Drink Ginger Tea : ప్రతిరోజూ అల్లం టీని తాగడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? తప్పక తెలుసుకోండి!

Drink Ginger Tea : అల్లం టీని ఎందుకు రెగ్యులర్‌గా తాగాలో తెలుసా? అల్లం టీ తీసుకోవడం వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Drink Ginger Tea : ప్రతిరోజూ అల్లం టీని తాగడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? తప్పక తెలుసుకోండి!

Here's Why You Should Drink Ginger Tea RegularlyHere's Why You Should Drink Ginger Tea Regularly

Updated On : March 9, 2024 / 5:43 PM IST

Drink Ginger Tea : మీకు అల్లం టీ తాగే అలవాటు ఉందా? ప్రతిరోజూ క్రమం తప్పకుండా అల్లం టీ తాగితే ఏమౌతుందో తెలుసా? అసలు అల్లం టీని అధికంగా ఎందుకు తీసుకోవాలి? కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. సాధారణంగా అల్లం టీ అనేది తాజా లేదా ఎండిన అల్లంను వేడి నీటిలో నానబెట్టడం ద్వారా తయారు చేసే ప్రసిద్ధ పానీయం.

ఇది ఎన్నో శతాబ్దాలుగా వాడుకలో ఉంది. ప్రత్యేకమైన మసాలా రుచి కోసం మాత్రమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా ఎక్కువ మంది వినియోగిస్తుంటారు. అల్లం టీ తీసుకోవడం వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Read Also : Gut Health Tips : చలికాలంలో మలబద్ధకాన్ని నివారించే అద్భుతమైన 8 ఆహారాలివే.. తప్పక తెలుసుకోండి !

అల్లం టీని ఎందుకు ఎక్కువగా తీసుకోవాలి? :
1. వికారం, జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం :
అల్లం టీ మోషన్ సిక్‌నెస్, గర్భధారణ సమయంలో మార్నింగ్ సిక్‌నెస్, శస్త్రచికిత్స అనంతరం కలిగే వికారంను తగ్గించే సామర్థ్యం ఉంది. ఆహారం చక్కగా అరిగేలా జీర్ణక్రియకు సాయపడుతుంది.

2. కండరాల నొప్పి తగ్గిస్తుంది :
అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కండరాల నొప్పిని తగ్గించడంలో సాయపడతాయి. అల్లం టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల కండరాల అసౌకర్యం ఉన్నవారికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది.

3. రక్తప్రసరణ మెరుగుపడటం :
రక్త ప్రసరణను మెరుగుపరచడానికి అల్లం బెస్ట్ అని చెప్పవచ్చు. గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మెరుగైన రక్త ప్రసరణ కూడా రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గించడంలో సాయపడుతుంది.

4. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది :
అల్లం రక్తంలో చక్కెర స్థాయిలపై తగ్గించగల గుణాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అల్లం టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. మధుమేహం ఉన్న వారి అల్లం టీ చాలా ప్రయోజనంగా ఉంటుంది.

5. రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడటం :
అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సాయపడతాయి. అల్లం టీ తాగడం వల్ల శరీరాన్ని ఇన్‌ఫెక్షన్‌లను నివారించగలదు. రోగనిరోధకశక్తిని మెరుగుపరచడంలో సాయపడుతుంది.

6. బరువును తగ్గిస్తుంది :
కొన్ని అధ్యయనాల్లో అల్లం తీసుకోవడ వల్ల ఆకలిని తగ్గిస్తుందని తేలింది. ద్వారా బరువును అదుపులోకి ఉంచుకోవచ్చు. సమతుల్య ఆహారం, వ్యాయామాలతో పాటు అల్లం టీ తాగడం వల్ల బరువు వేగంగా తగ్గించడంలో సాయపడుతుంది.

7. ఒత్తిడిని తగ్గిస్తుంది :
అల్లం సువాసన ఒత్తిడి నుంచి మంచి ఉపశమనం కలిగిస్తుంది. అల్లం టీ తాగడం వల్ల విశ్రాంతిని, మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని కొందరు పరిశోధకులు కనుగొన్నారు.

అల్లం టీ తయారీ విధానం – కావలసిన పదార్థాలు :

  • తాజా అల్లం రూట్ (1-2 అంగుళాలు, ముక్కలు లేదా తురిమినది)
  • నీరు (2 కప్పులు)
  • అదనపు రుచి కోసం తేనె, నిమ్మకాయ లేదా పుదీనా (ఆప్షనల్)
  • తాజా అల్లంపై తొక్క, ముక్కలు లేదా తురుము వేయండి.
  • ఒక గిన్నెలో 2 కప్పుల నీటిని మరిగించాలి.
  • వేడినీటిలో అల్లం వేసి సుమారు 10-15 నిమిషాలు ఉడకనివ్వండి.
  • అల్లం ముక్కలను మరిగించిన తర్వాత వడకట్టండి.
  • టేస్ట్ కోసం తేనె, నిమ్మకాయ లేదా పుదీనా కలుపుకోవచ్చు.

అల్లం టీని మితంగా తీసుకోవడం మంచిది. ఎందుకంటే.. అధికంగా తీసుకోవడం వల్ల కొంతమందికి జీర్ణవ్యవస్థలో అసౌకర్యం కలుగుతుంది. మీకు ఏవైనా అంతర్లీన ఆరోగ్య పరిస్థితులు ఉంటే లేదా మందులు తీసుకుంటుంటే.. అల్లం టీని తాగే ముందు వైద్యులను సంప్రదించడం చాలా మంచిది.

Read Also : Kiwis Health Benefits : కివీస్ పండ్లను తీసుకోవడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలివే!