Vitamin D overconsumption : విటమిన్ ‘డి’ కారణంగా 89ఏళ్ల వృద్ధుడు మృతి.. అధిక వినియోగంతో కలిగే దుష్ప్రభావాలివే!

Vitamin D overconsumption : 89 ఏళ్ల వృద్ధుడు విటమిన్ డి అధికంగా తీసుకోవడం వల్ల ప్రాణాలు కోల్పోయాడు. విటమిన్ డి టాక్సిన్స్ శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Vitamin D overconsumption : విటమిన్ ‘డి’ కారణంగా 89ఏళ్ల వృద్ధుడు మృతి.. అధిక వినియోగంతో కలిగే దుష్ప్రభావాలివే!

Man dies from too much vitamin D: Here's how overconsumption can affect the body

Vitamin D overconsumption : యూకేకు చెందిన 89ఏళ్ల వ్యక్తి శరీరంలో అధిక మొత్తంలో విటమిన్ డి కారణంగా మరణించాడు. హైపర్‌కాల్సెమియా అనే డేవిడ్ మిచెనర్ మరణానికి కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. విటమిన్ డి అధిక స్థాయిలతో ఏర్పడే కాల్షియం పెరుగుదలే ఇందుకు కారణమని అంటున్నారు. మరణానికి విటమిన్ డి అసురక్షిత స్థాయిల ప్రమాదాల గురించి నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. కరోనర్ నివేదిక ప్రకారం.. డేవిడ్ మిచెనర్ తన మరణానికి ముందు 9 నెలల పాటు విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకుంటున్నాడు. సప్లిమెంట్లు అధికంగా తీసుకున్నప్పుడు ఎలాంటి సంకేతాలు లేదా నిర్దిష్ట దుష్ప్రభావాలు కనిపించలేదని తేలింది.

Read Also : Gut Health Tips : చలికాలంలో మలబద్ధకాన్ని నివారించే అద్భుతమైన 8 ఆహారాలివే.. తప్పక తెలుసుకోండి !

విటమిన్ డి ఏయే ఆహారాల్లో లభిస్తుంది? :
విటమిన్ డిని కాల్సిఫెరోల్ అని కూడా పిలుస్తారు. కొవ్వులో కరిగే విటమిన్ ఇది. సహజంగా కొన్ని ఆహారాలలో మాత్రమే లభిస్తుంది. ఒక సప్లిమెంట్‌గా మాత్రమే లభిస్తుంది. కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫేట్ శోషణతో సహా శరీరంలోని వివిధ జీవసంబంధమైన విధులను నిర్వహణకు ముఖ్యమైనది. ఎముకలు, దంతాల ఆరోగ్యానికి, రోగనిరోధక వ్యవస్థకు, మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం. విటమిన్ డి ప్రధాన మూలం సూర్యుని యూవీ కిరణాలు.

అయితే, ఈ సూర్య కిరణాలు చర్మాన్ని తాకినప్పుడు విటమిన్ డి తయారవుతుంది. పుట్టగొడుగులు, పాలు, కొవ్వు చేపల వంటి కొన్ని ఆహారాలతో పాటు పరిమిత విటమిన్ డి కంటెంట్ ఉన్న కొన్ని పండ్లు అరటి, నారింజలో కూడా లభ్యవుతుంది. శరీరంలో విటమిన్ డి అధికంగా ఉండటం చాలా అరుదు. అందరిలోనూ డి విటమిన్ లోపం చాలా సాధారణం. ఎక్కువ సప్లిమెంట్లను తీసుకుంటే.. విటమిన్ డి టాక్సిసిటీకి దారితీస్తుంది. ఎక్కువ సప్లిమెంట్ డోసేజ్‌ల కారణంగా ఇది సంభవిస్తుంది.

అధిక విటమిన్ డి వినియోగంతో కలిగే దుష్ప్రభావాలివే :
విటమిన్ డి కాల్షియం శోషణలో కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో కాల్షియం అధిక స్థాయికి (హైపర్‌కాల్సెమియా) దారి తీస్తుంది. తద్వారా వికారం, వాంతులు, మలబద్ధకం, బలహీనత, తరచుగా మూత్రవిసర్జన వంటి లక్షణాలను కలిగిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు లేదా మూత్రపిండాలు దెబ్బతినడానికి దారితీయవచ్చునని డాక్టర్ వికాస్ గుప్తా చెప్పారు. ఎక్కువ కాలం కాల్షియం గుండె, ఊపిరితిత్తులు, రక్తనాళాలు, మూత్రపిండాలు వంటి మృదు కణజాలాలలో కాల్షియం నిక్షేపణకు దారితీస్తుంది. హృదయ సంబంధ వ్యాధులు, పల్మనరీ ఫైబ్రోసిస్, కిడ్నీల ఫెయ్యూలర్ వంటి ప్రాణపాయ పరిస్థితులకు దారితీస్తుంది.

విటమిన్ డి విషపూరితం జీర్ణవ్యవస్థను కూడా చికాకుపెడుతుంది. కడుపు నొప్పి, ఉబ్బరం, విరేచనాలు ఆకలి లేకపోవడం వంటి లక్షణాలకు దారితీస్తుందని డాక్టర్ గుప్తా తెలిపారు. కండరాల బలహీనత, నొప్పి అనేవి విటమిన్ డి విషపూరితం ఇతర సాధారణ లక్షణాలుగా చెప్పవచ్చు. శరీరంలో కాల్షియం, ఫాస్పరస్ మధ్య సమతుల్యతను దెబ్బతీస్తుంది. మీరు విటమిన్ డి టాక్సిసిటీని అనుమానించినట్లయితే.. వెంటనే వైద్యనిపుణులను సంప్రదించడం మంచిదని డాక్టర్ గుప్తా సూచించారు.

Read Also : Kiwis Health Benefits : కివీస్ పండ్లను తీసుకోవడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలివే!