పేటీఎం ఉద్యోగికి కరోనా

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తోంది. భారత్‌లోకి కూడా కరోనా అడుగుపెట్టింది. విదేశాలకు వెళ్లొచ్చిన ఇద్దరికి కరోనా సోకినట్టు ధ్రువీకరించారు. వారి నుంచి మరి ఎంతమందికి వైరస్ సోకిందో కచ్చితమైన ఆధారాలు లేవు.
ఈ క్రమంలో హర్యాణాలోని గుర్గావ్‌లో పేటీఎం ఉద్యోగికి కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కనిపించినట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా ప్రభావంతో మరికొన్ని రోజులు పాటు ఇంటి నుంచే పనిచేయాల్సిందిగా ఉద్యోగులకు కంపెనీ సూచిస్తోంది.
కరోనా ప్రభావిత దేశాల్లో ఒకటైన ఇటలీకి వెళ్లి పేటీఎం ఉద్యోగి తిరిగొచ్చిన తర్వాత కరోనా లక్షణాలు కనిపించినట్టు తెలిపింది. గుర్గావ్ పేటీఎం యూనిట్ క్లీన్ చేసేంత వరకు కొన్నిరోజుల పాటు ఉద్యోగుల నుంచే పనిచేయాలని సూచించినట్టు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. రోజువారీ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని తెలిపింది.
‘ఇటీవల పేటీఎం ఉద్యోగుల్లో ఒకరు ఆఫీసు పనిమీద ఇటలీ వెళ్లి వచ్చారు. వారికి పరీక్షలు నిర్వహించగా కరోనా లక్షణాలు ఉన్నట్టు నిర్ధారించారు. ముందు జాగ్రత్త చర్యగా ఇతర పేటీఎం ఉద్యోగులను కూడా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించాం’ అని పేటీఎం ప్రతినిధి ఒకరు తెలిపారు.
See More :
* కరోనా : వైరస్ సోకడానికి ఒక్క తుమ్ము చాలు