Health Tips: నీళ్లు ఎలా తాగుతున్నారు? ఇలా తాగితే ఆరోగ్యానికి మంచిది తెల్సా.. ఒకసారి ట్రై చేయండి

Health Tips: కూర్చొని నీళ్లు తాగినప్పుడు శరీరం సవ్యంగా ఉంటుంది. కాబట్టి, నీళ్లు నెమ్మదిగా కడుపులోకి చేరి, పేగుల పనితీరును మెరుగుపరుస్తుంది.

Health Tips: నీళ్లు ఎలా తాగుతున్నారు? ఇలా తాగితే ఆరోగ్యానికి మంచిది తెల్సా.. ఒకసారి ట్రై చేయండి

Health benefits of drinking water while sitting

Updated On : July 7, 2025 / 10:36 AM IST

మన ఆరోగ్యానికి నీళ్లు ఎంతో అవసరం. ఆరోగ్యంగా ఉన్న మనిషి రోజుకి కనీసం 3 లీటర్ల నీళ్లు తాగాలని నిపుణులు చెప్తున్నారు. అయితే, కేవలం నీళ్లు తాగడం మాత్రమే కాదు ఎలా తాగుతున్నాం అనేది కూడా ముఖ్యమేనట. చాలా మంది ఎక్కువగా నిలబడి మంచి నీళ్లు తాగుతారు. కానీ, కూర్చొని నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేదం సహా అనేక వైద్య పద్ధతులు సూచిస్తున్నాయి. మరి మంచి నీళ్లు నిల్చొని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు పరిశీలిద్దాం.

కూర్చొని నీళ్లు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

1. జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది:
కూర్చొని నీళ్లు తాగినప్పుడు శరీరం సవ్యంగా ఉంటుంది. కాబట్టి, నీళ్లు నెమ్మదిగా కడుపులోకి చేరి, పేగుల పనితీరును మెరుగుపరుస్తుంది. మంచి నీళ్లు ఎలా తాగుతున్నారు? ఇలా తాగితే ఆరోగ్యానికి మంచిది తెల్సా.. ఒకసారి ట్రై చేయండిదీంతో అజీర్ణం, పించు, మంట వంటి సమస్యలు తగ్గుతాయి.

2. మూత్రపిండాలకు ఒత్తిడి తగ్గుతుంది:
నిలబడి నీళ్లు తాగినప్పుడు నీరు ఒత్తిడి హఠాత్తుగా కిడ్నీలపై పడుతుంది. ఇది మూత్రపిండాల పనితీరుపై ప్రభావం చూపించవచ్చు. కానీ కూర్చొని తాగితే నీరు నెమ్మదిగా ప్రవహించి, వాటికి సహజంగా పని చేసే అవకాశం కల్పిస్తుంది.

3.గుండెపోటు ముప్పు తగ్గుతుంది:
నీటిని నెమ్మదిగా తాగడం వల్ల రక్తంలో ఊపిరితిత్తులు, గుండెకు సరిపడే రీతిలో శుద్ధి చేయబడుతుంది. ఇది రక్తప్రసరణను మెరుగుపరచి, హృదయ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది.

4.శరీర ధారణకు సమతుల్యత:
కూర్చొని తాగినప్పుడు మన శరీరం ప్రశాంతంగా ఉంటుంది. ఇది నాడీ వ్యవస్థకు విశ్రాంతిని ఇస్తుంది. అంతేకాక, నీరు మెదడుకు చక్కగా చేరుతుంది, దాహం సరిగ్గా తీరుతుంది. దానివల్ల మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

5.ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి:
నిల్చొని లేదా తొందరగా నీళ్లు తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కూర్చుని తాగితే అలా కాకుండా మెల్లగా జీర్ణం జరుగుతుంది. దానివల్ల ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి.

కొన్ని చిట్కాలు:

  • ఉదయం లేచిన వెంటనే గోరువెచ్చని నీళ్లు కూర్చుని తాగడం మంచిది.
  • నీళ్లు గ్లాసుతో తాగడం ఆరోగ్యానికి మంచిది – బాటిల్ నుండి నేరుగా తాగకూడదు.
  • భోజనం తర్వాత 30 నిమిషాల గ్యాప్ తర్వాత నీళ్లు తాగడం ఉత్తమం.