Quit Smoking: సిగరెట్ మానేయాలనుకుంటున్నారా?.. అయితే ఇలా చేయండి.. లైఫ్ లో మళ్ళీ సిగరెట్ చూడరు
Quit Smoking: సిగరెట్ మానేయాలని నిర్ణయం తీసుకోవడం అనేది మొదటి అడుగు. కానీ, ఎందుకు మానేయాలనుకుంటున్నారో స్పష్టంగా తెలుసుకోవాలి.

If you want to quit smoking, follow these 5 best tips.
సిగరెట్ తాగడం అనేది ఆరోగ్యానికి ఎంత హానికరం. ఇది మనందరికీ తెలిసిందే. కానీ దాన్ని మానేయడం అంత ఈజీ కాదు. ఒకసారి అలవాటు అయ్యింది అంటే ప్రాణాలు విడవాలె కానీ అది మాత్రం వదిలిపెట్టలేరు. అంతలా దానికి బానిసై పోతారు. కొంతమంది ప్రయత్నించి మళ్ళీ ఆ అలవాటులో పడిపోతుంటారు. కాబట్టి, నమ్మకంగా, స్థిరంగా మానేయాలంటే కొన్ని ప్రాక్టికల్ టిప్స్ పాటించక తప్పదు. మరి సిగరెట్ మానేయడానికి అవసరమయ్యే అలాంటి చిన్న చిన్న ప్రాక్టికల్ చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1.స్పష్టమైన లక్ష్యం పెట్టుకోండి:
సిగరెట్ మానేయాలని నిర్ణయం తీసుకోవడం అనేది మొదటి అడుగు. కానీ, ఎందుకు మానేయాలనుకుంటున్నారో స్పష్టంగా తెలుసుకోవాలి. ఆరోగ్యం కోసమా? కుటుంబం కోసమా? డబ్బు సేవ్ చేయడానికా? ఇలా మీరు ఎంచుకున్న లక్ష్యం స్పష్టంగా ఉంటే మోటివేషన్ కోల్పోకుండా ఉండగలుగుతారు.
2.మానేయే తేదీని నిర్ణయించుకోండి:
సిగరెట్ మానేయడం కోసం ఒక నిర్ధిష్ట తేదీని ఫిక్స్ చేసుకోండి. ఆ డేట్ వరకు మీరు మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండండి. ఆ రోజు నుండి పూర్తిగా మానేయాలని మీకు మీరు ప్రమాణం చేయండి. ఆ తేదీకి ముందు సిగరెట్ లభ్యం కాకుండా చూసుకోండి.
3.ట్రిగర్స్‌ను గుర్తించండి:
చాలా మందికి కాఫీ తాగిన తర్వాత, ఒత్తిడిలో ఉన్నప్పుడు, పార్టీకి వెళ్లినప్పుడు సిగరెట్ తాగడానికి ట్రిగర్ అవుతుంటాయి. మీకు ఏ సందర్భాల్లో తాగాలనే ఫీలింగ్ వస్తుందో వాటిని గుర్తించండి. ఆ సందర్భాలకు దూరంగా ఉండండి. వాటిని తప్పించుకోవడానికి ప్రయత్నించండి.
4.ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు ఎంచుకోండి:
సిగరెట్ తాగాలనిపించినప్పుడు తక్షణంగా నీళ్ళు తాగడం లేదా మరేదైనా ప్రత్యామ్నాయాలను ఎంచుకోండి. కొన్ని డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్‌లు చేయడం వంటివి కూడా అలవాటు చేసుకోండి. ఇది మానసికంగా డైవర్ట్ చేయడమే కాకుండా, అలవాటును మానుకునేలా చేస్తుంది.
5.ఒంటరిగా ఉండకండి:
మీరు సిగరెట్ మానేయాలని ప్రయత్నిస్తున్నారంటే మీ కుటుంబం, ఫ్రెండ్స్, కన్సల్టెంట్ల సహాయం తీసుకోండి. ఒంటరిగా ఉందంకండి. ఫ్యామిలీతో, స్నేహితులతో గడపడానికి సమయం కేటాయించండి. అలాగే ఎప్పుడు వర్క్ లో బిజీగా ఉండేలా చూసుకోండి. పనిలో ఉండే వేరే ఆలోచనలు రాకుండా ఉంటుంది.
సిగరెట్ మానేయడం ఒక రోజుతో అయ్యే పని కాదు, కానీ, గట్టిగా ప్రయత్నిస్తే పెద్ద సమస్య కాదు. ప్రతి రోజు మీ ఆరోగ్యానికి చేసిన మంచి పని అనే భావనతో ముందుకు సాగండి. మొదటి కొన్ని రోజులు కష్టంగా అనిపించొచ్చు, కానీ క్రమంగా మీరు అదుపులోకి వస్తుంది.