Piles Problem: పైల్స్ సమస్య ఉన్నవారు వీటిని అస్సలు తినకూడదు? చాలా డేంజర్.. ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి

Piles Problem: పైల్స్ సమస్యతో బాధపడుతున్నవారు ఫైబర్ లేని ఆహరం అస్సలు తినకూడదు. ఉదాహరణకు వైట్ బ్రెడ్, పిజ్జా, పాస్తా, పరబడి అన్నం. కారణం ఏంటంటే..

Piles Problem: పైల్స్ సమస్య ఉన్నవారు వీటిని అస్సలు తినకూడదు? చాలా డేంజర్.. ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి

People with piles problems should not eat this food at all.

Updated On : July 20, 2025 / 10:06 AM IST

పైల్స్ లేదా హీమరాయిడ్స్.. ప్రెజెంట్ జనరేషన్ లో చాలామందిని బాధిస్తున్న సమస్య. ఈ సమస్య ఉన్నవారి భాధ వర్ణనాతీతం. ఇది మలద్వార చుట్టూ ఉండే రక్తనాళాల వాపు వల్ల ఏర్పడుతుంది. దీని వల్ల మలవిసర్జన సమయంలో మంట, రక్తస్రావం, వాపు, కూర్చునే సమయంలో తీవ్రమైన అసౌకర్యం కలుగుతుంది. ఈ సమస్యను అదుపులో ఉంచుకోవాలంటే సరైన ఆహారం చాలా అవసరం. మనం పొరపాటున తినే కొన్ని పదార్థాలు పైల్స్‌ను తీవ్రమయ్యేలా చేసి, రోజువారీ జీవనాన్ని కష్టతరం చేస్తాయి. అందుకే కొన్ని ఆహార పదార్థాలు పూర్తిగా మానేయడం మంచిది. మరి అలాంటి ఆహరం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఆహారాలు తినకూడదు చాలా డేంజర్:

1.ఫైబర్ లేని ఆహారం:
పైల్స్ సమస్యతో బాధపడుతున్నవారు ఫైబర్ లేని ఆహరం అస్సలు తినకూడదు. ఉదాహరణకు వైట్ బ్రెడ్, పిజ్జా, పాస్తా, పరబడి అన్నం. కారణం ఏంటంటే.. ఈ పదార్థాలు మలాన్ని గట్టిగా చేస్తాయి. దీనివల్ల మల విసర్జన సమయంలో గట్టిగా ఒత్తిడి అవసరం అవుతుంది. లా చేయడం పైల్స్‌ సమస్యను తీవ్రతరం చేస్తుంది.

2.మసాలా, కారంగా ఉండే పదార్థాలు:
అధిక మసాలా ఉండే ఆహారాన్ని పూర్తిగా మానేయడం మంచిది. మిరపకాయ పకోడి, గరం మసాలా, కర్రీలు, పులుసులు, పికిల్స్ తినడం తగ్గించాలి. ఇవి మలద్వారం వద్ద మంటను పెంచుతాయి. తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఫలితంగా రక్తస్రావం ఎక్కువవుతుంది, నిద్రపై ప్రభావం పడుతుంది.

3.వేపుడు పదార్థాలు, జంక్ ఫుడ్:
పైల్స్ సమస్య ఉన్నవారు బజ్జీలు, చిప్స్, బర్గర్లు, సమోసాలు వంటి వేపుడు, జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. వీటిలో నూనె అధికంగా ఉండటం వల్ల జీర్ణశక్తి తగ్గుతుంది. ఇది మలాన్ని గట్టిగా చేసి మలవిసర్జనను కష్టతరం చేస్తుంది.

4.అధిక క్యాఫిన్, ఆల్కహాల్:
కాఫీ, టీ, బీరు, వైన్, స్పిరిట్స్ లాంటి పానీయాలకు దూరంగా ఉండాలి. ఇవి డీహైడ్రేషన్ పెంచి శరీరంలో నీరస కలిగిస్తాయి. శరీరంలో నీటి శాతం తగ్గితే మలం గుట్టుగా అవుతుంది. ఇది మలవిసర్జన సమయంలో నరాలపై ఒత్తిడి పెరుగుతుంది.

5.చక్కెర పదార్థాలు & ప్రాసెస్ ఫుడ్:
ఐస్ క్రీములు, కూల్ డ్రింక్స్, బిస్కెట్లు, మిఠాయిలు లాంటి ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఎందుకంటే వీటిలో ఫైబర్ ఉండదు అలాగే పేగు ఆరోగ్యానికి హానికరం. రక్తప్రసరణలో ప్రభావం చూపి మలద్వార నరాల్లో వాపును పెంచుతాయి.

ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి:

  • రోజూ కనీసం 8 నుంచి 0 గ్లాసుల నీరు త్రాగాలి
  • ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి(ఓట్స్, గోధుమ రొట్టెలు, ఆకుకూరలు)
  • వాకింగ్, తేలికపాటి వ్యాయామం చేయాలి
  • అల్కహాల్, డీప్ ఫ్రైడ్ పూర్తిగా మానేయాలి
  • క్రమం తప్పకుండా మలవిసర్జన చేయాలి
  • వాష్‌రూమ్‌లో ఎక్కువసేపు కూర్చోకూడదు.