Sleep Deprivation Effects : ప్రతిరోజూ 7 గంటల కన్నా తక్కువగా నిద్రపోతున్నారా? ఈ 10 ప్రతికూల ప్రభావాలతో జాగ్రత్త!

Sleep Deprivation Effects : నిద్రలేమితో బాధపడుతున్నారా? మీ ఆరోగ్యం డేంజర్‌లో ఉంది జాగ్రత్త.. రోజుకు 7 గంటల కన్నా తక్కువ నిద్రపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Sleep Deprivation Effects : ప్రతిరోజూ 7 గంటల కన్నా తక్కువగా నిద్రపోతున్నారా? ఈ 10 ప్రతికూల ప్రభావాలతో జాగ్రత్త!

What Happens If You Sleep For Less Than 7 Hours Daily

Sleep Deprivation Effects : మీరు రోజుకు ఎన్ని గంటలు నిద్రపోతారు. సాధారణంగా అందరికి ప్రతిరోజూ 7 గంటల నుంచి 8 గంటల నిద్ర అవసరం. 7 గంటల కన్నా తక్కువ నిద్రపోతే ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి అనేది తప్పక తెలుసుకోవాలి. వాస్తవానికి దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిఒక్కరికి నిద్ర ఎంతో అవసరం. అలాంటి నిద్ర విషయంలో అనేక మంది అశ్రద్ధ చేస్తుంటారు. నిద్రలేమి అనేది మొత్తం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది.

రోజుంతా ఏదో ఒక పనితో శరీరానికి కొంచెం కూడా విశ్రాంతి ఉండదు. కేవలం నిద్రించే సమయంలోనే శరీరానికి బాగా విశ్రాంతి దొరుకుతుంది. అదే నిద్రలేకపోతే జీవక్రియ దెబ్బతింటుంది. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. సరైన నిద్రతో జ్ఞాపకశక్తి పెరగడం, హార్మోన్ నియంత్రణ, రోగనిరోధక వ్యవస్థ పనితీరు మెరుగుపడటం వంటి అనేక అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి.

Read Also : Vitamin D Levels : శీతాకాలంలో మీ విటమిన్ డి స్థాయిలను పెంచడానికి అద్భుతమైన డైట్ ఇదిగో..!

రాత్రి నిద్ర ఎంతో మేలు.. :
వ్యక్తిగతంగా నిద్రపోయే సమయంలో అనేక మార్పులు ఉండవచ్చు. సగటున, చాలా మంది రాత్రికి 7 గంటల నుంచి 9 గంటల నిద్ర అవసరం. ఈ వ్యవధి శారీరక, మానసిక పునరుద్ధరణకు చాలా మంచిది. గాఢ నిద్రతో సహా అవసరమైన నిద్ర దశల ద్వారా శరీరం విశ్రాంతి దశలోకి వెళ్తుంది. ప్రతిరోజూ తగినంత నిద్ర లేకపోవడం అనేక ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది.

దీర్ఘకాలిక నిద్రలేమి మొత్తం ఆరోగ్యంపై తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది. నిద్రలేమితో అనేక ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నిద్రలేమి సమస్య నుంచి బయటపడాలంటే కనీసం ప్రతిరోజు 7 గంటల నుంచి 8 గంటల వరకు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ నిద్రపోవడం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాల గురించి ఓసారి తెలుసుకుందాం.

నిద్రలేమి వల్ల కలిగే 10 ప్రతికూల ప్రభావాలివే :
1. జ్ఞాపకశక్తిపై తీవ్ర ప్రభావం :
నిద్ర లేకపోవడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గడం, శ్రద్ధ కోల్పోవడం, నిర్ణయం తీసుకునే నైపుణ్యాలను ప్రభావితం చేస్తుంది. ఏకాగ్రతను కోల్పోతారు. విద్యలో వెనుకబాటు లేదా పనితీరుకు మందగించడం వంటివి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

2. యాక్సిడెంట్ల రిస్క్ ఎక్కువ :
నిద్ర లేమితో సమన్వయ లోపం ఏర్పడుతుంది. ఏ పని సరిగా చేయలేరు. శరీరాన్ని మరింత బలహీనపరుస్తుంది. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు, మిషన్లను ఆపరేట్ చేస్తున్నప్పుడు లేదా ఇతర ప్రమాదకరమైన పనులను చేస్తున్నప్పుడు ప్రమాదాలను పెంచుతుంది.

3. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ :
దీర్ఘకాలిక నిద్ర లేకపోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. సాధారణ జలుబు లేదా ఫ్లూ వంటి ఇన్‌ఫెక్షన్‌లు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.

4. మూడ్ మార్పులు :
తగినంత నిద్ర లేకపోవడంతో చిరాకు, మానసిక కల్లోలం, ఆందోళన, నిరాశ వంటి మానసిక ఆరోగ్య రుగ్మతల ప్రమాదం ఎక్కువగా పెరుగుతుంది.

What Happens If You Sleep For Less Than 7 Hours Daily

Sleep Less Than 7 Hours Daily

5. అధిక బరువు లేదా ఊబకాయం :
నిద్ర లేమితో ఆకలి పెరగడమే కాదు.. హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. దీని వల్ల ఆకలి, అనారోగ్యకరమైన ఆహారంపై కోరికలు పెరుగుతాయి. కాలక్రమేణా బరువు పెరగడంతో పాటుస్థూలకాయానికి దారితీస్తుంది.

6. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం :
తగినంత నిద్ర లేకపోవడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్‌లు వంటి దీర్ఘకాలిక ప్రాణాంతక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది.

7. బలహీనమైన గ్లూకోజ్ జీవక్రియ :
నిద్ర లేకపోవడంతో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే శరీర సామర్థ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఇన్సులిన్ నిరోధకత, మధుమేహం ముప్పు ప్రమాదాన్ని మరింత పెంచుతుంది.

8. హార్మోన్ల అసమతుల్యత :
నిద్ర లేమితో ఆకలి నియంత్రణ కోల్పోతారు. తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. లైంగిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. వివిధ హార్మోన్లలో సాధారణ నియంత్రణకు తీవ్ర అంతరాయం కలిగిస్తుంది.

9. గుండెజబ్బుల ముప్పు :
దీర్ఘకాలిక నిద్ర లేకపోవడం శరీరంలో తాపజనక ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది. గుండె జబ్బులు, మధుమేహం వంటి ఇతర అనారోగ్య సమస్యలతో సహా వివిధ ప్రాణాంతక సమస్యలు తలెత్తుతాయి.

10. బలహీనమైన చర్మం :
నిద్ర తగినంత లేకపోతే అది చర్మంపై తీవ్ర ప్రభావం పడుతుంది. చర్మం కాంతివిహీనంగా మారిపోతుంది. అంతేకాదు.. నీరసం, పొడిబారడం, ముడతలు, మొటిమలు, తామర వంటి చర్మ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.

అయినప్పటికీ, కొంతమంది సహజంగా తక్కువ నిద్రపోతుంటారు. మరికొందరికి ఎక్కువగా నిద్రపోతుంటారు. వయస్సు, కార్యాచరణ స్థాయి, ఆరోగ్య పరిస్థితులు, జీవనశైలి కారకాల ఆధారంగా నిద్రపోయే వ్యవధి మారవచ్చు. మీకు నిద్రసరిపోలేదంటే.. శరీరం ముందే మీకు సంకేతాలను తెలియజేస్తుంది. సరైన ఆరోగ్యం పొందాలంటే ప్రతిరోజూ 7 నుంచి 8 గంటల పాటు తగినంత నిద్ర పోవాలనేది తప్పక పాటించాలి.

Read Also : Common Myths Green Tea : గ్రీన్ టీ తాగే విషయంలో 3 అపోహలివే.. అసలు నమ్మొద్దంటున్న ఆరోగ్య నిపుణులు..!