Chapati Benefits: రోజుకి ఎన్ని చెపాతీలు తింటున్నారు? అసలు ఎన్ని తినాలి.. డాక్టర్స్ ఏమంటున్నారు?

Chapati Benefits: చపాతీలు సాధారణంగా గోధుమ పిండితో తయారు చేస్తారు. అందులో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం, జింక్ లాంటి కొద్దిపాటి మినరల్స్ ఉంటాయి.

Chapati Benefits: రోజుకి ఎన్ని చెపాతీలు తింటున్నారు? అసలు ఎన్ని తినాలి.. డాక్టర్స్ ఏమంటున్నారు?

Health benefits of eating chapathi

Updated On : June 28, 2025 / 3:57 PM IST

ప్రతి రోజూ మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా బరువు నియంత్రణ, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ లాంటి జీవనశైలి సంబంధిత రోగాలను ఎదుర్కోవడంలో మితంగా తీసుకునే ఆహారం కీలకం. అందుకోసం చాలా మంది చపాతీలను ఎంచుకుంటారు. ఇది బరువు తగ్గడంలో సహాపడుతుంది. చపాతీలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా సులభంగా బరువు తగ్గవచ్చు అని చాలా మంది చపాతీలు తింటారు. కానీ, చాలా మందిలో సమస్య సందేహం ఏంటంటే? రోజుకు ఎన్ని చపాతీలు తినాలి? డాక్టర్స్ ఏమంటున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

చపాతీలో ఉండే పోషక విలువలు:

చపాతీలు సాధారణంగా గోధుమ పిండితో తయారు చేస్తారు. అందులో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం, జింక్ లాంటి కొద్దిపాటి మినరల్స్ ఉంటాయి. ఇవి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్స్ కన్నా ఆరోగ్యానికి చాలా మంచివిగా చెపుతున్నారు నిపుణులు.

రోజుకి ఎంత మోతాదులో చపాతీలు తినాలి?

రోజుకు ఎంత స్థాయిలో చపాతీలు తినడం అనే అంశం పూర్తిగా ఆ వ్యక్తి వయస్సు, శారీరక శ్రమ, లైఫ్‌స్టైల్, ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటుంది. వైద్యులు, న్యూట్రిషనిస్ట్‌లు సూచించే సాధారణ మార్గదర్శకాల ప్రకారం తక్కువ శ్రమ చేసే వారు రోజుకి 2 నుంచి 3 చపాతీలు, మితంగా శ్రమించే వారు 3 నుంచి 4 చపాతీలు, అధిక శ్రమ చేసే వారు 4 నుంచి 5 చపాతీలు తినవచ్చు. ఒక్కో చపాతీ సుమారుగా 70 నుంచి100 మద్యలో కేలరీలు ఉంటాయి.

ఎవరు జాగ్రత్తగా తినాలి?

  • షుగర్ ఉన్నవారు చపాతీలు మోతాదులో తినాలి. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగానే ఉంటుంది అయినప్పటికీ మోతాదుకు మించి తీసుకుంటే బ్లడ్ షుగర్ పెరిగే అవకాశం ఉంది.
  • బరువు తగ్గాలనుకునేవారు చాలా మంది చపాతీ తింటారు. కానీ, చపాతీ తోపాటు కర్రీ తినడం వల్ల కేలరీలు ఎక్కువవుతాయి. కనుక కర్రీ తక్కువ మసాలాలతో తీసుకోవడం మంచిది.
  • PCOS సమస్యతో బాధపడుతున్న ఆడవాళ్లు పూర్తి గోధుమతో చేసిన చపాతీలు తినడం మంచిదే కానీ, ప్రోటీన్ కంట్రోల్ ఉండటం మంచిది.

మంచి చపాతీలను ఎలా ఎంపిక చేసుకోవాలి?

  • పూర్తి గోధుమ పిండి ఉపయోగించాలి
  • మైదా కలిపిన గోధుమ పిండి వాడకం మానేయాలి.
  • చపాతీలో నెయ్యి/నూనె కూడా తగ్గించాలి.

చపాతీ ఒక ఆరోగ్యకరమైన ఆహారమే అయినప్పటికీ అధిక మోతాదులో తీసుకోవడం మంచిది కాదు. దేనికైనా పరిమితి చాలా ముఖ్యం. మీ శరీర పరిస్థితికి, లైఫ్‌స్టైల్‌కు తగ్గట్టుగా రోజుకి 3 నుండి 5 చపాతీలు మాత్రమే తినడం ఆరోగ్యకరమైన అలవాటు. మంచి న్యూట్రిషన్ కోసం చపాతీలతో పాటు కూరగాయలు, పాలు, పండ్లు, నూనెలు కూడా తీసుకోవడం మంచిది.