ఆఫీసులకు తిరిగి వెళ్లే ముందు.. మంచి నిద్రవేళకు అలవాటు పడాలంటే.. ఇలా చేయండి!

కరోనా మహమ్మారి సమయంలో నెలల తరబడి ఇంట్లోనే ఉండి పనిచేసి ఉంటారు. ఇంట్లో నుంచి పనిచేసే సమయంలో మీ నిద్రపోయే అలవాట్లు, దినచర్యల్లో మార్పు వచ్చి ఉంటాయి.. మునపటిలా ఆఫీసులకు వెళ్లాలంటే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకునేవారు.. ఎప్పుడు లేవాలి? ఆఫీసులకు వెళ్లేందుకు సరైన సమయాన్ని ఎంచుకునేవారు.
ఇంట్లోనే ఉండటం వల్ల సుదీర్ఘ ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేదు. లేచే వేళల్లో కూడా చాలా మార్పులు కనిపిస్తాయి.. త్వరలో తిరిగి ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం వస్తే.. మీరు మునపటిలా సిద్ధమై పోవాలి.. అందుకు తగినట్టుగా మీ అలవాట్లను, నిద్ర సమయాన్ని మునపటిలా ప్రారంభించాల్సి ఉంటుంది.
ఎందుకంటే.. ఆగస్టు 1 నుంచి ఆఫీసులకు వెళ్లాల్సిన పరిస్థితులు రావొచ్చు.. కంపెనీలు సైతం తమ ఉద్యోగులను తిరిగా ఆఫీసులకు వచ్చేలా ఎలాంటి నిర్ణయాలు తీసుకోనే అవకాశం ఉంది. ముందుగానే ఆఫీసులకు వెళ్లేందుకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో ఆఫీసులకు వెళ్లి వర్క్ చేసేందుకు మీరు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
సౌకర్యవంతమైన వర్క్ కోసం అధికారితో మాట్లాడండి :
కరోనావైరస్ కారణంగా ఇంటి నుంచి పని చేయాల్సిన అవసరం పడింది. చాలా ఆఫీసుల్లోనూ భవిష్యత్తులో శాశ్వతంగా ఆఫీసు ఆధారిత వర్క్ చేయాల్సి వస్తుందని అంటున్నారు. కొంతమందిలో ఇంటి నుండి ఉద్యోగులు ఎంత సౌకర్యవంతంగా పనిచేయగలరో ప్రశ్నించుకోండి. ఆఫీసు వర్క్ ఇంటి నుంచి హాయిగా చేయగలిగితే.. అది ఎలా ముందుకు సాగుతుందనే దానిపై అధికారితో మాట్లాడుకోవాల్సి ఉంటుంది.
మీరు మరింత సౌకర్యవంతంగా పని చేయగలిగితే లేదా ఇంటి నుండి కొన్ని రోజులు పని చేయడానికి అనుమతి కోరవచ్చు. అలా అయితే మీకు విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది. మీ వర్క్ షెడ్యూల్ మరింత కఠినంగా ఉంటే.. మీ శరీరం సహకరించేలా ఉండే పనులను చేసేందుకు ప్రయత్నించవచ్చు.
నిద్ర సమయాన్ని ముందుకు మార్చొద్దు :
ఆఫీసులకు తిరిగి వెళ్లాల్సి వస్తే.. మునపటిలా నిద్రవేళకు మారొచ్చు.. నిద్ర సమయాన్ని మరింత ముందుకు మార్చొద్దు.. లాక్ డౌన్ సమయంలో ఉన్నదానికంటే మేల్కొనే సమయం ముందే ఉండవచ్చు. నిద్రలేసే సమయాన్ని ముందుకు మార్చాల్సిన అవసరం ఉందని భావిస్తుంటారు.
నిద్ర గురించి మనకు తెలిసిన ముఖ్య విషయాలలో ఒకదాన్ని విస్మరిస్తున్నామని మరిచిపోతున్నారు.. బలవంతంగా నిద్రపోవడానికి ప్రయత్నించొద్దు.. ముందే నిద్ర పోయేందుకు ప్రయత్నిస్తే.. అప్పుడు నిద్ర రాకపోగా.. ఆఫీసులకు వెళ్లే సమయంలో ఒక్కసారిగా నిద్ర ముంచుకుస్తుంటుంది.
మేల్కోనే సమయాన్ని కాస్తా వెనక్కి మార్చేయండి :
నిద్రపోయే సమయాన్ని ముందుకు మార్చొద్దు.. మేల్కొనే సమయాన్ని మార్చడంపై దృష్టి పెట్టండి.. మీరు అంతకుముందు నిద్రపోవాలంటే.. మేల్కొనే సమయాన్ని కాస్తా వెనక్కి మార్చేయండి.. అంటే.. ప్రతిరోజు సుమారుగా 30 నిమిషాలకు మార్చేయండి..
ఇలా చేయడం వల్ల కొత్త సమయానికి కనీసం మూడు రోజులు మేల్కొంటారు. నిద్రపోయే సమయాన్ని కూడా స్థిరంగా ఉండేలా చేస్తుంది.. నిద్రపోవాల్సిన సమయంలో శరీరానికి కావాల్సినంత నిద్ర అందుతుంది..
ఉదయం లేవగానే సూర్యరశ్మి తగిలేలా ఉండాలి :
ఉదయం లేవగానే కాస్తా సూర్యరశ్మి శరీరంపై పడేలా చూసుకోవాలి. ఎందుకంటే.. పగటి పూట అని శరీరానికి అర్థం చేసుకోవడానికి వీలుంటుంది. ఇలా చేయడం ద్వారా మీలో బద్ధకాన్ని తగ్గిస్తుంది. ఆఫీసుకు వెళ్లే సమయాన్ని గుర్తు చేస్తుంది.. లేవగానే బయటకు రావడం.. సూర్యరశ్మి శరీరంపై తగిలేలా చూడటం చేయాలి. అప్పుడు మీ శరీరం నిద్రమబ్బును వీడేందుకు సాయపడుతుంది.
బెడ్ రూంలో వ్యాయామం చేయొద్దు :
లాక్ డౌన్ సమయంలో ఎక్కడి పడితే అక్కడి వ్యాయమం అలవాటు అయి ఉండొచ్చు.. కొంతమంది బయటకు రాలేక.. బెడ్ రూంలోనే వ్యాయామం చేసేస్తుంటారు. ఇప్పుడు ఆఫీసులకు వెళ్లే సమయంలో మీ కొత్త నిద్ర షెడ్యూల్ కు ఎలా సరిపోతుందో లేదో చూసుకోవాలి. వ్యాయామానికి చేయాల్సి వస్తే.. అది నిద్రకు మంచిదని గుర్తించుకోండి.. కానీ నిద్రవేళకు చాలా దగ్గరగా (నిద్రకు ముందు మూడు గంటల్లో) మీ నిద్రను మరింత దిగజార్చుతుంది. రాత్రి సమయంలో మీరు మేల్కొలపడానికి కారణమవుతుంది జాగ్రత్త..
విశ్రాంతినిచ్చే సమయాన్ని గడపండి :
ఆఫీసులకు తిరిగి వెళ్లడమనేది చాలా ఒత్తిడిని కలిగించొచ్చు.. మీరు నిద్రించడానికి ముందు కాస్తా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి.. అప్పుడే మీకు మంచి నిద్ర పట్టేందుకు వీలుంటుంది.
మంచి నిద్ర కోసం విశ్రాంతినిచ్చేలా ఉండాలంటే.. శరీరంపై ఒత్తిడి తగ్గడానికి షవర్ స్నానం చేయండి.. మీ శరీరం రిలాక్స్ అవుతుంది. మంచి నిద్ర పడుతుంది. ఆఫీసు సమయంలో చురుకుగా ఉండేందుకు ఎంతో సహాయపడుతుంది.