Bad Breath: నోటి దుర్వాసన బాధిస్తుందా.. నలుగురి ముందు మాట్లాడలేకపోతున్నారా.. అయితే ఇలా చేయండి

నోటి దుర్వాసన.. ఇది సాధారణంగా చాలా మందిలో ఉండే సమస్యనే. దీనివల్ల ఆరోగ్యపరంగా ఎక్కువ ఇబ్బంది లేకపోయినా.. మానసికంగా మాత్రం చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుంది

Bad Breath: నోటి దుర్వాసన బాధిస్తుందా.. నలుగురి ముందు మాట్లాడలేకపోతున్నారా.. అయితే ఇలా చేయండి

Cause of bad breath and reducing tips

Updated On : June 26, 2025 / 4:37 PM IST

నోటి దుర్వాసన.. ఇది సాధారణంగా చాలా మందిలో ఉండే సమస్యనే. దీనివల్ల ఆరోగ్యపరంగా ఎక్కువ ఇబ్బంది లేకపోయినా.. మానసికంగా మాత్రం చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమస్య ఉన్నవారు నలుగురి ముందు మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడతారు. ఎక్కడ చులకనగా చూస్తారో అని ఆత్మన్యూనతా భావంతో బాధపడుతూ ఉంటారు. సహజంగా ఈ సమస్య ఉన్నవారిలో వచ్చే ప్రధాన సందేహం ఏంటంటే.. పళ్ళను, నాలుకను బాగానే శుభ్రం చేసుకుంటున్నాం కదా ఇంకా ఎందుకుం ఇలా దుర్వాసన వస్తుంది అని అనుకుంటారు. కానీ, దానికి కారణం కేవలం పళ్ల శుభ్రత మాత్రమే కాదని చాలా కారణాలు ఉన్నాయని ప్రముఖ డాక్టర్ చెలిమెల శ్రీనివాస్ చెప్తున్నారు. నివారణ చర్యల గురించి కూడా వివరించారు. మరి అవి ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం

నోటి దుర్వాసనకు ప్రధాన కారణాలు ఏంటి?

1.పళ్లను సరిగా క్లీన్ చేయకపోవడం:
మనం తిన్న ఆహరంలోని అవశేషాలు పళ్లు సందుల్లో పేరుకుపోయి ఉంటాయి. వీటి వల్ల నోట్లో బ్యాక్టీరియా పెరిగి దుర్వాసన వస్తుంది. కాబట్టి పళ్లను బాగా శుభ్రం చేసుకోవాలి.

2.నాలుకను సరిగా శుభ్రం చేయకపోవడం:
దుర్వాసనకు మరో ప్రధాన కారణం నాలుకపై పేరుకుపోయి తెల్లటి పొర. దానిపై బ్యాక్టీరియా పెరగడం వల్ల దుర్వాసన ఉత్పన్నమవుతుంది. కాబట్టి, పళ్ళను శుభ్రం చేసుటప్పుడు నాలుకను కూడా బాగా శుభ్రం చేయాలి.

3.నోరు ఎండిపోవడం:
మన నోరు ఎప్పుడు తడిగా, లాలాజలాలు ఊరుతూ ఉండాలి. లాలాజల స్థాయిలు తగ్గినప్పుడు నోటి శుభ్రత తగ్గుతుంది. దాని వల్ల నోట్లో బ్యాక్టీరియా పెరిగిపోయి దుర్వాసన వస్తుంది.

4.దంత సమస్యలు:
పళ్లలో చెడు, కావిటీస్, గమ్స్ సంభంధించిన ఇన్ఫెక్షన్లు కూడా దుర్వాసనకు దారి తీస్తాయి. అందుకే పళ్ల ఆరోగ్యం చాలా అవసరం.

5.అహారపు అలవాట్లు:
మనం తినే ఆహరంలో వెల్లులి, ఉల్లిపాయ, మాంసాహారం వంటివి ఎక్కువగా తినడం వల్ల కూడా శ్వాసలో వాసన రావచ్చు.

6.ధూమపానం / మద్యంపాణం:
ధూమపానం/మద్యపానం చేసేవారిలో నోటి దుర్వాసన అధికంగా ఉంటుంది. ఇవి నోటి శుభ్రతను దెబ్బతీసి, శ్వాసను దుర్వాసనగా మారుస్తాయి.

7.జీర్ణ సమస్యలు:
జీర్ణవ్యవస్థలో ఏర్పడే సమస్యల వల్ల కూడా నోటి దుర్వాసన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆమ్లత, అజీర్ణం వంటి సమస్యల వల్లనూ నోటి దుర్వాసన వస్తుంది.

దుర్వాసన నివారణకు ఆచరించవలసిన అలవాట్లు

  • ఉదయం, రాత్రి రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవాలి. ఫ్లోరైడ్ పేస్ట్ మాత్రమే వాడాలి.
  • నోటిలో దుర్వాసనకు ప్రధాన కారణం నాలుక మీద ఉండే బాక్టీరియానే. కాబట్టి నాలుకను శుభ్రం చేయడం మర్చిపోవద్దు.
  • పళ్ళ మధ్య చిక్కిన ఆహారాన్ని తొలగించేందుకు ఫ్లోస్ వాడాలి.
  • నీటిని తరచూ తాగుతూ ఉండాలి. అప్పుడే నోటిలో లాలాజలం స్థాయిలు సరిగా ఉంటాయి. .
  • అధిక పచ్చి కూరగాయలు, పండ్లు అధికంగా తీసుకోవాలి. మాంసాహారానికి దూరంగా ఉండటం మంచిది. వెల్లులి, మాంసాహారం తిన్న తర్వాత నోరు బాగా క్లీన్ చేయాలి.
  • పొగతాగడం, మద్యం వంటి అలవాట్లు పూర్తిగా మానాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి దంత వైద్యుడిని కలవడం మంచిది.