Health Secrets: 103ఏళ్ల వయసులోనూ ఎంతో ఆరోగ్యంగా తాతయ్య.. క్యాన్సర్ ను కూడా జయించారు.. హెల్త్ సీక్రెట్స్ ఇవే..
69 ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో బాధపడ్డారు. ఆ తర్వాత దాన్ని నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత ఆర్థరైటిస్ తో బాధపడ్డాడు. వీటిని సహజంగానే ఆయన నయం చేసుకున్నారు. తన దీర్ఘాయువు రహస్యాలను పంచుకున్నారు.

Health Secrets: ప్రస్తుతం జబ్బుల కాలం నడుస్తోంది. ఏ వ్యక్తిని చూసినా ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్నాడు. బీపీ, షుగర్, గుండె జబ్బులు కామన్ అయిపోయాయి. దీనికి కారణం జీవన శైలి, కాలుష్యం, మనం తీసుకునే ఆహారం, పని, మానసిక ఒత్తిళ్లు. చిన్న వయసులోనే అనేక జబ్బులతో బాధపడే వాళ్లు ఎక్కువైపోతున్నారు. మూడు పదుల వయసు వారు సైతం గుండెపోట్లతో చనిపోతున్నారు. ఈరోజుల్లో 60 ఏళ్లు బతకడం అంటే మహా అద్భుతంగా చూస్తున్నారు. అలాంటి ఈ రోజుల్లో 100ఏళ్లకు పైగా బతికి ఉండటం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, హెల్తీగా ఉండటం ప్రతీ ఒక్కరికి సవాల్ గా మారింది.
అయితే జీవనశైలిలో మార్పులు, పరిమిత ఆహారం, దైనందిన జీవితంలో వ్యాయమం, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం, మంచి అలవాట్లు..ఇలాంటివి ఫాలో అయితే ఆరోగ్యకరంగా, ఎక్కువ కాలం జీవించి ఉండటం పెద్ద సమస్యమే కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేకాదు.. సెంచరీ దాటినా బతికి ఉండొచ్చని, ఎంతో హెల్తీగా ఉండొచ్చని చెబుతున్నారు. ఇందుకు నిదర్శనమే మైక్ ఫ్రీమాంట్. ఆయన వయసు ఎంతో తెలుసా. 103 ఏళ్లు. ఇప్పటికీ ఎంతో హెల్తీగా ఉన్నారు. ఈయన కూడా ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. అన్నింటిని జయించారు. ప్రాణాంతకమైన క్యాన్సర్ ను కూడా ఓడించారు.
మైక్ 69 ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో బాధపడ్డారు. ఆ తర్వాత దాని నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత ఆర్థరైటిస్ ను జయించారు. ముఖ్యమైన విషయం ఏంటంటే.. వీటిని సహజంగానే ఆయన నయం చేసుకున్నారు. మైక్.. తన దీర్ఘాయువు రహస్యాలను పంచుకున్నారు.
ఒహియోకు చెందిన మైక్ ఫ్రీమాంట్ 103 ఏళ్ల వయస్సులోనూ ఎంతో యాక్టివ్ గా ఉన్నారు. చాలా మంది వయసు పెరిగే కొద్దీ నెమ్మదిస్తారు. కానీ, మైక్ అలా కాదు. ఇంకా యాక్టివ్ అయ్యారు. ఇప్పటికీ ఆయన మెట్లు ఎక్కుతారు. పడవలు తొక్కుతారు. అంతేకాదు 98 సంవత్సరాల వయస్సు వరకు రోజుకు 10 మైళ్లు పరిగెత్తే వారు. క్రమశిక్షణ, సింప్లిసిటీ, ప్రకృతిలో కూడిన జీవనశైలి ఆయన దీర్ఘాయువుకు రహస్యాలు.
69 ఏళ్ల వయసులో క్యాన్సర్ కు శస్త్రచికిత్స చేయించుకోకపోతే కేవలం 3 నెలలు మాత్రమే బతికుంటారని మైక్ కు డాక్టర్లు చెప్పారు. కానీ ఆయన కుంగిపోలేదు. మిచియో కుషి రాసిన ది క్యాన్సర్ ప్రివెన్షన్ డైట్ (మొక్కల ఆధారిత మాక్రోబయోటిక్ డైట్ ను) స్వీకరించారు. ఇది పని చేసింది. కాలక్రమేణా ఆయన క్యాన్సర్ మాయమైంది. అంతేకాదు ఆర్థరైటిస్ కూడా తగ్గిపోయింది.
ఆహారమే ఫార్మసీ..
1994 నుండి మైక్ శుభ్రమైన, మొక్కల ఆధారిత ఆహారాన్ని అనుసరిస్తున్నారు.
ఆయన రోజువారీ మెనూ ఎంతో సింపుల్ గా ఉంటుంది- బ్రౌన్ రైస్, లీఫ్ క్యాబేజ్, క్యారెట్ వంటి ఉడికించిన కూరగాయలు తీసుకుంటారు.
ఖనిజాల కోసం సీవీడ్ (సముద్ర మొక్కలు), ప్రతిరోజూ సగం డబ్బా బీన్స్ తీసుకుంటారు.
చిక్కుళ్ళలో ఫైబర్, ప్రోటీన్, ఫైటో కెమికల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే పరిశోధనకు లింక్ చేస్తాయి.
క్యాన్సర్ నివారణ, రోగనిరోధక శక్తిని మెరుగు చేయడంలో మొక్కల ఆధారిత ఆహారాలు ఎటువంటి పాత్ర పోషిస్తాయో ప్రపంచ క్యాన్సర్ పరిశోధన నిధి హైలైట్ చేస్తుంది.
ప్రాసెస్ చేసిన చక్కెర, మాంసం, పాల ఉత్పత్తులు, ప్యాక్ చేసిన ఆహారాలను మైక్ అస్సలు తీసుకోరు. అత్యంత సహజ స్థితిలో, ఉడికించిన, ఆవిరి చేసిన లేదా పులియబెట్టిన ఆహారాన్ని ఇష్టపడతారు. నూనెలు లేకుండా, డీప్ ఫ్రై చేయని ఆహారమే తీసుకుంటారు.
Also Read: డాక్టర్స్ చెప్తున్న DASH డైట్.. హైబీపీ కంట్రోల్.. మీరు కూడా ట్రై చేయండి
వ్యాయామం కంటే కదలిక ముఖ్యం..
మైక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆయన వయసు (103 సంవత్సరాలు) మాత్రమే కాదు. జీవితంలో ఆయన ఏ విధంగా ముందుకెళ్తున్నారు అనేది ముఖ్యం. ఆయనకు 98 సంవత్సరాల వయస్సు వరకు కూడా వారానికి మూడు రోజులు 10 మైళ్లు పరిగెత్తారు. రోజుకు 48 సార్లు మెట్లు ఎక్కారు. ఇప్పుడు కూడా పుల్-అప్స్ చేస్తారు. పడవను సులభంగా తెడ్డు వేస్తారు. ఆయనకు కదలిక ఒక పని కాదు శ్వాస తీసుకోవడం లాంటిది. CDC ప్రకారం, క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేయడానికి సహాయపడుతుంది. జాయింట్స్ ని అదుపులో ఉంచుతుంది. మైక్ ఎప్పుడూ ట్రెండ్స్ లేదా వ్యాయామ ప్రణాళికలను అనుసరించలేదు. ప్రతిరోజూ, తనకు సహజంగా అనిపించే విధంగా చురుగ్గా ఉన్నారు.
మైక్ బాగా నిద్రపోతారు. 8 నుంచి 9 గంటలు నిద్రపోతారు. అలారం పెట్టుకోరు, స్క్రీన్ టైమ్ ఉండదు. విచిత్రమైన దినచర్యలు లేవు. కేవలం ఎలాంటి అంతరాయం లేని విశ్రాంతి మాత్రమే.
కణాలను మరమ్మతు చేయడానికి, వాపును తగ్గించడానికి, మెరుగైన పనితీరుకు మద్దతివ్వడానికి నాణ్యమైన నిద్ర అవసరమని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. మైక్ విషయంలో శరీరానికి సహజమైన విశ్రాంతి ఇవ్వడం అద్భుతాలు చేసిందని చెప్పొచ్చు.
వైద్యానికి వ్యతిరేకం కాదు, కానీ ప్రకృతి పట్ల చాలా శ్రద్ధ వహించాలి.
మైక్ కు వైద్యులతో పనే పడలేదు. ఆయనకు వారి అవసరం అంతగా రాలేదు. ఆహారమే తనను నయం చేసిందని ఆయన నమ్ముతారు. ప్రకృతికి అనుగుణంగా జీవిస్తారు. మైక్ తన సొంత ఆహారాన్ని పండించుకుంటారు. ఫిల్టర్ చేసిన నీటిని తాగుతారు. రసాయనాలు కలిపిన ఉత్పత్తులను నివారిస్తారు. బయట ఉండటంలో ఆనందాన్ని పొందుతారు.
ప్రకృతితో ఆయనకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. పచ్చని ప్రదేశాలలో గడిపే సమయం కార్టిసాల్ (ఒత్తిడి హార్మోన్) ను తగ్గిస్తుంది. నిద్రను మెరుగుపరుస్తుంది. నేలలో కనిపించే ప్రయోజనకరమైన సూక్ష్మజీవులకు గురికావడం ద్వారా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
ఎలాంటి మాయాజాలం లేదు.. క్రమశిక్షణ మాత్రమే
మైక్ జీవన విధానం అద్భుతమైన ఉత్సాహం కలిగిస్తుంది. క్యాన్సర్, ఆర్థరైటిస్‌లను జయించిన తీరు అద్భుతం. మైక్ జీవితంలో ఆకస్మిక పురోగతులు ఏవీ లేవు. మంచి ఆహారం, క్రమం తప్పకుండా కదలిక, విశ్రాంతి, పర్యావరణానికి అనుగుణంగా జీవించడం.. ఇవే ఆయన దీర్ఘాయువు రహస్యాలు.