Capsicum Benefits: బెల్లం మిరపకాయతో భలే ఆరోగ్యం.. రోజూ తింటే రోగాలు మాయం.. గుండే, కళ్ళు సేఫ్

Capsicum Benefits: ఆకుపచ్చ రంగులో ఉండే కూరగాయలో ఒకటి క్యాప్సికం (Capsicum). దీన్నే తెలుగులో "బెల్లం మిరపకాయ" అని పిలుస్తారు. దక్షిణ భారతీయ వంటకాలలో కూరగా, పకోడీల్లో, రైస్ వంటకాలలో ఎక్కువగా వాడతారు.

Capsicum Benefits: బెల్లం మిరపకాయతో భలే ఆరోగ్యం.. రోజూ తింటే రోగాలు మాయం.. గుండే, కళ్ళు సేఫ్

Health benefits of eating capsicum every day

Updated On : July 28, 2025 / 2:57 PM IST

ఆకుపచ్చ రంగులో ఉండే కూరగాయలో ఒకటి క్యాప్సికం (Capsicum). దీన్నే తెలుగులో “బెల్లం మిరపకాయ” అని పిలుస్తారు. దక్షిణ భారతీయ వంటకాలలో కూరగా, పకోడీల్లో, రైస్ వంటకాలలో ఎక్కువగా వాడతారు. కేవలం రుచి కోసమే కాదు, క్యాప్సికం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆకుపచ్చ క్యాప్సికం అనేది పోషకాలకు నిలయం. అంతేకాదు శరీరానికి అవసరమైన అనేక విటమిన్లు, ఖనిజాలు అందిస్తుంది. మరి రోజువారీ ఆహారంలో ఆకుపచ్చ క్యాప్సికమ్ చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

ఆకుపచ్చ క్యాప్సికంలో ఉండే పోషకాలు:

  • విటమిన్ C
  • విటమిన్ A
  • విటమిన్ B6
  • ఫైబర్
  • యాంటీఆక్సిడెంట్లు
  • ఫోలేట్
  • మెగ్నీషియం, పొటాషియం

ఆకుపచ్చ క్యాప్సికం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

1.రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
ఆకుపచ్చ క్యాప్సికంలో విటమిన్ C అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి బలమైన రోగనిరోధక శక్తి అందిస్తుంది. వైరల్, బాక్టీరియా ఇన్ఫెక్షన్లను నిరోధించడంలో సహాయపడుతుంది.

2.శక్తి ప్రదాతగా పని చేస్తుంది:
ఆకుపచ్చ క్యాప్సికంలోని విటమిన్ B6, మాగ్నీషియంల కలయిక శరీరంలోని ఎనర్జీ మెటబాలిజాన్ని పెంచుతుంది. తద్వారా శారీరక అలసటను తగ్గిస్తుంది.

3.జీర్ణక్రియ మెరుగవుతుంది:
ఆకుపచ్చ క్యాప్సికంలో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కడుపు నిండిన భవాన్ని కలిగించడం వల్ల ఆకలి భావాన్ని తగ్గిస్తుంది.

4.కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది:
క్యాప్సికంలో కంటి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ A, బీటాకెరోటిన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

5.క్యాన్సర్‌ నిరోధంలో సహాయకారి:
ఇవి యాంటీఆక్సిడెంట్లు కణాల మ్యూటేషన్‌ను నిరోధించడంలో సహాయపడతాయి. శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి క్యాన్సర్ కారకాలను నాశింపజేస్తాయి.

6. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది:
క్యాప్సికం లో తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఇది ఒంట్లో గ్లూకోజ్ శాతాన్ని తగ్గిస్తుంది. కాబట్టి, దీనిని డైట్‌లో చేర్చుకోవడం చాలా మంచింది. శరీరంలో కొవ్వును కరిగించడంలో సహకరిస్తుంది.

వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తాయి.

  • సాలడ్‌ల్లో ముక్కలుగా వేసుకోవచ్చు
  • కూరల్లో, పులావ్‌లలో వాడవచ్చు
  • పకోడీ/స్టఫ్ చేసి తినవచ్చు
  • జ్యూస్ లేదా సూప్‌లలో కలిపి తీసుకోవచ్చు

జాగ్రత్తలు:

  • పచ్చ క్యాసికం మితంగా మాత్రమే తీసుకోవాలి. అధికంగా తింటే జీర్ణ సమస్యలు వాచ్చే అవకాశం ఉంది.
  • కదలకుండా నిల్వ ఉంచితే త్వరగా పాడవుతుంది తాజాగా తీసుకోవడం మంచిది.

ఆకుపచ్చ క్యాప్సికం ఒక సాధారణమైన కూరగాయలా కనిపించినా, దాని ప్రయోజనాలు అసాధారణం. దీన్ని మన దైనందిన ఆహారంలో చేర్చితే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.