Corn Silk: ఏంటీ.. మొక్కజ్జోన్న పీచును పడేస్తున్నారా.. వాటిలో ఎన్ని పోషకాలు ఉంటాయో తెలుసా?

మొక్క‌జొన్న పీచు మూత్రాశ‌య ఇన్‌ఫెక్ష‌న్ల‌ను త‌గ్గిస్తుంది. మూత్రాశ‌యం, జ‌న‌నావ‌య‌వాల దగ్గ‌ర బ్యాక్టీరియా, ఫంగ‌స్ లాంటివి చేర‌కుండా చేస్తుంది.

Corn Silk: ఏంటీ.. మొక్కజ్జోన్న పీచును పడేస్తున్నారా.. వాటిలో ఎన్ని పోషకాలు ఉంటాయో తెలుసా?

Corn silk benefits

Updated On : June 6, 2025 / 4:52 PM IST

మొక్కజొన్న.. దీని గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చాలా మంది దీన్ని ఇష్టంగా తింటారు. కొంతమంది నిప్పులపై కాల్చుకొని తింటే మరికొంత మంది ఉడకబెట్టి తినడానికి ఇష్టపడతారు. ఎలా తిన్నా రుచిలో మాత్రం తేడా ఉండదు. అద్భుతం అంతే. రుచి మాత్రమే కాదు.. మొక్కజొన్నతో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ, అదే మొక్కజొన్న గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. కేవలం మొక్కజొన్నలోనే కాదు మొక్కజొన్న పీచులో కూడా అనేకరకాల పోషకాలు ఉన్నాయట. చాలా మంది మొక్కజొన్నలు తిని దానిపై ఉండే పీచును పడేస్తారు. కానీ, అమెరికా, చైనా లాంటి దేశాలు తమ వైద్య విధానంలో మొక్క‌జొన్న పీచును ఉప‌యోగిస్తారు. వాటిలో అనేక పోష‌కాలు, ఔష‌ధ గుణాలు ఉన్నాయట.

మొక్క‌జొన్న పీచు మూత్రాశ‌య ఇన్‌ఫెక్ష‌న్ల‌ను త‌గ్గిస్తుంది. మూత్రాశ‌యం, జ‌న‌నావ‌య‌వాల దగ్గ‌ర బ్యాక్టీరియా, ఫంగ‌స్ లాంటివి చేర‌కుండా చేస్తుంది. శ‌రీరంలోని వ్య‌ర్థాలు పూర్తిగా పంపిచేస్తుంది. కిడ్నీ స్టోన్ల స‌మ‌స్యతో బాధపడుతున్నవారు మొక్క జొన్న పీచు మ‌రిగించిన నీళ్ల‌ను తాగితే స్టోన్స్ క‌రిగిపోతాయి. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మంచి కొలెస్ట్రాల్ ను పెరుగుతుంది. ఫ‌లితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

మొక్క‌జొన్న పీచులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇందులో ఉండే ఫ్లేవ‌నాయిడ్స్‌, ఫినోలిక్ స‌మ్మేళ‌నాలు, స్టెరాల్స్‌, సాపోనిన్స్‌, అల్ల‌న్‌టోయిన్‌, ఆల్క‌లాయిడ్స్ ఫ్రీ ర్యాడిక‌ల్స్ ను తగ్గించి క్యాన్సర్ కారకాలను తగ్గిస్తుంది. మొక్క‌జొన్న పీచును రోజు తీసుకోవడం వల్ల షుగ‌ర్ లెవ‌ల్స్‌ కంట్రోల్ లో ఉంటాయి. ఇన్సులిన్ ఉత్ప‌త్తి పెరుగుతుంది. క్లోమ గ్రంథిలో డ్యామేజ్ అయిన బీటా క‌ణాలను సైతం బాగు చేస్తుంది. అయితే మొక్కజొన్న పీచును నేరుగా తిన‌లేరు కాబట్టి ఆ పీచును నీటిలో మరిగించి ఆ నీటిని తాగాల్సి ఉంటుంది.