Health: 19ఏళ్లలోపు యువత జాగ్రత్త..! కొత్త డయాబెటిస్ వచ్చేస్తోంది.. కనిపెట్టడం కష్టం.. ట్రీట్మెంటూ లేదు..

ఇప్పటి వరకు టైప్1, టైప్ 2 డయాబెటిస్ గురించే అందరికీ తెలుసు. కానీ, ఆ జాబితాలోకి కొత్తగా మరోరకం డయాబెటిస్ వచ్చి చేరింది.

Health: 19ఏళ్లలోపు యువత జాగ్రత్త..! కొత్త డయాబెటిస్ వచ్చేస్తోంది.. కనిపెట్టడం కష్టం.. ట్రీట్మెంటూ లేదు..

Diabetes

Updated On : April 13, 2025 / 10:48 AM IST

Health: డయాబెటిస్ (షుగర్) గురించి దాదాపు అందరికీ తెలిసిందే. మనదేశంలో టైప్1, టైప్2 డయాబెటిస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 8.98కోట్ల మంది షుగర్ తో బాధపడుతున్నారు. డయాబెటిస్ కేసుల్లో ప్రపంచ దేశాల్లో ఇండియా రెండో స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. 2025 నాటికి ఈ కేసుల సంఖ్య 75శాతం పెరిగి 15.67 కోట్లకు చేరుకునే ప్రమాదం ఉందని ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ (ఐడీఎఫ్) అంచనా వేసింది. అయితే, ఈ టైప్1, టైప్ 2 డయాబెటిస్ లు ఎక్కువగా 40ఏళ్ల పైబడిన వారిలో కనిపిస్తున్నాయి. తాజాగా.. భయాందోళనకు గురిచేసే విషయం ఏమిటంటే.. డయాబెటిస్ లో మరో కొత్తరకం చేరింది. ఇటీవల థాయిలాండ్ లో నిర్వహించిన డయాబెటిస్ సదస్సులో టైప్5 డయాబెటిస్ ను ఐడీఎఫ్ అధికారికంగా ప్రకటించింది.

 

ప్రపంచ వ్యాప్తంగా టైప్5 బాధితులు..
టైప్ 1, టైప్2 డయాబెటిస్ లు ఊబకాయంతో లేదంటే జన్యు సమస్యలతో వస్తుంటాయి. కానీ, ఈ టైప్5 డయాబెటిస్ కు ప్రధాన కారణం పోషకాహారలోపమేనని సైంటిస్టులు వెల్లడించారు. టైప్5 డయాబెటిస్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నాయని ఐడీఎఫ్ సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో టైప్5 డయాబెటీస్ బారిన పడినవారి సంఖ్య 2.5కోట్లగా ఉంది. ఈ కేసులు ఎక్కువగా ఆసియా, ఆఫ్రికా రీజియన్లలోనే ఉన్నట్లు గుర్తించారు.

 

19ఏళ్ల లోపు యువత జాగ్రత్త..
టైప్5 డయాబెటిస్  19ఏళ్ల లోపు యువతలోనే ఎక్కువగా కనిపిస్తుందని, పోషహకార లోపంతో టైప్ 5 డయాబెటిస్ వస్తున్నట్లు ఐడీఎఫ్ పేర్కొంది. ప్రస్తుతం ఉన్న టైప్1, టైప్ 2 డయాబెటిస్ కు ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా ట్రీట్మెంట్ చేయొచ్చు. కానీ, టైప్ 5 డయాబెటిస్ ను ఇన్సులిన్ ఇంజెక్షన్ తోనూ కంట్రోల్ చేయలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిని గుర్తించడం కూడా కష్టమే. ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదమూ ఎక్కువేనని చెబుతున్నారు. తెలంగాణలోనూ ఇలాంటి కేసులు వస్తున్నట్లు డయాబెటిస్ నిపుణులు చెబుతున్నారు. అయితే, ఎన్ని కేసులు వస్తున్నాయన్నది మాత్రం ప్రస్తుతం ఖచ్చితమైన లెక్కలు లేవని అంటున్నారు.

 

ఐడీఎఫ్ అధ్యయనంలో కీలక విషయాలు..
రెండేళ్ల క్రితం వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీకి చెందిన శాస్త్రవేత్తలతో కలిసి ఐడీఎఫ్ పరిశోధకులు ఓ స్టడీ నిర్వహించారు. పోషకాహారలోపం ఉన్న వాళ్లలో ఇన్సులిన్ స్రావాలు రావడం లేదని తేల్చారు. దానిని ఆదిలోనే తెలుసుకోవడం కూడా కష్టమేనని నిర్దారించారు. దాని భారిన పడ్డాకే అది టైప్ 5 డయాబెటిస్ గా తేల్చడం సాధ్యమవుతుందని గుర్తించారు. ఈ స్టడీ ఆధారంగా ప్రపంచంలోని వివిధ దేశాల్లోనూ అధ్యయనాలు చేసిన ఐడీఎప్ తాజాగా దానిని అధికారికంగా ప్రకటించింది. తొలుత టైప్ 5 డయాబెటిస్ ను టైప్1 డయాబెటిస్ గా చాలా మంది భావించారని సైంటిస్టులు చెబుతున్నారు. టైప్ 1 డయాబెటిస్ లో ఎక్కువ మొత్తంలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఉన్నా కీటోన్ యూరియా, కీటోసిస్ డెవలప్ కాదని, అదే టైప్5లో ఇవి ఉత్పత్తి అవుతున్నాయని గుర్తించారు.