Chrono Nutrition Benefits: క్రోనో న్యూట్రీషియన్.. ఆరోగ్యానికి ఆహార గడియారం.. బీపీ, షుగర్ అన్నీ కంట్రోల్

Chrono Nutrition Benefits: సాధారణంగా ఆహారం విషయంలో ఏ ఆహారాన్ని తీసుకుంటున్నారన్నది ఆలోచిస్తారు కానీ, దాన్ని ఎప్పుడు తింటున్నారు అన్నదే ముఖ్యమై ఉంటుంది.

Chrono Nutrition Benefits: క్రోనో న్యూట్రీషియన్.. ఆరోగ్యానికి ఆహార గడియారం.. బీపీ, షుగర్ అన్నీ కంట్రోల్

Health Benefits Of Following Chrono Nutrition

Updated On : July 14, 2025 / 10:28 AM IST

క్రోనో న్యూట్రీషన్ అనేది శరీర గడియారం (Biological Clock / Circadian Rhythm) ప్రకారం ఆహారాన్ని తీసుకునే పద్ధతి. ఈ ఆహార విధానాన్ని 1986లో ఫ్రెంచ్ డాక్టర్ అలెన్ డెలబాయ్ (Dr. Alain Delabos) అభివృద్ధి చేశారు. ఈ సిద్ధాంతం ప్రకారం మన శరీరం రోజంతా పలు హార్మోన్లను వేరుగా ఉత్పత్తి చేస్తుంది. వాటి ప్రకారం ఆహారాన్ని సరిగ్గా తీసుకుంటే శరీరం వాటిని సరిగా జీర్ణించుకుంటుంది. దీనివల్ల శరీరంపై ఒత్తిడి తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. మరి క్రోనో న్యూట్రీషియన్ ను ఎలా ఫాలో అవ్వాలి? దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజాల గురించి వివరంగా తెలుసుకుందాం.

క్రోనో న్యూట్రిషన్ యొక్క ప్రాథమిక సూత్రాలు:

ఆహారం సమయానికి తినాలి:
సాధారణంగా చాలా మంది ఆహారం విషయంలో ఏ ఆహారాన్ని తీసుకుంటున్నారన్నది ఆలోచిస్తారు కానీ, దాన్ని ఎప్పుడు తింటున్నారు అన్నదే ముఖ్యమై ఉంటుంది. కాబట్టి సమయానికి ఆహారం తీసుకోవాలి.

ఉదయం కొవ్వులు, ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకోవాలి:
ఉదయం శరీరానికి శక్తి అవసరం అవుతుంది. అందుకే ఎక్కువ ఎనర్జీ కలిగించే ఆహారం ఉదయాన్నే తీసుకోవాలి. అవకాడో, గుడ్లు, నాటు నెయ్యి, ఉప్పుగొడుగులు మొదలైనవి తీసుకోవడం మంచిది.

మధ్యాహ్నం శరీరం ఎక్కువగా ప్రొటీన్లను జీర్ణించగలదు:
మధ్యాహ్నం బలమైన ఆహారం తీసుకోవాలి. చికెన్, ఫిష్, పప్పులు వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది.

సాయంత్రం తక్కువగా తినాలి:
సాయంత్రం శరీరంలో జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో అధిక మోతాదులో ఆహారం తీసుకోకూడదు. పండ్లు, తేలికైన ప్రోటీన్లు, మంచి కూరగాయలు తీసుకోవడం ఉత్తమం.

రాత్రి శరీరం విశ్రాంతి తీసుకుంటుంది:
రాత్రి సమయంలో శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. కాబట్టి ఆహారం అతి తక్కువగా తీసుకోవడం మంచిది. తప్పనిసరిగా తినాల్సిన అవసరమైతే సూప్, సలాడ్ వంటి తేలికపాటి ఆహారమే తీసుకోవచ్చు.

క్రోనో న్యూట్రిషన్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

1.బరువు తగ్గడం:
క్రమబద్ధంగా సమయానికి తినడం వలన శరీరం కొవ్వులను నిల్వ చేసుకోకుండా వాటిని శక్తిగా ఉపయోగించుకుంటుంది. కాబట్టి బరువు తగ్గుతుంది.

2.ఇన్సులిన్ స్థాయిలను సమతుల్యం చేయడం:
ఈ విధానం డయాబెటిస్ ఉన్నవారికి చాలా ఉపయోగపడుతుంది,. ఎందుకంటే ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

3.జీర్ణవ్యవస్థను మెరుగుపడుతుంది:
శరీర గడియారానికి అనుగుణంగా తినడం వలన అజీర్ణం, గ్యాస్, మలబద్ధక సమస్యలు తగ్గుతాయి.

4.శక్తి స్థాయిల పెరుగుదల:
సమయానికి ఆహారం తీసుకోవడం వల్ల రోజంతా శక్తివంతంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శరీరం అవసరమైన సమయానకి సరైన పోషకాలు అందుకుంటుంది కాబట్టి.

5.నిద్ర నాణ్యత పెరుగుతుంది:
రాత్రి తక్కువగా తినడం వలన జీర్ణక్రియపై ప్రభావం తగ్గుతుంది. కాబట్టి నిద్ర బాగా పడుతుంది.

క్రోనో న్యూట్రిషన్ అనేది ఆధునిక జీవనశైలికి అనుగుణంగా, శరీర స్వభావానికి అనుకూలంగా ఉండే ఒక పోషకాహార విధానం. ఇది ఆరోగ్యాన్ని పెంపొందించడంలో, బరువును నియంత్రించడంలో, శక్తివంతమైన జీవితం కోసం సహాయపడుతుంది.