ఆయుష్మాన్ భవతి : కుంకుమపువ్వుతో అందమైన బిడ్డ?

గర్భవతి కాగానే ప్రత్యేకించి కుంకుమ పువ్వు తెప్పిస్తారు. ‘తాగమ్మా.. తెల్లగా, పువ్వులాంటి పాపాయి పుడుతుంది’ అంటూ ప్రతి రోజూ పాలలో కలిపి ఇచ్చి తాగమంటారు. గ్రహణం పడుతుందంటే కదలకుండా పడుకోమంటారు. ఇవన్నీ నిజమేనా? ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే ఆనందంతో పాటు ప్రతిదానికీ ఆందోళనగానే ఉంటుంది. అనేక అనుమానాలు.. నమ్మకాలు.. అపోహలు. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు వ్యాయామం చేయాలా వద్దా అన్నది కూడా అనుమానమే.
అయితే గర్భవతులుగా ఉన్నప్పుడు పోషకాహారం తీసుకోవడంతో పాటు వాకింగ్ వంటి చిన్నపాటి వ్యాయామం అవసరమే. ఇకపోతే, కుంకుమ పువ్వుకీ బిడ్డ తెల్లగా పుట్టడానికీ సంబంధం లేదు. గ్రహణానికీ, గ్రహణమొర్రికీ కూడా ఎలాంటి సంబంధం లేదంటున్నారు నిపుణులు.