మార్కెట్లోకి కొత్త యాంటీజెన్ టెస్టు : 15 నిమిషాల్లోనే Covid రిజల్ట్స్

Game-changer – 15 minute Covid antigen test : కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా పరీక్షలు విస్తృత స్థాయిలో చేయాల్సిన పరిస్థితి ఉంది. కరోనా టెస్టు ఫలితాల కంటే వేగంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా టెస్టులను అదే స్థాయిలో విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో అతికొద్ది క్షణాల వ్యవధిలో కరోనా ఫలితాలు రాబట్టే కొత్త కోవిడ్ యాంటిజెన్ టెస్టు మార్కెట్లోకి వచ్చేసింది. కేవలం 15 నిమిషాల్లోనే కరోనా ఫలితాలు రాబట్టొచ్చు. ఈ యాంటిజెన్ టెస్టు.. ఒక గేమ్ ఛేంజర్ (Game-changer) అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఈ యాంటిజెన్ టెస్టు పద్ధతికి యూరప్ మార్కెట్లో అనుమతి లభించింది.
ఈ కరోనా వైరస్ యాంటిజెన్ టెస్టును Becton Dickinson and Co అభివృద్ధి చేసింది. SARS-CoV-2 ఉపరితలంపై యాంటీబాడీల ఉనికిని ఈ టెస్టు వెంటనే నిర్ధారిస్తుంది. క్షణాల వ్యవధిలో టెస్టు ఫలితం వచ్చేస్తుంది. అందుకే యూరప్ మార్కెట్లో అనుమతినిచ్చారు. పోర్టబుల్ డివైజ్ ద్వారా నిర్వహించే ఈ యాంటిజెన్ టెస్టుకు ఎలాంటి ల్యాబరేటరీ అవసరం లేదు.
ఇప్పటికే జూలై నుంచి అమెరికాలో ఈ టెస్టు డివైజ్ అందుబాటులో ఉంది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అత్యవసరంగా వాడేందుకు ఈ యాంటిజెన్ టెస్టును అనుమతించింది. అక్టోబర్ నెలాఖరులో ఐరోపా మార్కెట్‌లనూ టెస్టింగ్ కిట్ల విక్రయాన్ని ప్రారంభించేందుకు Becton Dickinson రెడీ అవుతోంది.
ఆస్పత్రుల్లోని ఎమర్జెన్సీ వార్డెన్లలో జనరల్ డాక్టర్లు ఈ ర్యాపిడ్ కరోనా టెస్ట్‌ను ఈ డివైజ్ ద్వారా నిర్వహిస్తారు. కరోనా వైరస్ కట్టడిలో కొత్త కోవిడ్-19 యాంటీ జెన్ టెస్టు కిట్ ‘గేమ్ ఛేంజర్’ కానుందని యూరప్ Becton Dickinson డయాగ్నస్టిక్స్ హెడ్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో యూరప్‌లో మరో వేవ్ కరోనా వైరస్ కేసులు పెరిగే ప్రమాదం ఉందని అన్నారు.
అందుకే ఈ కరోనా టెస్టులకు డిమాండ్ అధికంగా పెరిగిందని అన్నారు. PCR test లతో పోలిస్తే యాంటీజెన్ టెస్టులు క్షణాల్లో రిజల్ట్స్ వచ్చేస్తాయి. కానీ, ఈ టెస్టులో ఎంతవరకు కచ్చితత్వంపై అనేక సందేహాలు లేకపోలేదు.. Bloomberg report ప్రకారం.. యాంటీజెన్ టెస్ట్ 99.3 శాతం కచ్చితత్వంతో పనిచేస్తుందని Becton Dickinson స్పష్టం చేసింది.