కరోనా వ్యాక్సీన్ తయారీకి సర్వంసిద్ధం.. హ్యుమన్ ట్రయల్స్ ఫలితాలు రావడమే ఆలస్యం!

  • Published By: sreehari ,Published On : March 24, 2020 / 01:07 PM IST
కరోనా వ్యాక్సీన్ తయారీకి సర్వంసిద్ధం.. హ్యుమన్ ట్రయల్స్ ఫలితాలు రావడమే ఆలస్యం!

Updated On : March 24, 2020 / 1:07 PM IST

ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. భారత్ సహా ఇతర ప్రపంచ దేశాల్లో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. కరోనాను కట్టడిచేసేందుకు చైనా తరహాలో ప్రపంచ దేశాలు లాక్ డౌన్ విధించాయి. భారతదేశం కూడా కరోనాను నియంత్రణ చర్యలను వేగవంతం చేసింది. కరోనాకు ఇప్పటివరకూ మందు లేదు.. కేవలం నివారణ చర్యలు మాత్రమే.. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ మొట్టమొదటి వ్యాక్సీన్ కనిపెట్టేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.

కనీసం ఏడాది సమయం పట్టొచ్చు :
గతవారమే కొవిడ్-19 వ్యాక్సీన్ ప్రయోగ అధ్యయనంలో తొలి వాలంటీర్లకు వ్యాక్సీన్ ఫస్ట్ డోస్ ఇవ్వడం జరిగింది. వ్యాక్సీన్ డెవలపర్ మోడ్రెనా థెరపిటిక్స్ వ్యాక్సీన్ టెస్టింగ్‌ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఒక వ్యాక్సీన్ టెస్టింగ్ పూర్తి కావడానికి కనీసం ఏడాది సమయం పట్టొచ్చు. కరోనా వైరస్‌లపై వ్యాధినిరోధక వ్యవస్థ నిరోధించగలదు అనేదానిపై విలువైన సమాచారాన్ని అందించగలదు. అప్పుడే సైంటిస్టులు వ్యాక్సీన్‌కు తయారీకి అవసరమైన ప్రయోగాలను ప్రారంభించేందుకు వీలుంటుంది. 

నార్వూడ్ టౌన్‌లోని మోడ్రెనా Therapeutics’ manufacturing facilityకి చెందిన నాన్ ఎసెన్షియల్ సిబ్బందిలో అధ్యక్షుడు డాక్టర్ స్టీపెన్ హోగే సహా సిబ్బంది మొత్తం పబ్లిక్ హెల్త్ అధికారుల సలహా మేరకు ఇంటినుంచే పనిచేస్తున్నారు. తొలి దశలో కరోనా ఫస్ట్ వ్యాక్సీన్ పరీక్షల్లో ఫలితాలు వచ్చిన వెంటనే భారీగా వ్యాక్సీన్ ప్రొడక్షన్‌ ప్రారంభించేందుకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే మనుషులపై ట్రయల్స్ మొదలయ్యాయి. ప్రొడక్షన్ కూడా అంతాసిద్ధం చేస్తున్నారు. ట్రయల్స్ రిజల్ట్స్ రావడమే ఆలస్యం.. మిలియన్ల ప్రొడక్షన్ మొదలుపెట్టే అవకాశం ఉంది. 

45మంది ఆరోగ్యకరమైన వాలంటీర్లకు వ్యాక్సీన్ :
వ్యాక్సీన్ ప్రయోగంలో భాగంగా ముందుగా SARS-CoV-2 వైరస్ సోకని 45 మంది ఆరోగ్యకరమైన వాలంటీర్లకు తొలుత వ్యాక్సీన్ వేసి అధ్యయనం చేశారు. ఈ వైరస్ కారణంగా Covid-19 వ్యాధిని వ్యాప్తిచేస్తుంది. ఈ గ్రూపులో సైంటిస్టులు ఎంతవరకు సురక్షితం అనేది పరీక్షిస్తారు. ఆ తర్వాత మూడు వివిధ మోతాదుల్లో వ్యాక్సీన్ ఇస్తారు. అప్పుడు వారిలో వ్యాధినిరోధక శక్తి ఎంత సమర్థవంతంగా స్పందిస్తుంది అనేది పరీక్షిస్తారు. ఈ ప్రయోగంలో ఏదైనా తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ లేదా రియాక్షన్స్ డెవలప్ అయ్యాయా లేదా అని సైంటిస్టులు గమనిస్తారు. ఈ ఫలితాలను ధృవీకరించేందుకు పరిశోధకులు వందలాదిమందికి పైగా ఆరోగ్యకరమైన వాలంటీర్లను రిక్రూట్ చేసుకుంటారు. 

తొలి దశలో వ్యాక్సీన్ టెస్టు చేసేందుకు మోడ్రానా వందలాది సీసాలను నేషనల్ ఇన్సిస్ట్యూట్స్ ఆఫ్ హెల్త్(NIH)కు తరలించింది. అమెరికాలోని మల్టీపుల్ సెంటర్లలో దీనిపై అధ్యయనం చేస్తోంది. ఇదివరకే వ్యాక్సీన్ మిలియన్ల డోసెస్‌కు ఉత్పత్తికి సంబంధించి పని ప్రారంభమైందని హోగే తెలిపారు.  మోడ్రెనా తవ వ్యాక్సీన్‌లో mRNA, ఒక జన్యుపరమైన వైరస్ genome ను వినియోగిస్తోంది.

ఒకసారి దీన్ని ఎవరైనా ఇంజెక్ట్ చేస్తే.. అందులోని కణాలను వ్యాధినిరోధక కణాలు గుర్తించి వాటిని వెంటనే నాశనం చేసేస్తాయి. చైనీస్ పరిశోధకులు కూడా జెనిటిక్ సీక్వెన్స్ SARS-CoV-2ను మధ్య జనవరిలోనూ ఫిబ్రవరి 7 నాటికి పరీక్షించి చూశారు. హ్యుమన్ ట్రయల్స్ కు ముందే అవసరమైన వ్యాక్సీన్ ప్రామణిక పరీక్షల కోసం సీసాలను మోడ్రానా సిద్ధం చేసింది.

మరో 12-18 నెలలు పట్టొచ్చు :
ఫిబ్రవరి చివరి వారంలోనే ఈ ట్రయల్స్ పూర్తికాగానే.. వ్యాక్సీన్ సీసాలను NIHకు తరలించింది. సైంటిస్టులు వాటిపై సమీక్ష జరపాల్సి ఉంటుంది. ఆ తర్వాత మోడ్రోనా, NIH కంపెనీలు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినేస్ట్రేషన్ కు అభ్యర్థన పత్రాన్ని దాఖలు చేశాయి. ఈ పరిశోధక బృందం విలువైన సమయాన్ని ఆదా చేస్తూ సురక్షితమైన సమర్థవంతమైన వ్యాక్సీన్ ఉత్పత్తి చేస్తుందని హోగే ఆశాభావం వ్యక్తం చేశారు. 

(NIH నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్) మొదట ఈ వ్యాక్సీన్‌ను ప్రకటించినప్పుడు, సుమారు మూడు నెలల్లోగా పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ తెలిపారు. 63 రోజుల్లో దీన్ని పూర్తి చేశామన్నారు.

అనుకున్నదాని కంటే వేగంగానే ప్రయత్నామన్నారు. వైరస్ సోకిన రోగులపై పరీక్షలు ఇంకా నెలలు మాత్రమే ఉండవచ్చు. మరో 12-18 నెలల వరకు టెస్టులు ముగియకపోవచ్చని ఫౌసీ అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో, ప్రతి వారం, రోజు, నిమిషం లెక్కేనని అన్నారు.