3D treatment : మెదడు గాయాలకు ‘త్రీడీ’ ట్రీట్మెంట్ .. కొత్త విధానాన్ని కనుగొన్న పరిశోధకులు

వైద్యారంగంలో వచ్చిన పెను మార్పులు. ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నాయి. టెక్నాలజీ తీసుకొచ్చిన అద్భుతాలు ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాయి..అటువంటి మరో అద్భుతాన్ని కనుగొన్నారు పరిశోధకులు.

3D treatment : మెదడు గాయాలకు ‘త్రీడీ’ ట్రీట్మెంట్ .. కొత్త విధానాన్ని కనుగొన్న పరిశోధకులు

'3D' treatment for brain injuries

3D treatment for brain : రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీతో ఎన్నో వ్యాధులు నయమవుతున్నాయి. అసాధ్యమనుకునే సర్జరీలను కూడా డాక్టర్లు సునాయాసంగా చేసి ప్రాణాల్ని కాపాడుతున్నారు. ఒకప్పుడు సర్జరీ అంటే భయంగా..అదేదో పెద్ద విషయంగా ఉండేది. కానీ ఇప్పుడు కుట్లే లేని సర్జరీలు వచ్చేశాయి. దీంతో ఇలా సర్జీరీ చేయించేసుకుని అలా పనులు చేసేసుకోగలుతున్నారు. దీనికంతటికీ వైద్యారంగంలో వచ్చిన మార్పులు. టెక్నాలజీ తీసుకొచ్చిన అద్భుతాలనే చెప్పాలి.అటువంటి మరో అద్భుతాన్ని కనుగొన్నారు బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ పరిశోధకులు.

మెదడులో గాయమైతే ‘త్రీడీ’ ట్రీట్ మెంట్ చేసే అద్భుతాన్ని అభివృద్ది చేశారు బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ పరిశోధకులు. మెదడులో గాయాలతో బాధపడేవారికి కేవలం ఒక్కరోజులోనే ఉపశమనం కలిగించే అద్భుతాన్ని కనుగొన్నారు. సెరిబ్రల్ కార్టెక్స్ యొక్క నిర్మాణాన్ని అనుకరించడానికి నాడీ కణాలను 3D-ప్రింట్ చేయవచ్చని పరిశోధకులు మొదటిసారిగా నిరూపించారు.

Heart Diseases : గుండె సంబంధిత వ్యాధులకు కారకాలు, నివారణ మార్గాలు !

పక్షవాతం(పెరాలసిస్), ట్రామా, క్యాన్సర్‌ వంటి శస్త్రచికిత్సల వల్ల మెదడులో అయ్యే గాయాలు మానవుల కమ్యూనికేషన్‌, కదలికలు, మేధో సామర్థ్యాలను దెబ్బతీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి ఇబ్బందికర పరిస్థితిని నివారించేందుకు బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు సరికొత్త పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు. నాడీకణ మూలకణాల సాయంతో త్రీడీ ప్రింటింగ్ విధానంలో రెండు పొరల మెదడు కణజాలాన్ని పరిశోధకులు డెవలప్ చేశారు.

మెదడు బాహ్యపొర అయిన మస్తిష్క వల్కలం నిర్మాణాన్ని అది పోలి ఉంది. ఎలుకల్లో ఇలాంటి కణజాలం అచ్చం సహజసిద్ధ నిర్మాణం తరహాలో పనిచేసిందని పరిశోధకులు తెలిపారు. మానవుల్లోనూ మెదడు గాయాలకు మెరుగ్గా మరమ్మతులు చేసేందుకు ఈ త్రీడీ ముద్రణ విధానం దోహదపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Digital Strain : కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ గురించి తెలుసా ? పిల్లలు ,పెద్దలలో దీనిని నివారించటం ఎలా ?

కాగా..ప్రపంచవ్యాప్తంగా సుమారు 70 మిలియన్ల మంది ప్రజలు ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజురీ (TBI)తో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో 5 మిలియన్ కేసులు తీవ్రమైనవిగాను లేదా ప్రాణాంతకంగా ఉన్నాయి. ఇప్పటివవరకు తీవ్రమైన మెదడు గాయాలకు సమర్థవంతమైన చికిత్సలు లేవు. దీంతో ఈ సమస్య జీవన నాణ్యతపై తీవ్రమైన ప్రభావాలకు దారితీస్తుంది. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్న ఈ సరికొత్త పరిష్కార మార్గం అందుబాటులోకి వస్తే ఈ సమస్యలన్ని అధిగమించవచ్చని ఆశలు కనిపిస్తున్నాయి.