Chana And Jaggery: బెల్లం, శనగలతో ఆరోగ్యం.. పొద్దున్నే తింటే ఎంత మంచిదో తెలుసా.. ఇంకా చాలా ఉన్నాయి
దయం బెల్లం, శనగలు కలిపి తినడం వల్ల కండరాలు దృఢంగా తయారవుతాయి. జిమ్ చేసేవారు ఇవి తింటే చాలా మంచిది.

chana and jaggery benefits
మన శరీరం ఆరోగ్యంగా, బలంగా తయారవ్వాలంటే ప్రొటీన్లు, ఐరన్, మినరల్స్, క్యాల్షియం లాంటివి చాలా అవసరం. ఇవి మన రోజువారీ ఆహారంలో ఉంటేనే మనిషికి శక్తి, బలం ఏర్పడుతుంది. ఇవన్నీ పుష్కలంగా ఉన్న ఒక ఆహార పదార్థం గుర్తించి ఇప్పుడు తెలుసుకుందాం. అదే బెల్లం మరియు శెనగలు. ఈ రెండు కలిపి తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. శనగల్లో ప్రొటీన్, కాల్షియం, మెగ్నీషియం లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇక బెల్లంలో ఐరన్, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. మరి బెల్లం, శనగలు కలిపి తినడం వల్ల కలిగే ప్రయోజనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శనగలు, బెల్లం బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. అధికబరువు, ఊబకాయం సమస్య ఉన్నవారికి ఇది దివ్యౌషధం అనే చెప్పాలి. 100గ్రాముల శనగలలో19 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. కాబట్టి వీటిని రోజువారీ ఆహారంలో తీసుకుంటే బరువు తగ్గుతారు.
ప్రతిరోజూ ఉదయం బెల్లం, శనగలు కలిపి తినడం వల్ల కండరాలు దృఢంగా తయారవుతాయి. జిమ్ చేసేవారు ఇవి తింటే చాలా మంచిది. ఎందుకంటే బెల్లంలో పొటాషియం పుష్కలంగా ఉండడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. శరీరానికి సత్వర శక్తి అందుతుంది.
శనగలు, బెల్లం కలిపి తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇది శరీరంలో సెరోటోనిన్ అనే హార్మోన్ మెరుగుపరచడం వల్ల మెదడు బాగా పనిచేస్తుంది. ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఎసిడిటిని ని కూడా తగ్గిస్తుంది. శనగల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి సూపర్ ఫుడ్ డైజెస్టివ్ ఎంజైమ్లను యాక్టివేట్ చేస్తుంది. శనగలు, బెల్లం కలయిక లో ఉండే భాస్వరం ఎముకలు, దంతాలను బలంగా చేస్తుంది. గుండె జబ్బులను రాకుండా చేస్తుంది. శనగల్లో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని రోజూ తినడం మంచిది. రక్తం రక్తహీనత సమస్యకు శెనగలు, బెల్లం సూపర్ గా పనిచేస్తుంది. ఈ రెండిటిలోనూ ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రక్తంలో ఆక్సిజన్, ఎర్ర రక్త కణాలను పెంచుతుంది.