కరోనాను గెలిచేందుకు యాంటీబాడీలను సృష్టించిన సైంటిస్టులు

  • Published By: Subhan ,Published On : May 5, 2020 / 11:00 AM IST
కరోనాను గెలిచేందుకు యాంటీబాడీలను సృష్టించిన సైంటిస్టులు

Updated On : May 5, 2020 / 11:00 AM IST

కరోనాను ఎదుర్కొనే క్రమంలో సైంటిస్టులు మరో ప్రయోగంలో సక్సెస్ అయ్యారు ల్యాబ్ లో మోనోక్లోనల్ యాంటిబాడీని సృష్టించారు. ప్రయోగాత్మాకంగా కనిపెట్టిన ఈ యాంటీబాడీ వైరస్ సెల్స్ ను న్యూట్రలైజ్ చేస్తుంది. డ్రగ్ డెవలప్‌మెంట్ ప్రోసెస్ లో ఒక అడుగు ముందుకేసినట్లే. మనుషులపై ప్రయోగించే కంటే ముందు జంతువులపై ప్రయోగించనున్నారు. 

ఈ యాంటీ బాడీలు వ్యాప్తిని అడ్డుకోవడమే కాక భవిష్యత్ లో COVID-19ట్రీట్ చేయడంలోనూ ఉపయోగపడతాయి. డ్రగ్ కాంబినేషన్ వాడినా లేదా సింగిల్ గా వాడి కరోనాను ఎదుర్కోవచ్చని స్టడీ చెబుతుంది. 

వీటిపై మరింత రీసెర్చ్ చేసి క్లినికల్ సెట్టింగ్స్ లో కన్ఫార్మ్ చేసుకోవాలి. యాంటీబాడీలు వైరస్ ను కచ్చితంగా ఎదుర్కొంటున్నాయా.. అనేది బెరెండ్ జాన్ బోస్చ్ ఆఫ్ యుట్రెచ్ యూనివర్సిటీ నిర్థారిస్తుంది. ఈ యాంటీబాడీకి 47D11 అనే పేరు పెట్టారు. ఇది న్యూ కరోనా వైరస్ ఉత్పత్తి చేసే స్పైక్ ప్రొటీన్ ను టార్గెట్ చేసుకుని  పనిచేస్తుంది. ఉట్రెచ్ ప్రయోగాల్లో కొవిడ్-19పై దాడి చేయడమే కాకుండా.. స్పైక్ ప్రొటీన్లు, శ్వాస సంబంధిత సమస్యలపై పోరాడతాయి. 

మోనోక్లోనల్ యాంటీబాడీలు వైరల్ గ్రంథులపై దాడి చేసి ప్రొటీన్లను కాపాడటమే కాకుండా ఇన్ఫెక్షన్ క్రియేట్ చేసే జబ్బులపైనా పనిచేస్తాయి. ఇవి ఇప్పటికే క్యాన్సర్ ను ట్రీట్ చేయడంలో సక్సెస్ అయ్యాయి. డ్రగ్స్ ఉత్పత్తి చేసే కంపెనీలు కరోనాకు మందు కనిపెట్టడాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావించి ప్రయోగాలు చేపడుతున్నాయి. 

Also Read | కోవిడ్-19 నియంత్రణలో మెరుగైన ఫలితాలు ఇస్తున్న డ్రగ్.. ఇండియాలో ట్రయల్స్