ఎందుకిలా? : పాలు దొరకడం కష్టమేనా?.. ధరలు పైపైకి!

రోజురోజుకీ పాలు దొరకే పరిస్థితి కనిపించడం లేదు. పాల సరఫరా కూడా కష్టంగా మారుతోంది. దీంతో పాల ధరలు సైతం అమాంతం పెరిగిపోతున్నాయి. పాల సరఫరాపై కనీస రిటైల్ ధర కూడా భారీగా పెరిగిపోతోంది. గుజరాత్ కోఆపరేటీవ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF)ఆధ్వర్యంలో నడిచే రెండు ప్రధాన డెయిరీల్లో అమూల్, మదర్ డెయిరీలంటే అందరికి బాగా తెలుసు. నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డు (NDDB) సొంత అనుబంధ సంస్థలు కూడా. అమూల్, మదర్ డెయిరీలు ఒక్కో ప్యాకెట్‌పై లీటర్ రూ.2 చొప్పున పెంచినట్టు (NDDB) ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ఏడాదిలో రెండోసారి :
2019లో మదర్ డెయిరీ, అమూల్ డెయిరీలు పాల ధరలను పెంచడం ఇది రెండోసారి. ఢిల్లీ NCR సర్కిళ్లలో ఒక లీటర్ మిల్క్ క్రీమ్ భారీగా పెరిగింది. ఫిబ్రవరి 1, 2014 నుంచి లీటర్ పాల ధర రూ.46 ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ.56 వరకు పెరిగింది. అదే సమయంలో టోన్డ్ మిల్క్ లీటర్ ధర కూడా రూ.36 నుంచి రూ.46కు పెరిగిపోయింది.
వినియోగదారుల ఆహార ద్రవ్యోల్బణం పెరగడంతో పాల ధరలు కూడా పెరిగి నవంబర్ నాటికి 10.01శాతానికి తాకాయి. డిసెంబర్ 2013 నుంచి సింగిల్ డిజిట్ దాటడం ఇదే తొలిసారి కూడా. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ పాల సేకరణ 4శాతం నుంచి 5 శాతానికి క్షీణించినట్టు కోఆపరేటీవ్, ప్రైవేట్ డెయిరీలు నివేదించాయి.
6 శాతానికి తగ్గిన పాల సేకరణ :
30లక్షల పాల ఉత్పత్తిదారులకు కిలో ప్యాట్‌కు రూ.100 నుంచి రూ.110 వరకు చెల్లిస్తున్నప్పటికీ పాల సేకరణలో తొలిసారి 5శాతం నుంచి 6 శాతానికి పడిపోయినట్టు GCMMF యూనియన్లు తెలిపాయి. గత ఏడాది కాలంలో స్కిమ్ చేసిన పాల పౌడర్ ధరలు రెట్టింపు స్థాయిలో కిలోకు రూ.300 చొప్పున పెరిగాయి. ఇందుకు కారణం.. పాల సరఫరా కష్టంగా మారడం కావొచ్చు లేదా పాక్షిక వాతావరణం, పాక్షిక నిర్మాణ సంబంధిత సమస్యలు అయి ఉండొచ్చు.
ఈ రెండు కారణాల వల్లే :
మరోవైపు అక్టోబర్ నుంచి మార్చి వరకు ఉష్ణోగ్రత, తేమ సాధారణంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో పాల ఉత్పత్తి బాగా పెరగాలంటే.. పశువులకు మంచి దానా, నీరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. సెప్టెంబర్ నుంచి నవంబర్ కాలంలో వర్షాల కారణంగా ఈసారి పాల ఉత్పత్తి ఆలస్యమైంది.
ఆగి ఆగి వర్షాలు పడటంతో బహిరంగ ప్రదేశాల్లో పశువులు ఉన్నచోట నీళ్లు నిలిచిపోవడం కూడా మరో కారణంగా చెప్పవచ్చు. ఇప్పుడు శీతాకాలం వచ్చేసింది.. వర్షాలు కూడా తగ్గిపోయాయి.. ఇక పాల ధార పెరగడమే మిగిలింది అని దక్షిణ ఆధారిత ప్రైవేట్ రంగ డెయిరీ సంస్థ చైర్మన్ ఒకరు తెలిపారు.
వాతావరణ మార్పులతో పాటు నిర్మాణ సంబంధతమైన కారణాలు కూడా ఉన్నాయి. GCMMF మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎస్ సోథీ మాట్లాడుతూ.. మూడేళ్ల కాల పరిమితికి పాలపై తక్కువ ధరలను పొడిగించడంతో రైతులంతా పశువుల పోషణ, వాటి ఆరోగ్యంపై పెట్టుబడి తగ్గించినట్టు తెలిపారు. మొక్కజోన్న, పత్తివిత్తనం నుంచి తయారైన ఆయిల్ కేక్ సహా ఇతర పోషణ దినుషుల ఖరీదు పెరిగిపోవడం కూడా మరో కారణమని చెప్పారు.