కరోనా లక్షణాలతో కేరళ నుంచి తప్పించుకోలేరు… దక్షిణకొరియా తరహాలో ప్రతిఒక్కరినీ ట్రాక్ చేసి, ట్రీట్ చేస్తారు

  • Published By: sreehari ,Published On : March 12, 2020 / 08:45 AM IST
కరోనా లక్షణాలతో కేరళ నుంచి తప్పించుకోలేరు… దక్షిణకొరియా తరహాలో ప్రతిఒక్కరినీ ట్రాక్ చేసి, ట్రీట్ చేస్తారు

Updated On : March 12, 2020 / 8:45 AM IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌‌ను చైనా తర్వాత విజయవంతంగా కంట్రోల్ చేసిన దేశాల్లో సౌత్ కొరియా ఒకటి. అయినప్పటికీ గురువారం నాటికి దక్షిణ కొరియాలో 114 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరుగురు మృతిచెందారు. ఫిబ్రవరి 29లో నమోదైన 909 కేసుల కంటే తక్కువగానే నమోదయినట్టు న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ నివేదించింది. ఆసియాలో చైనాలో బయట కరోనా వైరస్ వ్యాప్తి చాలా నెమ్మదిగానే ఉన్నట్టు ఆరోగ్యాధికారులు వెల్లడించారు. రోజురోజుకీ వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ను సౌత్ కొరియా ఎలా కంట్రోల్ చేసిందో ఇండియాలోని కేరళ రాష్ట్రం కూడా అదే ప్లాన్ అమలు చేయాలని భావిస్తోంది.

సౌత్ కొరియా తరహాలో వైరస్ అనుమానితులను గుర్తించడం, వారికి పరీక్షలు నిర్వహించడం.. లక్షణాలు ఉంటే ఐసోలేషన్ వార్డుల్లోకి తరలించడం వంటి చర్యలు కేరళ వేగవంతం చేస్తోంది. దీనికి సంబంధించి Pathanamthitta జిల్లా అధికారిక యంత్రాంగం బుధవారమే రెండు విభాగాల మ్యాప్‌లను విడుదల చేసింది. అందులో మొత్తం కరోనా వైరస్ బాధితులకు సంబంధించి వివరాలను పొందుపరిచింది. ఫిబ్రవరి 29 రోజున కొచ్చిన్ ఇంటర్నేషనల్ విమానశ్రయానికి చేరుకున్న ముగ్గురు ప్రయాణికులకు సంబంధించి పూర్తి వివరాలను రాబడుతోంది. 

ఇటలీ నుంచి వచ్చిన ముగ్గురిలో కరోనా :
విమానశ్రయం నుంచి వెళ్లిన తర్వాత నుంచి మార్చి 6న వైరస్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరేవరకు వారు ఎక్కడి నుంచి వచ్చారు. ఎవరెవరిని కలిశారు అనేదానిపై వారి పూర్తి జాబితాను సిద్ధం చేసింది. ఈ ముగ్గురు ప్రయాణికులు ఇటలీ నుంచి కొచ్చిన్ అంతర్జాతీయ విమానశ్రయానికి వచ్చి అధికారుల కంటపడకుండా మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు. ఆ తర్వాత వారిలో కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. అలోగా ఈ ముగ్గురి నుంచి బంధవుల్లో ఎనిమిదికి వైరస్ సోకింది. ముగ్గురికి సంబంధించి వివరాల కోసం ఆరోగ్యా అధికారులు, పోలీసులు, స్థానికులు, బంధువుల సాయంతో మ్యాప్స్ సిద్ధం చేశారు.
Airport kerala

వైరస్ బాధితుల ట్రావెల్ ఫుల్ రిపోర్ట్ :
వారు ఎక్కడెక్కడికి వెళ్లారో పూర్తి రిపోర్టును రెడీ చేశారు. మ్యాప్స్ రిపోర్టుల ప్రకారం.. ఆ ముగ్గురు బాధితులు బ్యాంకులు, హోటల్స్, బేకరీలు, చర్చీ, ఆస్పత్రులు, బార్, పబ్లిక్ ట్రాన్స్ ఫోర్టుల్లో కూడా ప్రయాణించినట్టు గుర్తించారు. ఈ బాధితులు కలిసిన చాలామందిని గుర్తించగా వారిలో కూడా వైరస్ లక్షణాలు ఉన్నట్టుగా సౌత్ కొరియన్ అధికారులు నిర్ధారించారు. వైరస్ సోకిన వారిని కనీసం 14 రోజుల పాటు పర్యవేక్షించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా వారి క్రెడిట్ కార్డు ఎక్కడ వాడారో ట్రాక్ చేయడం, సీసీటీవీ ఫుటేజీ, మొబైల్ ఫోన్ యాక్టివిటీ అన్నింటి ద్వారా ట్రాకింగ్ చేసినట్టు న్యూస్ ఏజెన్సీ AEP నివేదించింది. 

అన్ని నెగటీవ్ రిపోర్టులే :
ప్రస్తుతం.. కేరళలో కూడా కరోనా వ్యాప్తితో హైఅలర్ట్ కొనసాగుతోంది. ఇప్పటివరకూ 3వేల మందిని పర్యవేక్షణలో ఉంచినట్టు ఆరోగ్య శాఖ మంత్రి కెకె శైలజ తెలిపారు. వైరస్ అనుమానితుల నుంచి మొత్తంగా 1,1179 శాంపిల్స్ పంపగా, ఈ రోజు 889 శాంపిల్స్ పంపినట్టు రిపోర్టు తెలిపింది. ఇందులో అన్ని నెగటీవ్ అని నిర్ధారించినట్టు రిపోర్టు పేర్కొంది. మరో 213 మంది టెస్టు రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నట్టు వెల్లడించింది.
coronavirus

అప్పటివరకూ 14మందిలో పాజిటీవ్ లక్షణాలు ఉన్నట్టుగా గుర్తించామని శైలజా వెల్లడించారు. ఇండియాలో మొదటి మూడు పాజిటీవ్ కరోనా కేసులు నమోదైంది కేరళలోనే. వారంతా కోలుకుంటున్నారు. COVID-19 పాజిటీవ్ కేసులు గురువారం ఉదయం సమయానికి 73 కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఏప్రిల్ 15వరకు భారతీయ సంతతి విదేశీయులకు వీసా ఫ్రీ ట్రావెల్ సౌకర్యం పొడిగింపుతో పాటు అన్ని వీసాలను ప్రభుత్వం రద్దు చేసింది. 

See Also | కరోనా ఆందోళనకరమేనన్న జై శంకర్…ప్రయాణాలు వద్దని సూచన