Walking Tips: ఎక్కువగా నడుస్తున్నారా.. ఈ లక్షణాలను గుర్తుపెట్టుకోండి.. నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అధికంగా నడవడం వల్ల త్వరగా నీరసించడం, అలసట సమస్యలు కనిపిస్తాయి. కొన్నిసార్లు అది గుండె సమస్యకు దారితీయవచ్చు.

Walking Tips: ఎక్కువగా నడుస్తున్నారా.. ఈ లక్షణాలను గుర్తుపెట్టుకోండి.. నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Walking problems

Updated On : June 12, 2025 / 12:00 PM IST

సాధారణంగా మనిషి ఆరోగ్యానికి నడక మంచిది అంటారు. రోజులో కనీసం ఒక 30 నిమిషాలైనా నడకకు కేటాయిస్తే ఎన్నో రకాల రోగాల బారిన పడకుండా ఉండొచ్చని నిపుణులు చెప్పడం మనం వింటూనే ఉంటాం. గుండె జబ్బులు, షుగర్ లాంటి ప్రమాదకమైన వ్యాధులు రాకుండా నడక సహాయపడుతుంది. కాబట్టి.. ఈమధ్య కాలంలో చాలా మంది ఉదయాన్నే నడవడం అలవాటు చేసుకుంటున్నారు. కొంతమంది మాత్రం గంటల తరబడి నడుస్తూనే ఉటారు. కానీ, అలా నడవడం అస్సలు మంచిది కాదట. వయసు రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. మరి ఎక్కువగా నడవడం వల్ల వచ్చే సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అధికంగా నడవడం వల్ల త్వరగా నీరసించడం, అలసట సమస్యలు కనిపిస్తాయి. కొన్నిసార్లు అది గుండె సమస్యకు దారితీయవచ్చు. కీళ్లనొప్పులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. గతంలో ఏర్పడిన గాయాలు కూడా నడక వల్ల పునరావృతం కావచ్చు. కీళ్లపై ఒత్తిడి పెరిగి వాపులు వచ్చే అవకాశం ఉంది సాధారణ నడక మనిషికి ప్రశాంతతను కలిగిస్తుంది. కానీ, అధిక నడక ఆందోళన, నిరాశ, ఒత్తడిని పెంచే అవకాశం ఉంది. ఇలా చాలా రకాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి, సాధారణ నడకను అలవాటు చేసుకోవడం మంచిది.

చాలా కాలంగా నడుస్తున్న వారి విషయంలో ఒకే కానీ. కొత్తగా నడవడం మొదలుపెట్టిన వారు మాత్రం చాలా జాగ్రత్తలు వహించాలి. ఏకధాటిగా గంటల గంటలు నడవడం కన్నా, మెల్లిగా పెంచుకుంటూ పోవడం మంచిది. నడక వేగంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఒకేసాటి అధిక వేగంగా కాకుండా.. వారవారం పెంచుకుంటూ పోతే మంచి ఫలితాలు ఉంటాయి. ఎలాంటి ఆరోగ్యసమస్యలు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి, కొత్తగా నడక మొదలుపెట్టినవారు పైన తెలిపిన జాగ్రత్తలను పాటించడం మంచిదని నిపుణులు చెప్తున్నారు.