నాలుకపై బ్యాక్టీరియా ఎలా.. ఎక్కడ పేరుకుపోతుందో తెలుసా..

నాలుకపై బ్యాక్టీరియా ఎలా.. ఎక్కడ పేరుకుపోతుందో తెలుసా..

Updated On : March 25, 2020 / 4:47 AM IST

మైరియాడ్ మైక్రోబ్స్ నాలుకను పట్టుకుని రోజుల తరబడి మనతోనే ఉంటాయి. అంతేకుండా ఇతర బ్యాక్టీరియాలతో కలిపి పేరుకుపోయి లేనిపోని హానిని తెచ్చిపెడతాయి. అసలు అవి ఏ విధంగా ఏర్పడతాయి. అలా పెరగడం వల్ల  వచ్చే నష్టాలు ఏంటి.. తెలుసుకుందాం. సెల్ రిపోర్ట్స్ అనే మ్యాగజైన్ కు రీసెర్చర్స్ తెలిపిన కథనంలో వివరాలిలా ఉన్నాయి. 

బ్యాక్టీరియా అనేది సూది మొనల్లాంటి ఆకారంతో నాలుకపై తలంలోకి చొచ్చుకుపోతుంది. నాలుక తొలి భాగాన్ని మినహాయించి బ్యాక్టీరియా మిగిలిన తలంపై నిల్వ ఉండిపోతుంది. దాని ఆధారంగా ఇతర బ్యాక్టీరియా కూడా దానినే అంటిపెట్టుకుని పెరుగుతూ ఉంటుంది. ఇలా పెరిగిన ఒక లేయర్ తో పాటుగా పెద్ద పరిమాణంలో ఏర్పడిన క్లస్టర్ల మధ్యలో గ్యాప్ లను చిన్ని సైజులో ఉండే బ్యాక్టీరియా పూడుస్తూ ఉంటుంది. ఈ విధంగా పలు రకాల బ్యాక్టీరియాతో నాలుకను పూర్తిగా ఆక్రమించేస్తాయి. 

ఇది చాలా అద్భుతమైన విషయం. నాలుక స్వభావాన్ని బ్యాక్టీరియా అదనుగా చేసుకుని పెరిగిపోతుందని మైక్రో బయాలజిస్ట్ జెస్సికా మార్క్ విచ్ అంటున్నారు. వీటిని గుర్తించడమెలా అంటే.. మైక్రోబయాల్ కమ్యూనిటీస్ వేలిముద్రలపై చేసిన ప్రయోగం వంటి విధంగా నాలుకపై పేరుకునే బ్యాక్టీరియాపై పరిశోధన జరిపారు. 

పరిశోధనలో భాగంగా కొందరితో నాలుకపై ప్లాస్టిక్ ర్యాపర్ తో గీయించారు. అప్పుడు వారికి పలు రంగులతో ఏర్పడిన బ్యాక్టీరియా కనిపిస్తూ వచ్చింది. మైక్రోబయాల్ కమ్యూనిటీ వంటి నిర్మాణంతో ఉంది. బ్యాక్టీరియా మందమైన లేయర్లుగా ఫామ్ అయింది. రోజువారీ తీసుకునే ఆహారాన్ని బట్టి కామన్ బ్యాక్టీరియా నాలుకకు అలవాటు అయి ఉంటుంది. అరుదుగా తీసుకునే ఆహారంతో నాలుకపై బ్యాక్టీరియా పెద్ద మొత్తంలో పెరుగుతుంది. 

ఆకుకూరలు వంటివి తీసుకున్నప్పుడు బ్యాక్టీరియా తక్కువగా ఏర్పడుతుంది. ఫలితంగా ఇతర ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు ఏర్పడిన బ్యాక్టీరియా కారణంగా చెడు ప్రభావం కలగకుండా రక్తపోటు(బీపీ)ని కంట్రోల్ చేస్తుంది.