బరువు తగ్గటానికి డైటింగ్ చేస్తే సరిపోతుందా? వ్యాయామాలతో పనిలేదా?
రోజులో కొంత సమయాన్ని ఏదో ఒక విధంగా శారీరకంగా కష్ట పడడానికి ప్రయత్నించండి. శారీరక వ్యాయామాలను చేస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అవయవాలన్నీ చురుగా పనిచేస్తాయి. క్యాలరీలు కరుగుతాయి.

weight loss exercises
శరీరంలో అధిక బరువు కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు కారణమౌతుంది. అధిక బరువుకు అనేక కారణాలు ఉన్నాయి. జీవనవిధానం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, జన్యుపరమైన కారణాలు అధిక బరువుకు దారితీస్తాయి. సమస్యగా పరిణమించిన అధిక బరువును తగ్గించుకునేందుకు వివిధ రకాల పద్దతులను అనుసరిస్తున్నారు. కొంతమంది బరువు తగ్గేందుకు డైటింగ్ చేస్తుంటే మరికొందరు జిమ్‌లు, ఫిట్నెస్ సెంటర్లు చుట్టూ తిరుగుతున్నారు.
వాస్తవానికి బరువు తగ్గే క్రమంలో అనే మంది పాటిస్తున్న పద్దతుల్లో డైటింగ్ చేయటం ఒక ఎత్తు అయితే అందుకు అనుగుణంగా రోజువారిగా శారీరక వ్యాయామాలు చేయటం వల్ల బరువు సులభంగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. మరి కొందరైతే బరువు తగ్గాలన్న ఉద్దేశంతో తొలినాళ్లల్లో జిమ్ లో జాయిన్ అవుతారు. కొద్దిరోజుల తరువాత క్రమం తప్పకుండా వెళ్ళకుండా బద్దకిస్తారు. ఇలా చేయటం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. డైటింగ్ పేరుతో పూర్తిగా ఆహారం మానుకోవటం ఏమాత్రం సరైంది కాదు. కొద్ది మొత్తంలో ఆహారం తీసుకుంటూ తేలిక పాటి వ్యాయామాలు, రన్నింగ్ , వాకింగ్, యోగా, స్విమ్మింగ్ వంటి వాటిని ప్రయత్నించాలి. వీటి వల్ల సులభంగా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.
రోజులో కొంత సమయాన్ని ఏదో ఒక విధంగా శారీరకంగా కష్ట పడడానికి ప్రయత్నించండి. శారీరక వ్యాయామాలను చేస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అవయవాలన్నీ చురుగా పనిచేస్తాయి. క్యాలరీలు కరుగుతాయి. ఈ వ్యాయామాలతో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. క్రమం తప్పకుండా బరువు తగ్గటం కోసం చేసే వ్యాయామాలతో మెదడు ఆరోగ్యం పుంజుకుంటుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారు ఇతర అంశాలపైనా దృష్టి పెట్టాలి. ప్రొటీన్స్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. చక్కెర, ఆయిల్, ఫ్యాట్స్ తక్కువగా ఉండేలా చేసుకోవాలి. జంక్ ఫుడ్ జోలికి వెళ్లకూడదు. ఒకవేళ ఆకలిగా ఉన్నప్పుడు ఓ యాపిల్ పండు తీసుకోవాలి. సరైన నిద్ర ఉండేలా చూసుకోవాలి.