Magnesium Oil Benefits: మెగ్నీషియం నూనెతో మెరుగైన నిద్ర.. ఒళ్ళు నొప్పులు మాయం.. ఇంకా చాలానే ఉన్నాయి
Magnesium Oil Benefits: మెగ్నీషియం ఆయిల్ (Magnesium Oil) అనేది నిజంగా నూనె కాదు. ఇది మెగ్నీషియం క్లోరైడ్ (Magnesium Chloride) అనే ఖనిజ లవణాన్ని నీటిలో కలిపి తయారు చేసే ద్రావణం.

Magnesium oil can relieve sleep problems
నేటి వేగవంతమైన జీవనశైలి, పని ఒత్తిడి, స్క్రీన్ సమయం పెరగడం వంటి అంశాలు వల్ల చాలా మంది ప్రశాంతమైన నిద్రకు దూరమవుతున్నారు. దాంతో మంచి నిద్ర కోసం కృత్రిమ ప్రత్యామ్నాయాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వాటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ నేపధ్యంలో, ప్రకృతి సమ్మేళనాలవైపు ఆలోచించడం ఉత్తమం. వాటిలో మెగ్నీషియం నూనె (Magnesium Oil) బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. నిద్రకు ఇది ప్రకృతి ఆధారిత పరిష్కారంగా పేరుపొందుతోంది.
మెగ్నీషియం ఆయిల్ అంటే ఏమిటి?
మెగ్నీషియం ఆయిల్ (Magnesium Oil) అనేది నిజంగా నూనె కాదు. ఇది మెగ్నీషియం క్లోరైడ్ (Magnesium Chloride) అనే ఖనిజ లవణాన్ని నీటిలో కలిపి తయారు చేసే ద్రావణం. ఇది నీటిలో కలిసినపుడు కాస్త జిడ్డుగా, నూనెలాగా మారుతుంది. అందుకే దీనిని ఆయిల్ గా పరిగణిస్తున్నారు. ఈ ద్రావణాన్ని సాధారణంగా చర్మంపై స్ప్రే, మసాజ్ రూపంలో వాడుతారు. అలా చేయడం వల్ల చర్మం ద్వారా మెగ్నీషియం శరీరంలోకి శోషించబడుతుంది. ఇది నొప్పుల నుంచి కూడా ఉపశమనాన్ని ఇస్తుంది.
మెగ్నీషియం నూనెతో మంచి నిద్ర:
మెగ్నీషియం మన శరీరంలో శాంతి, నిద్రకు సంబంధించి కీలకమైన శక్తి సమతుల్యతకు కారణమవుతుంది. ఇది ముఖ్యంగా నరాల శాంతికి అవసరమైన GABA (Gamma Aminobutyric Acid) అనే న్యూరోట్రాన్స్మిట్టర్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది మన మెదడును విశ్రాంతిగా ఉంచి, నిద్రను ప్రేరేపిస్తుంది. అలాగే ఒత్తిడికి కారణమయ్యే కోర్టిసాల్ ఉత్పత్తిని తగ్గించడంలో సహాయపడుతుంది. దీనివల్ల మనసు ప్రశాంతంగా మారి నిద్రకి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. మెగ్నీషియం నూనెను చర్మంపై రాసినప్పుడు అది శరీరంలోకి శోషించబడి నరాలను విశ్రాంతిగా చేస్తుంది. రాత్రి నిద్రకుముందు ఇలా చేయడం వల్ల మానసిక, శారీరక విశ్రాంతి కలుగుతుంది.
మెగ్నీషియం నూనె ఉపయోగించే విధానం:
- నిద్రకి ఒక గంట ముందు మెగ్నీషియం నూనెతో కాళ్ళకు, చేతులకు లేదా మెడపైన సున్నితంగా మసాజ్ చేయాలి.
- ప్రారంభంలో కొంత మంటగా అనిపించవచ్చు, కానీ ఇది తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది.
- ఇలా వారానికి 3 నుంచి 5 సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలుం అందుతాయి.
ఇతర ఆరోగ్య ప్రయోజనాలు:
క్రాంపులు, నొప్పులు తగ్గించడం: మెగ్నీషియం శరీరంలోని కృంపులను తగ్గించడంలో సహాయపడుతుంది. క్రీడాకారులు దీనిని తరచూ వాడటం మనం చూస్తూనే ఉంటాం.
మెదడు ఆరోగ్యం: మెగ్నీషియం నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇది మూడ్‌ను స్ధిరంగా ఉంచడంలో సహాయపడుతుంది.
చర్మ ఆరోగ్యం: కొన్ని నివేదికల ప్రకారం, మెగ్నీషియం నూనె చర్మానికి మృదువుగా చేయడంతో పాటు పొడి చర్మం, యాక్నే లాంటి సమస్యలను నయం చేస్తుంది.
ఆర్థ్రిటిస్, వెన్నుముల్లు నొప్పుల ఉపశమనం: మెగ్నీషియం నూనె నొప్పులు ఉన్నవారికి దివ్యౌషధం అనే చెప్పాలి. వ్యాధి సోకి బాధపడుతున్నవారు దీన్ని మసాజ్ నూనెగా వాడి ఉపశమనం పొందవచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- గర్భిణులు, పిల్లలు వాడే ముందు వైద్య సలహా తప్పనిసరి.
- ఓపెన్ వౌండ్స్ లేదా అలర్జీ ఉన్నచోట నూనె రాయకూడదు.
- ఎక్కువ పరిమాణంలో వాడితే చర్మంపై ఇరిటేషన్ వచ్చే అవకాశం ఉంది.