తెల్ల జుట్టు మళ్లీ సహజసిద్ధంగానే నల్లగా మారే అవకాశం ఉంది, ఎప్పుడంటే
తెల్ల జట్టు.. యాజ్ తో సంబంధం లేకుండా ఇప్పుడు అందరూ ఎదుర్కొంటున్న కామన్ సమస్య. వయసు మీద

తెల్ల జట్టు.. యాజ్ తో సంబంధం లేకుండా ఇప్పుడు అందరూ ఎదుర్కొంటున్న కామన్ సమస్య. వయసు మీద
తెల్ల జట్టు.. యాజ్ తో సంబంధం లేకుండా ఇప్పుడు అందరూ ఎదుర్కొంటున్న కామన్ సమస్య. వయసు మీద పడ్డాక తెల్ల వెంట్రుకలు రావడం కామన్. కానీ చాలా చిన్న ఏజ్ లోనూ తెల్ల జట్టు వస్తోంది. పిల్లల వెంట్రుకలు కూడా తెల్లబడుతున్నాయి. యూత్ లో నల్లగా నిగనిగలాడుతూ కనిపించాల్సిన వెంట్రుకలు తెల్లగా జీవం లేకుండా మారిపోతున్నాయి. వైట్ హెయిర్ ఇప్పుడో బిగ్ ప్రాబ్లెమ్ గా మారింది. చెప్పాలంటే ఇదో మానసిక జబ్బులా మారుతోంది. చిన్న వయసులోనే తెల్ల జుట్టు కారణంగా కాన్ఫిడెన్స్ లెవల్స్ తగ్గుతున్నాయి.
ఒక్కసారి జుట్టు తెల్లబడితే ఇక అంతేనా?
సాధారణంగా మనుషుల్లో వయసు 35 ఏళ్లకు అటూఇటూ చేరుకున్న తర్వాత ఎప్పుడైనా.. జుట్టు తెల్లబడటం మొదలవ్వొచ్చు. వయసు పైబడటం, జన్యుపరంగా సంక్రమించిన లక్షణాలు దీనికి కారణాలు. మానసిక ఒత్తిడి కూడా ఇందులో పెద్ద పాత్ర పోషించే అవకాశం ఉంది. మెలానోసైట్‌లు అనే మూల కణాల వల్లే ఇలా జరుగుతుండొచ్చని చెబుతున్నారు. కాగా, తెల్లబడిన జట్టు మళ్లీ నల్లబడే అవకాశాలు లేవని ఇప్పటివరకు నమ్ముతూ వచ్చాము. ఒక్కసారి జుట్టు తెల్లబడిదంటే, మళ్లీ నలుపు రంగులోకి రావడం అసాధ్యం అని ఇప్పటివరకు ఫిక్స్ అయ్యాము.
ఇలా చేస్తే తెల్ల జుట్టు మళ్లీ నల్లగా మారుతుంది:
కానీ, తెల్లబడిన జట్టు మళ్లీ కొన్నిసార్లు సహజసిద్ధంగా ఒరిజనల్ కలర్ కు వస్తుంది అంటే నల్లబడే అవకాశం ఉందనే విషయం మీకు తెలుసా. నమ్మబుద్ధి కాకపోయినా ఇది నిజం అంటున్నారు శాస్త్రవేత్తలు. అదెలాగంటే, స్ట్రెస్(ఒత్తిడి) తగ్గించుకోవడం ద్వారా. అవును ఎప్పుడైతే తక్కువ మానసిక ఒత్తిడిని ఫీల్ అవుతామో అప్పుడు తెల్ల జుట్టు మళ్లీ నల్లగా మారే ఛాన్స్ ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. న్యూయార్క్ లోని కొలంబియా వర్సిటీకి చెందిన మార్టిన్ పికార్డ్ అతడి కొలీగ్స్ ఈ విషయాన్ని కనుగొన్నారు.
ఒత్తిడిని జయించండి:
ఎప్పుడైతే స్ట్రెస్(ఒత్తిడి) లెవల్స్ తగ్గించుకుంటామో ఆ సమయంలో తెల్లబడిన జట్టు మళ్లీ నల్లగా మారే అవకాశం ఉందని మార్టిన్ పికార్డ్ స్పష్టం చేశారు. మెలానోసైట్‌లు మెలనిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. చర్మానికి, జుట్టుకు రంగు ఈ మెలనిన్ వల్లే వస్తుంది. కాగా, ఒత్తిడి వల్లే దేహంలో అనేక సమస్యలకు కారణం అవుతోంది. ఒత్తిడి వల్ల పిగ్మెంట్‌లను ఉత్పత్తి చేసే మూల కణాలు తగ్గిపోతున్నాయి. ఈ క్రమంలో జుట్టు తెల్లబడుతోంది. అయితే స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడం ద్వారా ప్రయోజనం కలుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. సో, ఎక్కువగా స్ట్రెస్ కు గురి కాకండి. ఒక వేళ ఒత్తిడి ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తే వెంటనే రిలాక్స్ అవ్వడానికి మార్గాలు వెతుక్కోండి. స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడానికి గత పద్ధతులు తెలుసుకుని వాటిని ఆచరిస్తే సరిపోతుంది.
Read: face maskలు సరైన పద్ధతిలోనే ఉతుకుతున్నారా..