DASH Diet Benefits: డాక్టర్స్ చెప్తున్న DASH డైట్.. హైబీపీ కంట్రోల్.. మీరు కూడా ట్రై చేయండి
DASH డైట్ అంటే Dietary Approaches to Stop Hypertension అని అర్థం. ఇది ముఖ్యంగా హై బ్లడ్ ప్రెషర్ నియంత్రణ కోసం రూపొందించబడిన ఒక ఆరోగ్యకరమైన ఆహార విధానం.

DASH Diet controls high BP
ఈ మధ్య కాలంలో హైబీపీ సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూ వస్తోంది. మరీ ముఖ్యంగా యువతలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. మారుతున్న జీవన విధానం లేదా ఆహారపు అలవాట్లు ఇలా చాలా రకాల కారణాల వల్ల ఈ సమస్య ఎక్కువవుతోంది. దీంతో చిన్న వయసు నుండే బీపీ కంట్రోల్ కోసం టాబ్లెట్స్ వాడాల్సిన పరిస్థితి వస్తోంది. అయితే ఈ సమస్యతో బాధపడుతున్నవారు ఖచ్చితంగా ఫుడ్ డైట్ మైంటైన్ చేయాల్సి ఉంటుంది.
కొంతమందిలో ఎంత డైట్ చేసినా కూడా బీపీ కంట్రోల్ అవదు. అలాంటి వారికోసం డాక్టర్స్ సూచిస్తున్న డైట్ DASH డైట్. దీనివల్ల మన ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఆ DASH డైట్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. DASH డైట్ అంటే Dietary Approaches to Stop Hypertension అని అర్థం. ఇది ముఖ్యంగా హై బ్లడ్ ప్రెషర్ నియంత్రణ కోసం రూపొందించబడిన ఒక ఆరోగ్యకరమైన ఆహార విధానం. దీని వల్ల కేవలం రక్తపోటు నియంత్రనే కాకుండా, ఇతర ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో కూడా ఎంతో ఉపయోగపడతాయి.
1.రక్తపోటు నియంత్రణ:
DASH డైట్ ప్రధాన ఉద్దేశం బ్లడ్ ప్రెషర్‌ను తగ్గించడం. దీంట్లో సోడియం పరిమితంగా తీసుకోవాలనేది ప్రధాన నియమం. ఎక్కువగా పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం ఉన్న ఆహరం తీసుకోవాలి. ఇవి రక్తనాళాల ఒత్తిడిని తగ్గించి బీపీని కంట్రోల్ చేస్తాయి.
2.గుండె ఆరోగ్యం:
ఈ డైట్‌లో సాచురేటెడ్ ఫ్యాట్స్, కొలెస్ట్రాల్ తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల గుండెకు మేలు జరుగుతుంది. ఇది హార్ట్ అటాక్, స్ట్రోక్, మరియు ఇతర కార్డియోవాస్కులర్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
3.మధుమేహం నియంత్రణ:
DASH డైట్‌లో ఫైబర్ అధికంగా ఉండే పిండిపదార్థాలు, తాజా కూరగాయలు, పండ్లు ఉండటం వలన ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. దీనివల్ల టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో ఉపయోగపడుతుంది.
4.బరువు తగ్గుతుంది:
DASH డైట్ లోపరిమిత కేలరీలు, తక్కువ కొవ్వులు, అధిక ఫైబర్ ఉన్న ఆహారం ఉంటుంది. కాబట్టి, దీన్ని అనుసరించేవారు సులభంగా బరువు తగ్గగలుగుతారు. ఇది బెళ్లీ ఫ్యాట్ ను సులభంగా తగ్గిస్తుంది.
5 కిడ్నీ ఆరోగ్యం:
ఈ డైట్ లో తీసుకునే ఆహరంలో సోడియం, ప్రోటీన్ పరిమితంగా ఉంటాయి. కాబట్టి కిడ్నీ వ్యాధులు వచ్చే రిస్క్ తగ్గుతుంది, ముఖ్యంగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ ) ఉన్నవారికి ఇది మంచి ఆప్షన్ అనే చెప్పాలి.
6.క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది:
DASH డైట్”లో ఎక్కువగా సహజమైన ఆహార పదార్థాలు, కూరగాయలు, పండ్లు, హోల్ గ్రెయిన్స్ ఉండటం వలన కొన్ని రకాల క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
DASH డైట్‌లో తీసుకోవలసిన ఆహారాలు:
- తాజా కూరగాయలు, పండ్లు
- హోల్ గ్రెయిన్స్ గోధుమ, ఓట్స్, బ్రౌన్ రైస్
- తక్కువ కొవ్వు కలిగిన పాల ఉత్పత్తులు
- ప్రోటీన్ శ్రోతలు మక్కజొన్న, శనగలు, పప్పులు, చేపలు, చికెన్
- పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు కాయలతో కూడిన పండ్లు, బీన్స్
తగ్గించాల్సిన ఆహారాలు
- ఉప్పు, మసాలాలు ఎక్కువగా కలిగిన ఆహారం
- ప్రాసెస్డ్ ఫుడ్స్
- ఎక్కువ కొవ్వులు, గుడ్లు, విటమిన్ D అధికంగా ఉన్న ఆహారం
- మధుర పదార్థాలు, మితిమీరిన మద్యం.