Eye Infections : ఢిల్లీలో భారీగా పెరిగిన కండ్ల కలక కేసులు.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు

ఓ వైపు భారీ వర్షాలకు ఫ్లూ, డెంగ్యూ వంటివి ప్రబలుతుంటే.. కండ్ల కలక ప్రజల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ఢిల్లీలో కండ్ల కలక కేసులు విపరీతంగా పెరడటంతో జనం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వద్ద క్యూ కడుతున్నారు.

Eye Infections : ఢిల్లీలో భారీగా పెరిగిన కండ్ల కలక కేసులు.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు

Eye Infections

Eye Infections : వర్షాకాలంలో డెంగ్యూ, ఫ్లూ వంటివే కాదు.. కంటి ఇన్ఫెక్షన్లు కూడా వేగంగా పెరుగుతాయి. దేశ రాజధాని ఢిల్లీలో కండ్ల కలక కేసుల సంఖ్య విపరీతంగా పెరిగినట్లు వైద్యులు చెబుతున్నారు. కండ్ల కలక సోకితే జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Zebra line On Road : వర్షాకాలంలో జీబ్రా లైన్ దాటేటప్పుడు బీ కేర్ ఫుల్ .. తెలుపురంగుపై ‘అడుగు’ జాగ్రత్త ఎందుకంటే..

భారీ వర్షాలు, వరదల కారణంగా చాలా చోట్ల నీరు నిలిచిపోయింది. ఇది డెంగ్యూతో పాటు కంటి ఇన్ఫెక్షన్లు, కండ్ల కలక కేసులు పెరగడానికి దోహదపడింది. ఢిల్లీలో కండ్ల కలక కేసులతో ప్రభుత్వ, ప్రైవేటు క్లినిక్స్ వద్ద రోగులు బారులు తీరుతున్నారు. కంటిలోని తెల్లటి భాగం, కను రెప్పల ఉపరితలం కంజుంక్టివా అనే సన్నని పొరతో కప్పబడి ఉంటుంది. ఈ పొర ఎర్రబడితే దానిని కండ్ల కలక అంటారు. కండ్ల నుంచి నీరు కారడం, ఇరిటేషన్ గా అనిపించడం, తలనొప్పి వంటివి కండ్ల కలక లక్షణాలు. ఇలాంటి సందర్భంలో ఐ డ్రాప్స్ తో పాటు యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేస్తారు. సకాలంలో చికిత్స అందితే ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గిపోతుంది.

 

అయితే కొందరు కండ్ల కలక విషయంలో రకరకాల డ్రాప్స్ వాడుతుంటారు. డాక్టర్ సూచన లేకుండా ఎలాంటి కంటి చుక్కలను వాడొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటం చెమట పట్టడంతో ప్రజలు తమ కళ్లను పదే పదే తాకడం వల్ల ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాప్తి చెందుతుందట. దీని నుంచి కోలుకోవడానికి 5 నుంచి 7 రోజులు పడుతుంది. దీనికి చికిత్స కంటే జాగ్రత్త ఎక్కువ అవసరం. ఇది ఇతరులకు త్వరగా సోకుతుంది. కాబట్టి కండ్ల కలక సోకిన వారు నల్ల కళ్లజోడు వాడటం మంచిది.

Gastric Problems : వర్షాకాలంలో గ్యాస్ట్రిక్ సమస్యలను నివారించటానికి అనుసరించాల్సిన చిట్కాలు !
కండ్ల కలక సోకిన వారు మీ రుమాలు, టవల్స్‌ను ఇంట్లో వారితో షేర్ చేసుకోకండి. కండ్ల కలక సోకిన వారికి దూరంగా ఉండండి. ఒకవేళ అలాంటి పరిస్థితులో ఉన్నవారికి సాయం చేసినా వెంటనే చేతులు కడుక్కోండి. దుమ్ము, రసాయనాలు, ఎండకు దూరంగా ఉండండి. నల్ల కళ్లద్దాలు పెట్టుకోండి. కాలుష్యం, రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లకండి. తగినంత విశ్రాంతి తీసుకుంటే కండ్ల కలక త్వరగానే నయం అవుతుంది.