్లేషణించి ఫలితాలు వచ్చేలోపే జరగాల్సిన దారుణం జరిగిపోయింది. మార్చి నెల మధ్య నాటికి తక్షణమే కరోనాను కంట్రల్ చేసిన కొద్ది దేశాల్లో సౌత్ కొరియా ఒకటిగా నిలిచింది. ఇక్కడ రోజుకు 15వేల మందికి పరీక్షలు నిర్వహించి వైరస్ కట్టడి చేయడంలో సక్సెస్ సాధించింది.
అదే అమెరికా మాత్రం మొత్తం మీద 11వేల టెస్టులను మాత్రమే పూర్తిచేయగలిగింది. సౌత్ కొరియాతో పోలిస్తే 130 రేట్లు కంటే తక్కువగా అమెరికా టెస్టింగులు నిర్వహించింది. కొవిడ్-19 టెస్ట్ కిట్స్ మాత్రమే కాకుండా సౌత్ కొరియా నుంచి కూడా అమెరికా సాయం కోరుతోంది. అంతేకాదు.. అమెరికాలో వైద్య పరికరాల కొరత కూడా కనిపిస్తోంది. వెంటిలేటర్లు చాలా తక్కువగా ఉన్నాయి.
ప్రస్తుతం 175వేల వెంటిలేటర్లు మాత్రమే ఉన్నాయి. కానీ, కరోనా వైరస్ బాధితులు మాత్రం ఒక మిలియన్ (10 లక్షల మంది) వరకు ఉన్నారు. సౌత్ కొరియా తరహాలో కరోనాను కట్టడి చేయాలంటే అమెరికా ఎలాంటి దయానీయ పరిస్థితుల్లో ఊహించడానికే భయమేస్తోంది.
Also Read | హోం క్వారంటైన్ లో కమల్ హాసన్, ఆందోళనలో అభిమానులు, అసలేం జరిగిందంటే..