International Nurses Day: అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో

నర్సులకు మేము వందనాలనర్పిస్తున్నాము. రోగి కోలుకోవడంలో వీరి తోడ్పాటు, అవిశ్రాంత ప్రయత్నాలు అనన్య సామాన్యం. రోగుల శారీరక, మానసిక సౌకర్యం మొదలు, అవసరమైన వైద్య చికిత్సల అమలు, రోగులు, వారి బంధువులకు తగిన సమాచారం అందించడంలో వారి పాత్ర మరువలేము

International Nurses Day: అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేళ స్ఫూర్తిదాయక వీడియో

Updated On : May 12, 2023 / 9:04 PM IST

Milaap: అంతర్జాతీయ నర్సుల దినోత్సవం 2023 ను పురస్కరించుకుని క్రౌడ్‌ ఫండింగ్‌ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన మిలాప్‌ స్ఫూర్తిదాయక వీడియోను విడుదల చేసింది. ఆరోగ్యసంరక్షణ రంగానికి వెన్నుముకగా నర్సులు అందిస్తోన్న అసాధారణ తోడ్పాటును గుర్తిస్తూ ఈ సంవత్సర నేపథ్యం ‘మన నర్సులు, మన భవిష్యత్‌’ ఆధారంగా తీర్చిదిద్దుతారని ఆ వీడియోలో పేర్కొంది.

Linda Yaccarino : 17 ఏళ్లలో ట్విట్టర్‌కు ఐదుగురు సీఈఓలు.. 6వ సీఈఓగా రానున్న లిండా యక్కరినో..!

ఈ వీడియో ప్రచారాన్ని అవిశ్రాంతంగా, జాగ్రత్తగా, నిస్వార్థంగా సేవలనందిస్తున్న నర్సులకు తగిన గుర్తింపును తీసుకువచ్చే రీతిలో తీర్చిదిద్దిటనట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. రోగి చికిత్స ప్రక్రియలో అత్యంత కీలకమైన పాత్రను నర్సులు పోషిస్తుంటారు. డాక్టర్లు సైతం ఈ నర్సుల నైపుణ్యం, అనుభవం, అంకితభావాన్ని ప్రశంసిస్తే, జూనియర్‌ డాక్టర్లు వీరి దగ్గర విలువైన పాఠాలనూ నేర్చుకుంటుంటారు.

Group 4 Results 2023 : గ్రూప్-4 ఫలితాలు విడుదల, ఇక్కడ చెక్ చేసుకోండి..

మిలాప్‌ అధ్యక్షుడు అనోజ్‌ విశ్వనాథన్‌ ఈ వీడియో ప్రచారం గురించి మాట్లాడుతూ ‘‘ నర్సులకు మేము వందనాలనర్పిస్తున్నాము. రోగి కోలుకోవడంలో వీరి తోడ్పాటు, అవిశ్రాంత ప్రయత్నాలు అనన్య సామాన్యం. రోగుల శారీరక, మానసిక సౌకర్యం మొదలు, అవసరమైన వైద్య చికిత్సల అమలు, రోగులు, వారి బంధువులకు తగిన సమాచారం అందించడంలో వారి పాత్ర మరువలేము. ఈ ప్రచారం ద్వారా వారి ప్రయత్నాలను వేడుక చేస్తున్నాము’’ అని అన్నారు.