Eye Health Tips: కళ్ల కింద నల్లటి చారలు సమస్య.. ఈ చిన్ని చిట్కాలతో చెక్ పెట్టేయొచ్చు.. ట్రై చేయండి

నిద్ర తక్కువగా పడితే చర్మం ఫేడ్ అయి, కళ్ల కింద నల్లగా మారే అవకాశం ఉంది.

Eye Health Tips: కళ్ల కింద నల్లటి చారలు సమస్య.. ఈ చిన్ని చిట్కాలతో చెక్ పెట్టేయొచ్చు.. ట్రై చేయండి

You can cure dark circles under the eyes with these tips

Updated On : July 18, 2025 / 12:54 PM IST

ఈ మధ్య కాలంలో చాలా మంది కళ్ల కింద నల్లటి చారలు (Dark circles under the eyes) సమస్యతో బాధపడుతున్నారు. మొహం ఎంత అందంగా ఉన్నప్పటికి కళ్ల కింద నల్లగా మారడంతో అందవికారంగా కనిపిస్తుంది. ఈ సమస్య నివారణ కోసం చాలా రకాల సబ్బులు, క్రీములు వాడుతుంటారు. కానీ, సమస్య మాత్రం నయం కాక బాధపడుతున్నారు. మరి అలాంటి చిన్న చిన్న చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టొయొచ్చు అని నిపుణులు చెప్తున్నారు. మరి ఆ చిట్కాలు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

కళ్ల కింద నల్లటి చారలు ఎందుకు వస్తాయి?

1.నిద్రలేమి (Lack of Sleep):
నిద్ర తక్కువగా పడితే చర్మం ఫేడ్ అయి, కళ్ల కింద నల్లగా మారే అవకాశం ఉంది.

2.జన్యుగత కారణాలు (Genetics):
కొంతమందిలో ఈ సమస్య వారసత్వంగా రావడానికి అవకాశం ఉంటుంది.

3.వయస్సు (Aging):
వయస్సు పెరగడం వల్ల కూడా చర్మం పల్చబడుతుంది. దానివల్ల కూడా కళ్ల కింద చర్మం నల్లబడుతుంది.

4.ఐ-స్ట్రెయిన్ (Eye strain – ఫోన్/కంప్యూటర్ ఎక్కువగా చూడటం):
ప్రెజెంట్ జనరేషన్ లో మొబైల్, కంప్యుటర్ వాడకుండా ఉండటం చాలా కష్టం. వీటిని అధికంగా వాడటం వల్ల కూడా కళ్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీనివల్ల కూడా నల్ల చారాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

5.నీరు తక్కువగా తీసుకోవడం(Dehydration):
చాలా మంది నీరు తగినంతగా తాగరు. వారిలో డీహైడ్రేషన్ సమస్య ఉంటుంది. అలంటి సమస్య ఉన్నవారిలో కూడా కళ్ళ కింద నల్ల మచ్చలు వచ్చే అవకాశం ఉంది. నీరు తక్కువగా తాగినప్పుడు చర్మం నీరసం చెంది డార్క్ కనిపిస్తుంది

6.ఆహార లోపాలు (Nutritional Deficiencies):
శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. విటమిన్ K, విటమిన్ B12, ఐరన్ లాంటి పోషకాలు తక్కువగా ఉన్నప్పుడు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.

నివారణకు సహజ చిట్కాలు:

1.టీ బ్యాగ్‌లు (Green / Black Tea Bags):
టీ, కాఫీ లలోఉండే క్యాఫిన్ చర్మాన్ని కుదిస్తుంది, నరాలను బిగింపజేస్తుంది. వాడిన టీ బ్యాగ్‌లను ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా చేసి వాటిని కళ్లపై 10 నిమిషాలు పెట్టుకోవడం వల్ల నల్ల వలయాలు తగ్గే అవకాశం ఉంది.

2.కాకరకాయ స్లైస్‌లు లేదా పుదీనా నీరు:
ఇవి చర్మాన్ని తేమగా ఉంచి, డార్క్‌నెస్ తగ్గిస్తాయి. రాత్రి నిద్రకు ముందు 10 నుంచి 5 నిమిషాలు వీటిని ఉపయోగించాలి

3.ఐస్ క్యూబ్ మసాజ్:
దీనివల్ల కళ్ల ప్రాంతంలో బ్లడ్ సర్క్యులేషన్ మెరుగవుతుంది. ఇలా రోజు రెండుసార్లు 2 నుంచి 3 నిమిషాలు మృదువుగా మర్దనా చేసుకోవాలి. దీని వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.

4.చల్లని స్పూన్ థెరపీ:
స్టీల్ స్పూన్‌ను ఫ్రిజ్‌లో ఉంచి చాలాగా అయ్యాకా కళ్లపై 1 నిమిషం అలా ఉంచాలి. ఇది కండాల వాపును తగ్గుతుంది, నల్లటి వలయాలు తగ్గించడంలో సహాయపడుతుంది

డైట్ & జీవనశైలి మార్పులు:

  • రోజుకు కనీసం 2.5 లీటర్ల నీరు తాగాలి
  • రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్ర చాలా అవసరం
  • ఐరన్, విటమిన్ B12, K తగిన మోతాదులో తీసుకోవాలి
  • ఫోన్ / కంప్యూటర్ వాడకం చాలా వరకు తగ్గించాలి
  • బయటకు వెళ్లేటప్పుడు సన్‌గ్లాసెస్, సన్ స్క్రీన్ వాడాలి