Hair Loss: ఈ పనులు పదేపదే చేస్తున్నారా.. జుట్టు ఊడిపోయే ప్రమాదం ఉంది

హెయిర్ డ్రయ్యర్స్ ను ఎక్కువగా వాడటం వల్ల జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే ప్రొటీన్లపై కూడా ఇది ప్రభావం చూపిస్తుందట.

Hair Loss: ఈ పనులు పదేపదే చేస్తున్నారా.. జుట్టు ఊడిపోయే ప్రమాదం ఉంది

Hair loss Problems

Updated On : June 9, 2025 / 10:55 AM IST

మగువలకు అందాన్ని ఇచ్చేవి వారి కురులే. కురులు ఎంత పొడవుగా ఉండే ఆడవాళ్లు అంత అందంగా కనిపిస్తారు. అందుకే.. కురుల ఆరోగ్యం కోసం, ఒత్తుగా పెరగడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో దొరికే చాలా రకాల షాపులు, ఆయిల్స్, లిక్విడ్స్ వాడుతూ ఉంటారు. డబ్బులు కూడా ఒక రేంజ్ లో ఖర్చు చేస్తుంటారు. నిజానికి వాటివల్ల ఉపయోగం కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. కొన్నిసార్లు మనంకు తెలియకుండా చేసే పనులు కూడా జుట్టు రాలిపోవడానికి కారణం అవుతున్నాయి. మరి ఆ పనులు ఏంటి? జుట్టు రాలకుండా ఎం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ మధ్య కాలంలో చాలా మంది జుట్టును ఆరబెట్టడం కోసం హెయిర్ డ్రయ్యర్స్ ను వాడుతున్నారు. వీటి వాడకంలో ఆడవాళ్లు ముందున్నారు. జాబ్ చేసే ఆడవాళ్లు, చదువుకునే ఆడవాళ్లు తలస్నానం చేసినప్పుడు లేట్ అవుతుందన్న తొందరలో జుట్టు ఆరబెట్టుకోవడానికి డ్రయ్యర్ లను యూజ్ చేస్తున్నారు. నిజానికి ఈ డ్రయ్యర్స్ వాడకం మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు. డ్రయ్యర్స్ ను ఎక్కువగా వాడటం వల్ల జుట్టు గరుకుగా తయారువుతుందట. అంతేకాదు.. జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే ప్రొటీన్లపై కూడా ఇది ప్రభావం చూపిస్తుందట. అందుకే జుట్టు ఆరోగ్యం విషయంలో డ్రయ్యర్స్ కి దూరంగా ఉండటం మంచిది.

ఒత్తైన జుట్టు కోసం చాలా మంది ఆడవాళ్లు కెమికల్స్ వాడుతున్నారు. షాంపూలు, ఆయిల్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. నిజానికి వాటివల్ల ఉపయోగం ఎంత ఉందో అంతకన్నా ఎక్కువ నష్టమే ఉందట. ఎక్కువగా కెమికల్స్ ని వాడటం వల్ల అది జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూస్తుందట. నిజానికి జుట్టు పెరుగుదల కోసం కెమికల్స్ యూజ్ చేయడం కంటే ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఎందుకంటే.. సహజమైన ఆహారం వల్ల పెరిగే జుట్టు అందంగా ఆకర్షణీయంగా ఉంటుందట.

కొంతమంది స్టైల్ గా కనిపించడం కోసం వివిధ రకాలుగా జుట్టును అల్లుకుంటారు. అందుకోసం జుట్టును బిగుతుగా ముడేస్తారు. అలా బిగుతుగా ముడివేయడం కూడా మంచిది కాదని చెప్తున్నారు నిపుణులు. కారణం ఏంటంటే.. జుట్టును బిగుతుగా లాగి ముడేయడం వల్ల అది కుదుళ్ళుపై ప్రభావం చూపించి బలహీనంగా మారేలా చేస్తాయట. దానివల్ల జుట్టు పెరగడం ఆగిపోతుంది. కాబట్టి జుట్టును వీలైనంతమట్టుకు వదులుగా ఉంచడమే మంచిదట.

హెయిర్ లాస్ కి మరో ప్రధాన కారణం పొల్యూషన్. బయటకి వెళ్ళినప్పుడు వెలువడే దుమ్ము, దూళి, పొగ జుట్టును చాలా డ్యామేజ్ చేస్తాయి. దానికి సంబందించిన జాగ్రత్తలు కుడి తీసుకోవాలి. ఇక షాంపులను కూడా ఎంత అవసరమో అంతే వాడుకోవాలి. ఎక్కువగా వాడటం వల్ల జుట్టు పెరుగుదలపై ప్రభావం పడుతుంది. ఇంకా జుట్టు చివర్లను ఎప్పటికప్పుడు కత్తిరించడం వల్ల కూడా జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుందట. ఆలా చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా తయారవుతుందని నిపుణులు చెప్తున్నారు.