Food Colors: ఫుడ్ కలర్స్ వాడుతున్నారా.. ప్రాణాలు రిస్క్ లో ఉన్నట్టే.. జాగ్రత్త సుమా
సింథటిక్ ఫుడ్ కలర్స్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనవి. ఇప్పటికే ఈ విషయంపై అనేక పరిశోధనలు జరిగాయి.

synthetic food color
ప్రస్తుతం కాలంలో ఆహరం విషయంలో ఆరోగ్యం కంటే రుచికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకోసం ఆరోగ్యానికి ప్రమాదకరమైన పదార్థాలను వంటకాల్లో వాడుతున్నారు. ఆ కారణంగా మనుషులు వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. కొన్ని పదార్థాలను చూసేందుకు అందంగా కనిపించేందుకు అందులో ఫుడ్ కలర్స్ వాడుతున్నారు. ప్రస్తుతం కాలంలో ప్రతీ తినే ఐటెంలలో కెమికల్స్ తో తాయారుచేసిన కలర్స్ ను కలుపుతున్నారు. అవి చూడటానికి, తినడానికి అందంగా, రుచిగా బాగానే ఉంటాయి. కానీ, ఆరోగ్యానికి మాత్రం తీవ్ర నష్టాన్ని చేస్తున్నాయి. మరి ఫుడ్ కలర్స్ వల్ల కలిగే ఆరోగ్య సమస్య గురించి, అది ఎంత ప్రమాదమో అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఫుడ్ కాల్సర్స్ ను ముఖ్యంగా ఫ్లేవర్డ్ ఐస్ క్రీం, జిలేబీలు, క్యాండీలు, షర్బెట్‌లు వంటి తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆ ఫుడ్ ఐటమ్స్ అందంగా కనిపించేందుకు కలర్స్ ని అందులో కలుపుతున్నారు. అయితే.. ఈ సింథటిక్ ఫుడ్ కలర్స్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనవి. ఇప్పటికే ఈ విషయంపై అనేక పరిశోధనలు జరిగాయి. ఇదే విషయాన్ని బల్లగుద్ది మరీ చెప్పాయి.
ఈ సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల థైరాయిడ్, జీర్ణశయ సమస్యలు, DNA నష్టం, చర్మ సమస్యలు, అలెర్జీలు, ఉబ్బసం, ఆయాసం, జ్ఞాపకశక్తి లోపం, హైపర్యాక్టివిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ రసాయనాలు శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలలో ఈ ఫుడ్ కలర్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కంటి చూపు మందగించడం, జ్ఞాపకశక్తి తగ్గడం, ఆకలి నశించడం వంటి వాటికి కారణం అవుతున్నాయి.
ఈ విషయాన్ని ముందే గమనించిన యునైటెడ్ స్టేట్స్ మానవ ఆరోగ్యంపై విషపూరిత ప్రభావాన్ని చూపే ఎనిమిది రకాల సింథటిక్ ఫుడ్ కలర్స్‌ను నిషేధించింది. వాటిలోఎల్లో 5, ఎల్లో 6, రెడ్ 40, రెడ్ 10, రెడ్ 3, బ్లూ 2, బ్లూ 1, గ్రీన్ 3 వంటి కలర్స్ ఉన్నాయి. ఇవి మానవ శరీరానికి అత్యంత ప్రమాదకరమని, ఈ ఫుడ్ కలర్స్ ను ఎక్కువగా వినియోగించడం వల్ల వివిధ రకాల క్యాన్సర్ లు కూడా వచ్చే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. కాబట్టి.. సాధ్యమైనంతవరకు సహజసిద్దమైన ఆహారాన్ని తీసుకోవడం మంచిది. రంగు, రుచి కోసం కెమికల్స్ తో తయారు చేసిన ఫుడ్ కలర్స్ వాడటం వల్ల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పెట్టె అవకాశం ఉంది.