Type 2 diabetes : ఆయుర్ధాయం తగ్గించేస్తున్న మధుమేహం : అధ్యయనంలో ఆందోళనకర విషయాలు

మధుమేహం మనుషుల ఆయుర్ధాయాన్ని తగ్గించేస్తోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మేలుకోకుంటే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.

Type 2 diabetes : ఆయుర్ధాయం తగ్గించేస్తున్న మధుమేహం : అధ్యయనంలో ఆందోళనకర విషయాలు

Type 2 diabetes

Type 2 diabetes diagnosis life expectancy up to 14 years: మధుమేహం. ఇది ప్రాణం తీసేది కాకపోయినా శారీకంగా కృంగదీసేస్తుంది. ఇతర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మధుమేహం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ వస్తే దాన్ని నిరంతరం నియంత్రణలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.ఆహారంలో మార్పులు తప్పనిసరి చేసుకోవాలి. మధుమేహం నియంత్రణలో లేకుంటే అవయవాల పనితీరు దెబ్బతింటుంది. అంతేకాదు ఆయుర్ధాయం కూడా తగ్గిపోతుందని పరిశోధనల్లో తేలింది.

ఇటీవల కాలంలో వయస్సుతో సంధం లేకుండా మధుమేహం వస్తోంది. చిన్నపిల్లలు కూడా మధుమేహం బారిన పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా యువకుల్లో మధుమేహ బాధితులు పెరుగుతున్నారు. దీంతో వారి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇది చిన్న విషయం కాదు. దీని తీవ్రత ఎంతగా ఉంటుందంటే..30 ఏళ్లలోపు టైప్-2 మధుమేహం బారిన పడితే జీవించే కాలం తగ్గిపోతోందని అంతర్జాతీయ పరిశోధకుల బృంధం పరిశోధనల్లో తేలింది. 30 ఏళ్లలోపు ఈ వ్యాధి బారిన పడిన వారి జీవించే కాలం సగటున 14 ఏళ్లు తగ్గుతోందని ఈ పరిశోధన వెల్లడించింది.

3D treatment : మెదడు గాయాలకు ‘త్రీడీ’ ట్రీట్మెంట్ .. కొత్త విధానాన్ని కనుగొన్న పరిశోధకులు

30 ఏళ్లలో టైప్ 2 డయాబెటిస్ నిర్ధారణ ఆయుర్దాయం 14 సంవత్సరాల వరకు తగ్గిస్తుందని వెల్లడించింది. 30 ఏళ్లలోపువారికే కాదు 50 ఏళ్ల వయసులో ఈ వ్యాధి నిర్ధారణ అయినా వారికి కూడా వారి ఆయుర్ధాయంపై ప్రభావం చూపిస్తుంది. బాధితుల జీవించే కాలం సగటున ఆరేళ్లు తగ్గుతోందని పరిశోధకులు చెబుతున్నారు. అదే 40 ఏళ్ల వయసులో ఈ వ్యాధి బారిన పడితే వారి 10 ఏళ్లు జీవితం కాలం తగ్గుతోంది. అదే మహిళల్లో అయితే 30 ఏళ్లలోపు బయటపడితే 16 ఏళ్లు, 40 ఏళ్లకు బయటపడితే 11 ఏళ్లు, 50 ఏళ్లకు నిర్ధారణ అయితే 7 ఏళ్ల చొప్పున జీవితం కాలం క్షీణిస్తోందని పరిశోధకులు వెల్లడించారు.

యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో పరిశోధకులు ప్రపంచవ్యాప్తంగా 19 అధిక ఆదాయం కలిగిన దేశాల్లోని ప్రజలపై అధ్యయం చేశారు. ఈ వివరాలు లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రైనాలజీ పత్రికలో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి. మధుమేహాన్ని నివారించే లేదా ఆలస్యం చేసే విధంగా తగిన ప్రణాళికల అవసరం ఉందని ఈ అధ్యయనం గుర్తు చేసింది.

ఊబకాయం. సరైన ఆహారం తీసుకోకపోవటం, అంటే సమతుల ఆహారం తీసుకోవటం, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం, సమయాలతో సంబంధం లేకుండా ఆహారం తీసుకోవటం, శరీరక వ్యాయామం లేకపోవటం వంటి జీవనశైలి వల్ల మధుమేహ బాధితులు పెరుగుతున్నారు. టైప్2 మధుమేహం కేసులు పెరటానికి ఈ కారణాలు అని ఈ అధ్యయనం తెలిపింది.

Street Food : నోరూరించే స్ట్రీట్ ఫుడ్ తో కాలేయానికి ముప్పు !

ప్రపంచవ్యాప్తంగా 2021నాటికి 53.7 కోట్ల మంది వయోజనులు మధుమేహంతో బాధపడుతున్నట్టు అంచనా. ముఖ్యంగా యువతరంలో ఈ కేసుల సంఖ్య పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. టైప్2 మధుమేహం కారణంగా సగటున ఆరేళ్లు ఆయుష్షు తగ్గుతుందని గతంలో జరిగిన పలు అధ్యయనాలు వెల్లడించాయి. వాటితో పోలిస్తే ఈ అధ్యయనం మరింత ఆయుర్ధాయం తగ్గుతుందని చెబుతుండడాన్ని హెచ్చరికగానే భావించాల్సిన అవసరం ఉంది.

టైప్2 మధుమేహం అనేది హార్ట్ ఎటాక్, స్ట్రోక్, కిడ్నీ సమస్యలు, కేన్సర్ కు దారి తీసే అవకాశాలున్నాయి. మధుమేహం రిస్క్ ఉన్న వారిని ముందుగా గుర్తించి, తగిన చర్యలు తీసుకుంటే దీన్ని నివారించొచ్చని అధ్యయనం సూచిస్తోంది.