బ్రెయిన్ స్ట్రోక్‌కు నెల ముందు ఈ లక్షణాలు గమనించారా..

బ్రెయిన్ స్ట్రోక్‌కు నెల ముందు ఈ లక్షణాలు గమనించారా..

Untitled design

Updated On : February 28, 2021 / 12:51 PM IST

brain stroke symptoms: మెదడులోని కొన్ని భాగాలకు రక్త సరఫరా ఆగిపోవడంతో స్ట్రోక్ వచ్చే ప్రమాదముంది. ఆక్సిజన్ కణాల్లోకి సరఫరా అవడం ఆగిపోతే ఇలా జరగొచ్చు. అదొక భయంకరమైన పరిస్థితి. కానీ, అప్పుడు ఆరోగ్యం గురించి కాస్త కేర్ తీసుకోవాలి. కొన్నిసార్లు ముందే పసిగడితే ప్రమాదం నుంచి తప్పుకోవచ్చు.

ప్రమాదం జరగడానికి గంటలు, రోజులు ముందే మనకు లక్షణాలు కనిపిస్తుంటాయి. వాటిపై అవగాహన ఉంటే సమస్యను ముందుగానే పసగట్టొచ్చు.

1. ముఖం, చేతులు, కాళ్లు మొద్దుబారడం
సాధారణమైన లక్షణమే అయినా.. బ్రెయిన్ స్ట్రోక్ ముందు ఇలా జరుగుతుంది. ముఖం, కాళ్లు, చేతులు ఓ వైపు మాత్రమే మొద్దుబారినట్లు కనిపిస్తుంది.

2. కంటి చూపులో సమస్యలు
కంటిచూపులో కచ్చితంగా తేడా కనిపిస్తుంది. స్పష్టంగా కనిపించే కళ్లు మసకబారుతాయి. యూకేలో 1300మందిపై జరిపిన సర్వేలో మసకబారినట్లు చెప్పారు.

3. తలనొప్పి
బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన చాలామంది ఆడవాళ్లలో కనిపించిన లక్షణం తలనొప్పి. ఎక్కువమందికి తలవెనుక భాగంగలోనే అలా అనిపిస్తుందట. ఒక్కోసారి స్పృహ కూడా కోల్పోయి పడిపోతుంటారట.

4. శ్వాసలో సమస్య
ఛాతీ నొప్పితో పాటు శ్వాసలోనూ సమస్యలు వస్తుంటాయి. అది స్ట్రోక్ వచ్చే ముందు లక్షణం కావొచ్చు.

5. ఎక్కిళ్లు
ఓహియో స్టేట్ యూనివర్సిటీ వెక్సనర్ మెడికల్ సెంటర్ జరిపిన సర్వే ప్రకారం.. పది శాతం మంది మహిళలకు ఎక్కిళ్లు వచ్చాయట. అలా అని ఎక్కిళ్లు వచ్చిన ప్రతిసారి ఎమర్జెన్సీ రూంకు వెళ్లాలని కాదు.

6. అకస్మాత్తుగా ప్రవర్తనలో మార్పులు
మహిళల్లో స్ట్రోక్ వచ్చే ముందు వారి ప్రవర్తనలో మార్పలు గమనించొచ్చని నిపుణులు అంటున్నారు. ఉన్నట్లుండి కొన్ని విషయాలు మర్చిపోవడం, వ్యక్తిత్వంలో ంమార్పులు తెలుస్తుంటాయి.

7. వికారం లేదా వాంతులు
మెదడులోని కొన్ని భాగాల్లో వచ్చిన సమస్యల కారణంగా వాంతులు.. వికారంగా ఉండటం వంటివి కనిపిస్తాయి.

8. హెల్యూసినేషన్
చూపులో సమస్యలతో పాటు భ్రమ పడుతున్నట్లుగా కూడా ఉంటుంది. అప్పటికే పోస్టిరియర్ భాగంలో సర్కూలేషన్ సమస్య వచ్చినట్లు అర్థం చేసుకోవచ్చు.

9. అధిక రక్తపోటు
అధిక రక్తపోటు చాలా సమస్యలకు దారితీస్తుంది. దాని వల్ల కూడా రక్తం గడ్డకట్టడం వంటివి జరగొచ్చు.

10. పలు గర్భస్రావాలు
దురదృష్టవశాత్తు గర్భస్రావాలు జరుగుతుంటాయి. అది స్ట్రోక్ రిస్క్ ను పెరిగేలా చేస్తుందని అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్ చెప్తుంది.

11. హార్మోన్ స్థాయి పడిపోవడం
అడ్రినల్ గ్రంథుల్లో ఉత్పత్తి అయ్యే డీహెచ్ఈఏ హార్మోన్ వెంటనే తగ్గిపోతుంది. దాని కారణంగా ఈస్ట్రోజన్లు, ఆండ్రోజన్స్ తగ్గిపోతుంటాయి.