ఈ ఒక్క విటమిన్ చాలు.. కరోనావైరస్ నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది!

  • Published By: sreehari ,Published On : August 29, 2020 / 02:27 PM IST
ఈ ఒక్క విటమిన్ చాలు.. కరోనావైరస్ నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది!

Updated On : August 29, 2020 / 3:13 PM IST

One Vitamin Could Relieve COVID : కరోనా మహమ్మారి వంటి వైరస్‌ల బారినుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే.. పౌష్టికాహారం తప్పనిసరిగా ఉండాలి.. అందులోనూ విటమిన్లు పుష్కలంగా ఉన్న పదార్థాలను ఆహారంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.. కరోనా సమయంలో విటమిన్ ఫుడ్ తీసుకోవడం ద్వారా వైరస్ వ్యాప్తిని నివారించవచ్చునని ఇప్పటికే పరిశోధనల్లో వెల్లడైంది..

విటమిన్లు ‘సి‘, విటమిన్ ‘డి’ తీసుకోవడం ద్వారా కరోనావైరస్ లక్షణాలను తగ్గించగలవని లేదా వ్యాప్తిని నివారించవచ్చని పరిశోధకులు నిర్ధారించారు. ఇప్పుడో కొత్త అధ్యయనం ప్రకారం.. మరొక విటమిన్ కూడా కరోనా నుంచి రక్షించగలదని సూచిస్తుంది.. ఇంతకీ ఆ విటమిన్ ఏంటో తెలుసా? అందరికి తెలసిన విటమిన్‘B’.



ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యూనివర్శిటీ, మెల్ బోర్న్ యూనివర్శిటీ సైంటిస్టులు.. విటమిన్ ‘B’ COVID -19 బాధితులకు సాయపడుతుందని తేల్చేశారు.. ఇప్పటివరకూ కరోనా రోగులపై ఈ విటమిన్‌ను పరీక్షించలేదు. కానీ, కరోనాను నివారించగల సామర్థ్యం ఉందని సూచించారు.

విటమిన్ B కణాల పనితీరు, శక్తి జీవక్రియ, సరైన రోగనిరోధక పనితీరులో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. విటమిన్ ‘బి’ పాజటివ్ రోగనిరోధత సరైన స్థాయిలో ఉండేలా సాయపడుతుంది. నిరోధక సైటోకిన్ స్థాయిలను తగ్గిస్తుంది, శ్వాసకోశ పనితీరును మెరుగుపరుస్తుంది, ఎండో థెలియల్ సమగ్రతను నిర్వహిస్తుంది, హైపర్‌కోగ్యుబిలిటీని నివారిస్తుంది.



కరోనావైరస్ సోకిన వారిలో శ్వాసను బలహీనపరుస్తుంది గుండె, మెదడును ప్రభావితం చేస్తుంది.. ‘సైటోకిన్ సైక్లోన్’ అని పిలిచే వైరస్‌కు రోగనిరోధక వ్యవస్థ అధికంగా ఉండటం కారణంగానే ఈ పేరు వచ్చిందని సైంటిస్టులు అభిప్రాయపడ్డారు.

విటమిన్ బి తీసుకున్నవారిలో ఆరోగ్యకరమైన రోగనిరోధక శక్తిని పెంచుతుందని తెలిపారు. COVID-19 లక్షణాలను నివారించగలదు. SARS-CoV-2 వ్యాప్తికి చికిత్స చేయగలదని పరిశోధకులు రాశారు. రోగనిరోధక శక్తి కోసం బలవర్థకమైన ఆహారం అవసరమని తేల్చారు.



విటమిన్ B మూలాలు :
బి 1 (థియామిన్), B6, B12, ఫోలిక్ యాసిడ్‌తో సహా 8 ‘B’ విటమిన్లు ఉన్నాయి. విటమిన్ B12 లేదా B6లో లోపం రక్తహీనతకు కారణమవుతుంది గర్భిణీ స్త్రీలు మెదడు, వెన్నెముక పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి గర్భధారణ సమయంలో ఫోలిక్ యాసిడ్ తీసుకోవాల్సి ఉంటుంది.



నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. చేపలు, పౌల్ట్రీ, మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తుల వంటి ప్రోటీన్ల నుండి B విటమిన్లు పొందవచ్చు. ఆకుకూరలు, బీన్స్, బఠానీలు, B విటమిన్లతో కూడిన తృణధాన్యాలు, రొట్టెలను ఎక్కువగా తీసుకోవాలి.