కరోనా వస్తుందనే భయంతో గుండె జబ్బులు
కొద్ది రోజులుగా హాస్పిటల్లో గుండె జబ్బు వచ్చిందని వచ్చే వారి కంటే.. తమకు కరోనా వచ్చేస్తుందేమోననే బెంగతోనే సగం మందికి గుండె నొప్పులు వస్తున్నాయట. ఏ చిన్న లక్షణం కనిపించినా అది కరోనా

కొద్ది రోజులుగా హాస్పిటల్లో గుండె జబ్బు వచ్చిందని వచ్చే వారి కంటే.. తమకు కరోనా వచ్చేస్తుందేమోననే బెంగతోనే సగం మందికి గుండె నొప్పులు వస్తున్నాయట. ఏ చిన్న లక్షణం కనిపించినా అది కరోనానే అనుకుని గుబులు పడుతున్నారట. కరోనా వైరస్ సోకినప్పటికీ హాస్పిటల్ కు వెళ్లక హార్ట్ అటాక్ తో హాస్పిటల్ కు చేరాక అసలు విషయం తెలుస్తుందని నిపుణులు అంటున్నారు.
మాక్స్ హెల్త్ కేర్ ఛైర్ పర్సన్, కార్డియోలజీ డిపార్ట్‌మెంట్ హెడ్ డా.బల్బీర్ సింగ్ ఈ రోజుల్లో హార్ట్ అటాక్ గురించి భయపడుతున్నవారిలో 2 ప్రధాన కారణాలు ఉన్నాయన్నారు. ‘వారు కరోనా లక్షణాలు కనిపించినా చూపించుకోవడానికి కూడా హాస్పిటల్స్ వెళ్లాలంటే భయపడుతున్నారు. హాస్పిటల్స్‌లో ఉండే కొవిడ్ 19 ఎక్కడ సోకుతుందోననే భయం. రెండో కారణం ఏమంటే.. వేసవికాలం గుండె నొప్పులు సాధారణంగానే ఎక్కువ కనిపించడం. గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారిలో మూడో వంతు పేషెంట్లు మాత్రమే కరోనా పాజిటివ్ అయి ఉంటున్నారు’
ఫోర్టిస్ హాస్పిటల్‌లోని పల్మనాలజీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన డా.వివేక్ నంగియా కరోనా మహమ్మారి బారిన ఎక్కడ పడతామోననే భయంతోనే రావడం లేదని చెబుతున్నారు. పేషెంట్లు భయపడుతున్నారు. చాలా మంది ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ ద్వారా కన్సల్ట్ అయి కనుక్కుంటున్నారు. కొద్దిపాటి లక్షణాలున్నా హైపర్ టెన్షన్ పేషెంట్లు హాస్పిటల్ కు వచ్చిన తర్వాత భయంతో గుండె నొప్పి బారిన పడుతున్నారు.
కొవిడ్-19, గుండె సమస్యలకు సంబంధముందా?
హార్ట్ పేషెంట్లకు, కొవిడ్-19 వైరస్ కు ఏదైనా సంబంధముందా అంటే.. కొందరు కరోనా పేషెంట్లలో గుండు జబ్బులు ఉన్నవారు ఉన్నారు. ‘మేం విదేశాల నుంచి కరోనాతో పాటు గుండె జబ్బు వచ్చిన వారి ఈసీజీ రిపోర్టులు చూశాం. ఏంజియోగ్రఫీ జరిగిన వారి పరిస్థితి కూడా పరిశీలించాం. గుండెకు సంబంధించిన ఎంజైమ్ ట్రూపోనిన్ లో తేడాలు గమనించాం.
‘అది శరీరంలోకి విడుదలైన తర్వాతే హార్ట్ అటాక్ స్థితిని పరీక్షించగలం. ఈ ఎంజైమ్ స్థాయి ఎక్కువగా ఉంటే దానిని హార్ట్ అటాక్ అంటాం. ఇది చాలా మంది కొవిడ్-19 పేషెంట్లలో కనిపించింది. గుండె జబ్బు ఉన్నవారికి కొవిడ్-19 వస్తే వారికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ అని నిపుణులు అంటున్నారు.