Women’s Health: మహిళలకు ప్రత్యేకం.. కుంకుమ పువ్వుతో ఆరోగ్యం.. నెలసరి, హార్మోన్ సమస్యలు మాయం
Women's Health: మహిళలు సాధారణంగా హార్మోన్స్ సమస్య వల్ల బాధపడుతుంటారు. వారికి నెలసరి చక్రాలు అసమతుల్యం కావడం, PCOS, మెనోపాజ్ వంటి సమస్యలు తరచూ ఎదురవుతుంటాయి.

Health benefits of consuming saffron for women
కుంకుమ పువ్వు (Saffron) అనేది అత్యంత విలువైన, పురాతనమైన ఔషధ గుణాలు కలిగిన సుగంధ ద్రవ్యాలలో ఒకటి. కాశ్మీర్, ఇరాన్ వంటి ప్రాంతాల్లో ఇది ఎక్కువగా సాగు చేయబడుతుంది. ఇది మానవ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా మహిళల ఆరోగ్యం విషయంలో ఇది చాలా ప్రత్యేకం. అందుకే, ఇక్కడ మహిళల ఆరోగ్యం విషయంలో కుంకుమ పువ్వు ప్రత్యేకత ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? అనేది వివరంగా తెలుసుకుందాం.
1.హార్మోన్ సమతుల్యతకు సహాయం:
మహిళలు సాధారణంగా హార్మోన్స్ సమస్య వల్ల బాధపడుతుంటారు. వారికి నెలసరి చక్రాలు అసమతుల్యం కావడం, PCOS, మెనోపాజ్ వంటి సమస్యలు తరచూ ఎదురవుతుంటాయి. కుంకుమ పువ్వులో ఉండే సహజ యాంటీ-ఇన్ఫ్లమేటరీ, హార్మోనల్ మోడ్యూలేటింగ్ లక్షణాలు ఈ సమస్యను తగ్గిస్తుంది. మెనోపాజ్ సమయంలో వచ్చే మూడ్ స్వింగ్స్, వేడి అలజడి వంటి లక్షణాల నుంచి ఉపశమనం ఇస్తుంది.
2.మానసిక ఆరోగ్యం:
కుంకుమ పువ్వు లో ఉండే క్రొసిన్,సఫ్రనాల్ అనే యాక్టివ్ కాంపౌండ్లు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. డిప్రెషన్‌ను దూరం చేస్తాయి. నిద్రలేమిని తగ్గించి శరీరానికి శాంతిని కలిగిస్తాయి. ప్రతి రోజూ ఒక గ్లాసు పాలలో రెండు కుంకుమ పువ్వులను వేసుకొని తాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
3.గర్భిణీ స్త్రీలకు ఉపయోగాలు:
గర్భధారణ సమయంలో డాక్టర్ సలహా మేరకు కుంకుమ పువ్వును తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పిండం ఆరోగ్యంగా అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది.
4.చర్మ సౌందర్యానికి సహకారం:
కుంకుమ పువ్వును ఆయుర్వేదంలో చర్మ సంరక్షణలో ప్రధానంగా వాడతారు. ఇది చర్మాన్నీ ప్రకాశవంతంగా చేస్తుంది. మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది. వయసుతో వచ్చే ముడతలను కనిపించకుండా చేస్తుంది. అలాగే, కుంకుమ పువ్వును పాలతో కలిపి ముఖానికి ప్యాక్ లా వేసుకుంటే గ్లో పెరుగుతుంది.
5.రక్తశుద్ధి, రక్త ప్రసరణ మెరుగుదల:
కుంకుమ పువ్వుకు రక్తాన్ని శుద్ధి చేసి లక్షణం ఉంది. ఇది రక్తంలో టాక్సిన్లను తొలగిస్తుంది, హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, జలుబు, దగ్గు, ఆస్తమా లాంటి సమస్యల నుంచి రక్షణ ఇస్తుంది.
జాగ్రత్తలు:
- రోజుకి 3 నుంచి 5 తంతుళ్లకంటే ఎక్కువ తీసుకోవద్దు
- గర్భిణీ స్త్రీలు, హార్మోన్ చికిత్స పొందుతున్న వారు డాక్టర్ సలహా తీసుకోవాలి.