Eating Chalk is Bad for health : మట్టి, సుద్ద తినే అలవాటు ఎంత ప్రమాదమో తెలుసా?
కొందరిలో సుద్ద, మట్టి తినే అలవాటు ఉంటుంది. ఏదో చిన్న అలవాటుగా మొదలై అది వదిలిపెట్టలేనంత అడిక్షన్‌కి దారి తీస్తుంది. దీర్ఘకాలం పాటు వాటిని తినడం వల్ల కలిగే నష్టాలు తీవ్రంగా ఉంటాయి.

Eat sand,chalk bad for health
Eat sand,chalk bad for health : కొంతమందిలో మట్టి, చాక్ పీస్ తినే అలవాటు ఉంటుంది. చిన్నవారే కాదు.. పెద్దవారిలో సైతం ఈ అలవాటు కనిపిస్తుంది. ఈ అలవాటుకి అసలు కారణం ఏంటి? ఎలాంటి అనర్థాలకు దారితీస్తుంది?
Monsoon Season Health Tips : వర్షాకాలంలో అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు !
కొందరిలో మట్టి, సుద్ద, జుట్టు, బూడిద, రాళ్లు లాంటివి తినే అలవాటు ఉంటుంది. ఈ అలవాటుకి కారణం ఉంది. దీనిని ‘పికా’ అంటారు. ఈ రుగ్మతకు అనేక కారణాలు ఉంటాయి. ‘ఐరన్ లోపం’ లేదా ‘అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్’ లాంటి పోషకాహార లోపం వంటివి కారణాలు కావచ్చట. ఈ సమస్యతో బాధపడేవారిని ఆ అలవాట్లను వెంటనే మాన్పించాలి. లేదంటే తీవ్రమైన వ్యాధులకు దారి తీస్తుందట.
ఇసుక లేదా మట్టి తినడం వల్ల గ్యాస్ట్రిక్ నొప్పి లేదా రక్తస్రావం కావచ్చట. పెయింట్ తినడం వల్ల శరీరం విషపూరితం అవుతుందట. లోహపు వస్తువులు తినడం వల్ల ప్రేగు చిల్లు పడే ప్రమాదం ఉందట. గర్భిణీ స్త్రీలలో కూడా పికా అనే రుగ్మత కనిపిస్తుందట. వారు ఎక్కువగా సుద్ద వంటి వస్తువులను తినడానికి ఇష్టపడతారట. అయితే 10 నుంచి 32 శాతం 1 నుంచి ఆ సంవత్సరాల వయసు గల పిల్లలు, OCD లేదా స్కిజోఫ్రెనియా ఉన్న పెద్దవాళ్లు, పోషకాహార లోపం ఉన్న వ్యక్తులు, మానసికంగా లేదా శారీరకంగా వైకల్యం ఉన్న వ్యక్తులు ఈ పికా బారిన పడతారట.
Respiratory Infections : వర్షాకాలంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను అరికట్టడానికి 5 ఎఫెక్టివ్ హోం రెమెడీస్ !
పికా చికిత్సలో అనేక విధానాలున్నాయి. పోషకాహార లోపం వల్లనా? కాదా? అని నిర్ధారించడానికి డాక్టర్ రక్త పరీక్షలు నిర్వహించవచ్చును. చికిత్స చేయకుండా వదిలేస్తే పికా సంవత్సరాల పాటు కొనసాగుతుంది. లేదంటే కోలుకోలేని నష్టం కలిగింవచ్చు. కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారాన్ని చూడాలంటే తక్షణమే వైద్యులను సంప్రదించాలి.